హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు సోమవారం ప్రారంభయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలకు స్పీకర్ మధుసుదనా చారి అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రుణాలపై బ్యాంకులన్నిటింకి ఏకత్వ ప్రతిపాదన ఉండాలని సభలో కోరారు. రైతులను కొన్ని బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు.