bajireddy govardhan reddy
-
కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌లకు చెమటలు పట్టిస్తున్న బీజేపీ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తోంది. మూడు పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా బరిలో సమరోత్సాహం ప్రదర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగగా వారిద్దరికీ దీటుగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు తనదేనంటూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో గెలుపు ఎవరిదన్నది అంతుపట్టని విధంగా తయారైంది. మూడు పార్టీల ఎత్తులు, పై ఎత్తులు, జాతీ య అగ్రనేతల పర్యటనలతో కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ► నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ మధ్య పోటాపోటీ నెలకొంది. ► బాల్కొండలో బీఆర్ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, కాంగ్రెస్ నుంచి ముత్యాల సునీల్‌రెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ► ఆర్మూర్ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత ఉన్నప్పటికీ అభ్యర్థి వినయ్‌రె డ్డి స్పీడ్ తగ్గడంతో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రా కేశ్‌రెడ్డి ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ సిట్టింగ్ అ భ్యర్థి జీవన్‌రెడ్డి సైతం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ► బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్, బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. ► నిజామాబాద్ రూరల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడుస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్ నామమాత్రంగా పోటీలో ఉన్నారు. ఆయన డిచ్పల్లి మండలంలో మాత్రమే ప్రభావం చూపిస్తున్నారు. ► బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యరి్థ, స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి మంచి జోష్‌మీద ఉన్నారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మున్నూరుకాపు కావడంతో కలిసి వస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి సెటిలర్స్ మద్దతుతో బలం పెరిగినప్పటికీ, ఆయనపై దళితుల భూముల కబ్జా ఆరోపణలు ఉండడంతో ప్రభావం చూపిస్తోంది. ► ఎల్లారెడ్డిలో సిట్టింగ్, బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్, బీజేపీ అభ్యర్థి సుభాష్‌రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ► జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హ న్మంత్‌సింధే, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు, బీజే పీ అభ్యర్థి అరుణతార మధ్య పోటాపోటి నెలకొంది. -
TSRTC: ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. 286 మందికి అవార్డులు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్‌గా నిలిచిందన్నారు. టీఎస్ఆర్టీసీ ముందు 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ఉందని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా సజ్జనార్.. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్‌గా నిలిచింది. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్ లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ లతో పాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హాజరయ్యారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. రాఖీ పౌర్ణమి ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజయన్లకు ట్రోఫీలను అందజేశారు. మొత్తం 286 మందికి అవార్డులు వరించగా.. వారిలో రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ కు 36, శ్రావణ మాసం ఛాలెంజ్ కు 30, జోనల్ స్థాయి ఉద్యోగులకు 180, ఎక్స్ ట్రా మైల్ లో 25, లాజిస్టిక్స్ విభాగంలో 15 మంది ఉన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్ లతో పాటు సూపర్వైజర్స్, డిపో మేనేజర్స్, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు.. ఇలా అన్ని విభాగాల వారు పురస్కారాలను అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. క్లిష్ట పరిస్థితులను తట్టుకుని తన కాళ్ల మీద తాను నిలబడగలిగే స్థాయికి సంస్థ ఎదగడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రస్థానంలో సిబ్బంది కృషి ఎనలేనిదని వివరించారు. సంస్థ విసిరిన ప్రతి ఛాలెంజ్ ను సిబ్బంది విజయవంతం చేశారని చెప్పారు. రాఖీ పౌర్ణమికి రికార్డుస్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంతమొత్తంలో ఆదాయం రాలేదన్నారు. శ్రావణ మాసంలో ఛాలెంజ్ లోనూ గత ఏడాదితో పోల్చితే అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ రికార్డుల్లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. నిజాయతీగా, నిబద్దతతో ఉత్తమ సేవలందించే అధికారులు, ఉద్యోగులే సంస్థకు నిజమైన బ్రాండ్ అంబాసిండర్లని పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్ గా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ జ్జనర్, ఐపీఎస్ (@SajjanarVC) గారు అన్నారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్… pic.twitter.com/G5vLCs4aRV — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 7, 2023 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ “రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకం. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పాటు శుభముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో.. 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ను నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించడం జరిగింది. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22 వరకు ఈ ఛాలెంజ్ అమల్లో ఉంటుంది. గత ఛాలెంజ్ ల మాదిరిగానే పనిచేసి..ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలి.” అని సజ్జనర్ కోరారు. పండుగలకు సిబ్బంది చేస్తోన్న త్యాగం గొప్పదని, ఇంట్లో కుటుంబసభ్యులను, బంధుమిత్రులను విడిచి విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. పండగ సమయాల్లో పోలీస్, రవాణా శాఖలు సంస్థకు ఎంతగానో సహకరిస్తున్నాయని గుర్తుచేశారు. “టీఎస్ఆర్టీసీ కష్టకాలంలో ఉన్నప్పటికీ 2017 నుంచి విడతల వారీగా పెండింగ్ లో ఉన్న 9 డీఏలను ఉద్యోగులకు సంస్థ మంజూరు చేసింది. బకాయిల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన ఉన్న అరియర్స్, సీసీఎస్ నిధులు, బాండ్లకు సంబంధించిన ప్రతి రూపాయిను కూడా చెల్లిస్తాం. బకాయిలు చెల్లింపు విషయంలో ఒక ప్రణాళికను సంస్థ రూపొందించింది.” అని సజ్జనర్ తెలిపారు. ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూనే.. సిబ్బంది సంక్షేమానికి కూడా సంస్థ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ నవంబర్, డిసెంబర్ నుండి 1000 కొత్త డీజిల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్లాన్ చేసినట్లు వివరించారు. ఛాలెంజ్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారాలు - రాఖీ పౌర్ణమి ఛాలెంజ్: పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష) సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ(రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ కరీంనగర్(రూ.50 వేలు). - శ్రావణ మాసం ఛాలెంజ్: పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష), సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ (రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ ఆదిలాబాద్(రూ.50 వేలు). ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఎఫ్ఎం విజయ పుష్ఫ, సీసీవోఎస్ విజయ భాస్కర్, సీసీఈ రాంప్రసాద్, సీటీఎం(కమర్షియల్) సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సంస్థ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబరు నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు 8 డీఏలను మంజూరు చేశామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. "పెండింగ్ లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 2, 2023 ఇది కూడా చదవండి: వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణలో మూడు రోజులు గట్టి వానలే! -
టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఆల్ టైం రికార్డు
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది కన్నా లక్ష మంది అదనంగా రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే, గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈ సారి ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీ పండగ నాడు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈ సారి 36.77 లక్షల కిలో మీటర్లు నడిచాయి. రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు #TSRTC సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 1, 2023 20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) విషయానికి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును పునరావృతం చేసింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈసారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమికి 97.05 శాతం ఓఆర్ నమోదైంది. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది. రాఖీ పౌర్ణమి నాడు రాష్ట్రంలోని 20 డిపోల్లో ఓఆర్ 100 శాతానికి పైగా దాటింది. ఆయా డిపోల్లో బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. హుజురాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూర్, మహబుబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్ నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా ఒక కిలోమీటర్ కు రూ.65.94ను వరంగల్-1 డిపో, రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించింది. ఈ రెండు కూడా సంస్థ చరిత్రలోనూ ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ (ఈపీకే) ఆల్ టైం రికార్డు గమనార్హం. ప్రయాణికులకు ధన్యవాదాలు “ప్రజా రవాణా వ్యవస్థ వెంటే తాము ఉన్నామని ప్రజలు మరోసారి నిరూపించారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి రాఖీ పౌర్ణమికి కూడా సంస్థకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక్క రోజులో దాదాపు 41 లక్షల మంది ప్రయాణికులు సంస్థ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సంస్థ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆదరణ, పోత్సాహం వల్ల ఈ సారి ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీల చరిత్రలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రాలేదు. గత ఏడాది రాఖీ నాడు 12 డిపోలు మాత్రమే 100 శాతానికిపైగా ఓఆర్ సాధించగా.. ఈ సారి 20 డిపోలు నమోదు చేశాయి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్(ఐపీఎస్) మీడియాకు తెలిపారు. రాఖీ పండుగ నాడు ఎంతో నిబద్దతతో సిబ్బంది పనిచేశారని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు రాఖీ పండుగ రోజును త్యాగం చేసి మరీ విధులు నిర్వర్తించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి.. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారని సిబ్బందిని అభినందించారు.. ఎంతో మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను మొచ్చకుంటూ తమకు, ఉన్నతాధికారులకు సందేశాలు పంపించారని పేర్కొన్నారు. “ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే.. సంస్థ సిబ్బంది మాత్రం విధుల్లో నిమగ్నై వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అందుకు రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా, తదితర ప్రధాన పండుగల్లో సిబ్బంది చేసే త్యాగం ఎనలేనిది. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహన్ని స్పూర్తిగా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పని చేసి భవిష్యత్ లోనూ మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలందించాలి. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ నమ్మకాన్ని కొల్పోకుండా మంచి ఫలితాలు వచ్చేలా పాటుపడాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సిబ్బందికి పిలుపునిచ్చారు. -
భారీ వర్షాలు.. బస్ డ్రైవర్లు, కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ సూచనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని సూచించారు. రాష్ట్రంలో వారం రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా డ్రైవర్లందరూ భద్రత సూచనలు పాటించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలించిందన్నారు. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకుందని గుర్తుచేశారు. ఆర్టీసీ సంస్థలో సుశిక్షుతులైన డ్రైవర్లు ఉన్నారని, అయినా వర్షాకాలంలో మరోసారి భద్రతా నియమాలను మననం చేసుకుని తూ.చ పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం ఎంతైనా అవసరం ఉందన్నారు. జాగ్రత్త సూచనలు 1. వర్షం కురుస్తున్నప్పుడు వేగ నియంత్రణ పాటించాలి 2. మలుపుల వద్ద ఇండికేటర్‌ను ఉపయోగించాలి. 3. ముందు వెళ్ళే వాహనాలతో సురక్షిత దూరాన్ని పాటించాలి. దట్టమైన వర్షం ఉన్నచోట హారన్ ఉపయోగించాలి. 4. వర్షం కురుస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయనపుడు వైపర్ వాడాలి. హెడ్‌లైన్‌ను lowbeamలోఫాగ్ lights తప్పనిసరిగా వాడాలి. వైపర్లను కండిషన్లో ఉంచుకోగలరు. బస్సు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లాలి. 5. చెరువులు కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. నదులు కల్వర్టులు ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దు. 6. Windscreen గ్లాసులను వైపర్‌తో బయట వైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్‌తో శుభ్రపరచాలి. 7. డ్యూటికి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్ లైట్స్ పనితీరును పరిశీలించుకొనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయములో సమీప బస్ స్టేషన్ నందు ఆపుకొని నీళ్ళతో ముఖంకాళ్ళు చేతులు శుభ్రపరుచుకోవాలి. 8. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించాలి. డ్యూటికి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలి. 9. దట్టమైన వర్షం ఉన్న సమయంలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయరాదు. 10. అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయకూడదు. వర్షం పడుతున్నప్పుడు తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి. 11. వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్ చేయునపుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులో Wrong Route లో వెళ్లరాదు. 12. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు. 13. అకస్మాత్తుగా బస్సు యొక్క దిశను మార్చకూడదు. 14. అతివేగంగా బస్సును నడపరాదు. 15. అకస్మాత్తుగా ఇండికేటర్ వేయడం వలన వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక సడన్ గా ఇండికేటర్ వేయకూడదు. 16. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు అతి వేగం తో డ్రైవింగ్ చేయరాదు. 17. బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఏయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి. 18. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితిలోనూ బస్సును న్యూట్రల్ చేసి నడవకూడదు. 19. హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. నగరంలో మ్యాన్ హోల్స్ మరియు రద్దీ ప్రదేశాలలో కండక్టర్ సహాయంతో వాహనాన్ని నడపగలరు. 20. బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని నివారించాలి, ఫుట్ బోర్డు లో ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి. 21. నగరంలో అనేక మంది ప్రయాణికులు నడిచే బస్సు ఎక్కడం జరుగుతుంది. దీని ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారి గమ్య స్థానం లోనే కండక్టర్, డ్రైవర్ గారు ఆపగలరు, బస్సులోకి చేర్చుకోగలరు. 22. ఫోన్ మాట్లాడుతూ, ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు. 23. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు. 24. తడి చేతులతో విద్యుత్ ప్రవాహం ఉన్న స్విచ్ బోర్డులను తాకరాదు. ఎంతో పేరున్న ఆర్టీసీ సంస్థ.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డ్రైవర్లు, కండక్టర్లు సురక్షితంగా బస్సులు నడిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని సంస్థకు సహకరించాలని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సూచనలు జారీ చేశారు.. -
TSRTC: ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టీ-9 టికెట్' సమయాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. టీ-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబి టికెట్ వర్తిస్తుంది. టీ-9 టికెట్ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. అయితే, ‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టి-9 టికెట్‌ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ టికెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. జూన్ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. టీ-9 టికెట్ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు. ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్థ పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబితో టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్ సిటిజన్స్ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. సంస్థను ఆదరించాల’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వారు తెలిపారు. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి: నవ్య ఎపిసోడ్.. ‘ఆడియోలు, వీడియోల’పై రాజయ్య సవాల్, కడియంపైన సంచలన ఆరోపణలు -
నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌కు కొత్త కళ
సాకక్షి, నిర్మల్: నిర్మల్ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ అభివృద్ధిపై దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో శనివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మల్ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మించే ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద సెల్లార్, జి-ప్లస్ వన్, శుభకార్యాలకు నిర్వహించే హాల్, నిర్మాణం చేయాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ ద్వారా రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్‌లలో 53 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. ఆర్టీసీ అధికారులతో నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ బస్టాండ్ఘా నిర్మించేందుకుగా తీసుకోవాల్సిన నిర్ణయాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో చర్చించారు. ఆర్టీసీ సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు బస్టాండులను ఆధునీకరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.బస్టాండులను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చి ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే నిర్మల్ బస్ స్టేషన్‌కు నూతనంగా ప్రారంభించిన ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా సర్వీసులను నడుపుతున్నారు. టిఎస్ ఆర్టిసి ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని బాజిరెడ్డి తెలిపారుజ నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్మల్‌లో నిర్మించే టీఎస్ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రత్యేకతలు ఇవే.. 1. 1.3 ఎకరాలలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 2. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్ మరియు జి ప్లస్ వన్ నిర్మాణం. 3. నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్మాణం చేయడానికి 35 కోట్ల నిధుల ఖర్చు. 4. కమర్షియల్ కాంప్లెక్స్ శుభకార్యాలు నిర్వహించేందుకు హాలును ప్రత్యేకంగా నిర్మాణం. 5. బస్టాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం 53 స్టాళ్లను ఏర్పాటు. 6. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్, బస్సుల కోసం వేచి ఉన్న వారికోసం ఎల్సీడీ తెరల ఏర్పాటు 7. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు. 8. మరో 10 తరాలకు అడ్వాన్స్‌గా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 9. టీఎస్ఆర్టీసీ బస్టాండుల యొక్క ఆధునికరించుకోవడం వల్ల ప్రయాణికులను ఆకట్టుకోవడం జరుగుతుందని, ప్రయాణికులు కూడా ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక రాయితీలు బస్సు సర్వీసులను ఆదరించాలని మరోసారి బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. 10. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం ఉండాలని తెలియజేశారు. -
పర్యావరణ హితం, సౌకర్యవంతం.. ఈ–గరుడ ఎలక్ట్రిక్ వాహనాల ముఖ్య ఉద్దేశం ఇదే
మియాపూర్: కాలుష్య నివారణతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించడమే ఈ– గరుడ ముఖ్యోద్దేశ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ– గరుడ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ.. మియాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని బస్టాప్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం కోసం ఎలక్ట్రికల్ వాహనాలను టీఎస్ఆర్టీసీ విస్తరిస్తోందన్నారు. రానున్న రోజుల్లో 1300 బస్సులు హైదరాబాద్ సీటీలో, 550 సదూర ప్రాంతాలలో నడుపుతామని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీలకు సంబంధించిన యూనిట్లకు అమర్‌రాజా సంస్థతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో శంఖుస్థాపన చేశారన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 50 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించామని, అందులో ప్రస్తుతం 10 బస్సులు ప్రారంభించామని, విడతల వారీగా మిగతా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామరని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా.. కొత్త బస్సులను ప్రవేశ పెడుతూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 10 వేల బస్సులు ప్రజా రవాణాకు వినియోగిస్తున్నామని తెలిపారు. త్వరలో నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటు వాహనాలను తట్టుకోవడం ఆర్టీసీకి కష్టంగా ఉండేదని, కానీ ప్రస్తుతం ఆర్టీసీ వాహనాలను తట్టుకోవడం ప్రైవేటుకు కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఆర్టీసీ నడుస్తోందని తెలిపారు. కొత్త కారులలో ఉండే ఆధునిక సదుపాయాలు ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సుల కారణంగా ట్రాఫిక్ సమస్య పెరిగిందని, నియంత్రించేదుకు బస్సు టెర్మినల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఒలెక్ట్రా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
TSRTC: పాదచారులూ.. జర జాగ్రత్త
హైదరాబాద్: పాదచారులు రహదారులపై వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సూచిస్తోంది. అజాగ్రత్తగా వల్ల తమ విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని చెప్తోంది. కొందరు పాదచారులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే టీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురువుతున్నాయని తమ పరిశీలనలో వెల్లడయిందని తెలిపింది. ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు రోడ్డు ప్రమాదాల్లో 283 మంది మరణించారు. అందులో 71 మంది పాదచారులు ఉండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారిలో 25 శాతం పాదచారులే ఉండటం గమనార్హం. ప్రమాదాలు జరిగిన తీరుపై ఇటీవల టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా విచారణ చేశారు. ట్రాఫిక్ రూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్లే పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఈ విచారణలో వెల్లడైంది. ‘రోడ్డు ప్రమాదాల నివారణకు టీఎస్ఆర్టీసీ అన్ని చర్యలను తీసుకుంటోంది. దాదాపు 4 వేల మంది అద్దె బస్సు డ్రైవర్లకు ఇటీవల ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలనూ సేప్టీ వార్డెన్లను నియమించి.. ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పడు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తోంది. కానీ పాదచారులు తెలిసో తెలియకో చేసే చిన్న తప్పిదాల వల్ల టీఎస్ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే వారికి ట్రాఫిక్ రూల్స్‌పై సరైన అవగాహన లేదనే విషయం స్పష్టమవుతోంది. అందుకే రహదారులపై పాదచారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారించిన ప్రాణాలకే ప్రమాదం ’అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. దేశంలో రోడ్డు ప్రమాదానికి గురువుతున్న ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు పాదచారులుంటున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఆయా ప్రమాదాల్లో 15 నుంచి 20 శాతం మంది పాదచారులు మృత్యువాతపడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పాదచారులు ట్రాపిక్ రూల్స్‌పై స్వీయ అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాదచారులు అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కొల్పోయి తమ కుటుంబాలకు శోకాన్ని మిగల్చవద్దని హితవు పలికారు. పాదచారులూ.. ఈ నిబంధనలు పాటించండి పాదచారులు ఫుట్‌పాత్‌లను ఉపయోగించుకోవాలి. రోడ్డును దాటేటప్పడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. గ్రామీణ ప్రాంతాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులను పాదచారులు నిర్లక్ష్యంగా దాటుతుంటారు. రోడ్డు దాటే క్రమంలో జీబ్రాలైన్‌ను వినియోగించుకోవాలి. జీబ్రాలైన్ లేని చోట ఇరువైపులా వాహనాల రాకపోకలు లేనప్పుడే రోడ్డును క్రాస్ చేయాలి. పరధ్యానంలో అసలే ఉండొద్దు. పాదచారులు రాత్రుళ్లు రోడ్డు దాటేటప్పడు ఫ్లాష్ లైట్లను ఉపయోగించాలి. సెల్‌ఫోన్, హియర్ ఫోన్స్ వాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరం. వాటి వల్ల వాహనాల హరన్ వినపడకపోవచ్చు. రోడ్డును తొందరగా దాటేందుకు కొందరూ పరిగెత్తుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలి. -
టీఎస్ఆర్టీసికి సంక్రాంతి బొనాంజ.. 11 రోజుల్లో భారీ ఆదాయం!
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ.62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది. కిలోమీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగింది. “టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారు. సాధారణ చార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. అంతేకాదు, రద్దీకి అనుగుణంగా మా సిబ్బంది అద్బుతంగా పనిచేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించిన ప్రజలకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇలానే ఆదరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన వల్ల తమ సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ సిబ్బంది నిబద్దతతో పనిచేశారని, వారి కృషి వల్లే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్ బయోటాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ కుటుంబంలోని ప్రతి ఒక్క సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలని అందించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా తమ సంస్థకు రవాణా, పోలీస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు సహకరించారని గుర్తుచేశారు. ఆయా విభాగాల సమన్వయంతో పనిచేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. టీఎస్ఆర్టీసీకి సహకరించిన రవాణా, పోలీస్, ఎన్హెచ్ఏఐ అధికారులకు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. -
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగులో ఉన్న ఐదు డీఏలకుగాను కొత్తగా మరో రెండు డీఏలను సంస్థ ప్రకటించింది. దీంతోపాటు గత దసరా పండుగ సందర్భంగా ఇవ్వలేకపోయిన పండుగ అడ్వాన్సును, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సకలజనుల సమ్మె కాలపు వేతనపు బకాయిలను కూడా చెల్లించనున్నట్టు వెల్లడించింది. మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్యతో శుక్రవారం సమావేశమైన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయనున్నట్టు ఆ సమాఖ్య సంకేతాలిచ్చింది. సమాఖ్య ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు వారం రోజుల క్రితం చర్చించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి వచ్చాక డిమాండ్లపై చర్చించి మళ్లీ వివరాలు వెళ్లడిస్తామని ఆ భేటీలో వారు పేర్కొన్నారు. దానికి కొనసాగింపుగా ఆర్టీసీ చైర్మన్ వారితో శుక్రవారం భేటీ అయ్యారు. డిమాండ్లలో 2డీఏల చెల్లింపు, దసరా పండుగ అడ్వాన్సు చెల్లింపు, విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులకు సకలజనుల సమ్మె కాలపు వేతనం చెల్లింపు, విశ్రాంత ఉద్యోగులకు బకాయి ఉన్న లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపులను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. అయితే, ప్రధాన డిమాండ్లయిన వేతన సవరణ, బాండ్ల డబ్బు చెల్లింపు, కార్మిక సంఘాల పునరుద్ధరణ, సీసీఎస్, పీఎఫ్ బకాయిల చెల్లింపులపై హామీ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమాఖ్య ప్రతినిధులు సమావేశం అర్ధంతరంగా ముగించారు. నెరవేర్చే అంశాలకు సంబంధించిన నిర్ణయాలను స్వాగతిస్తున్నామని, కానీ ప్రధాన డిమాండ్ల విషయంలో దాటవేత ధోరణనిని నిరసిస్తున్నామని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. సమాఖ్య సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించుకుని మునుగోడు ఎన్నిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఆర్టీసీ ఎండీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎన్నికల కోడ్‌వల్లే.. ప్రస్తుతం మునుగోడు ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్నందున ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయలేకపోతున్నామని బాజిరెడ్డి వెల్లడించారు. 2019 తాలూకు డీఏకు సంబంధించి బకాయిల కింద రూ.20 కోట్లు విడుదల చేస్తున్నామని, మరో రెండు డీఏల అమలుకు గాను రూ.15 కోట్లు, సకల జనుల సమ్మె కాలానికి సంబంధించి 8053 మంది విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనం కింద రూ.25 కోట్లు, విశ్రాంత ఉద్యోగులకు బకాయి ఉన్న లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు సంబంధించి రూ.20 కోట్లు, పండుగ అడ్వాన్సు కింద (క్రిస్టియన్లకు కూడా)రూ.20 కోట్లు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు రాత్రి సర్క్యులర్లు జారీ అయ్యాయి. 3 వేల కోట్ల వరకు ఉన్న పెండింగు బకాయిల చెల్లింపు డిమాండ్ చేయగా, కేవలం రూ.100 కోట్లను మాత్రమే విడుదల చేయటం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడ్‌ను అడ్డు పెట్టుకుని ప్రధాన డిమాండ్లను దాటవేయటం సరికాదని, గతంలోనే ప్రకటించిన వేతన సవరణ బకాయిలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలకు కోడ్ అడ్డురానప్పుడు వీటికి ఎందుకు వస్తుందని ప్రశ్నించాయి. డిమాండ్లలో రూ.100 కోట్ల విలువైన వాటికి నిధులు విడుదల చేయటాన్ని స్వాగతిస్తున్నామని, ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవటాన్ని తప్పుపడుతున్నామని కారి్మక సంఘాల నేతలు కమాల్‌రెడ్డి, నరేందర్, నాగేశ్వర్రావు, రాజిరెడ్డి తదితరులు తెలిపారు. ప్రజా రవాణా అవసరాలరీత్యా కొత్తగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులు కొంటున్నట్టు ఎండీ సజ్జనార్ చెప్పారు. 360 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచినట్టు పేర్కొన్నారు. వీటిని ఇంటర్సిటీ కనెక్టివిటీగా నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు నడపనున్నట్టు పేర్కొన్నారు. -
త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం పద్రాగస్టు రోజున తీపి కబురు చెప్పింది. పెండింగ్‌లో ఉన్న డీఏను త్వరలో అందజేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం బస్‌భవన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ నెల జీతభత్యాలతో పాటు డీఏను కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు చెల్లించవలసిన రూ.వెయ్యి కోట్ల బకాయీలను కూడా అందజేయనున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను బస్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. సంస్థ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కండక్టర్లు, డ్రైవర్లు ఈ వేడుకలలో పాల్గొన్నారు. గ్రేటర్లో అల్బియాన్ బస్సు.. డెక్కన్ క్వీన్‌గా పేరొందిన 1932 నాటి అల్బియాన్ బస్సును హైదరా బాద్‌లోని ప్రధాన రోడ్లపై ప్రదర్శించనున్నట్లు చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. అలాగే ఈ బస్సు విశేషాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు తెలియజేయనున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్టీసీలో బీడబ్ల్యూఎస్ పథకం ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. త్వరలో 300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఘన సన్మానం.. ఈ వేడుకలలో భాగంగా నిజాం ప్రభుత్వ రోడ్డు రవాణా విభాగంలో పని చేసిన నరసింహ (97), ఎం.సత్తయ్య (92)లను ఆర్టీసీ ఘనంగా సన్మానించింది. తమను గుర్తించి సన్మానించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆర్టీసీ నుంచి లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
TSRTC: ఛైర్మన్ చరిత్రాత్మక నిర్ణయం.. ఎండీ సజ్జనార్ హర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గౌరవంగా ఇచ్చే జీతభత్యాలని తీసుకోనని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని లిఖిత పూర్వకంగా వ్రాసి ఇచ్చారు. చదవండి: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలని, ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్థికభారం మోపడం ఇష్టం లేక తన వంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఛైర్మన్ బాజిరెడ్డి ఆర్టీసీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉదారంగా తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం పట్ల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ అధికారులు, సూపర్వైజర్లు ఉద్యోగులు హర్షం వక్తం చేశారు. -
అరవింద్ వ్యాఖ్యలు గాలి మాటలే: బాజిరెడ్డి
సాక్షి, నిజామాబాద్: దుబ్బాక ఎన్నికల్లో నష్టం జరిగిన మాట వాస్తమమేనని మంత్రి కేటీఆర్ అంగీకరించారని, కొందరు ఒక్క గెలుపుతోనే విర్రవీగుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర బీజేపీ పై మండిపడ్డారు. నిజామాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాక్షసుల్లా తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నేతలకు హిందుత్వ సిద్ధాంతం తప్ప అభివృద్ధి అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ లాగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే నిరూపించాలన్న సీఎం కేసీఆర్ సవాలుకు ఇప్పటికీ సమాధానం లేదన్నారు. (చదవండి: సీఎంకు దుబ్బాక ప్రజల దీపావళి గిఫ్ట్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని న్యావనంది మహిళ హత్య కేసుపై ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు గాలి మాటలేనన్నారు. ప్రజా ఆమోదంతో నాలుగుసార్లు గెలిచిన తనపై నిరాధార భూకబ్జా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డు తీసుకు వస్తానన్నహామీ ఏమైంది, ఇంకా ఎన్ని రోజులు మాయా మాటలతో కాలం వెళ్లదీస్తావని నిజామాబాద్ ఎంపీని ప్రశ్నించారు. (చదవండి: ఒక ఎన్నిక.. అనేక సంకేతాలు!) -
క్షేమంగానే ఉన్నా: బాజిరెడ్డి
డిచ్పల్లి: తాను క్షేమంగానే ఉన్నానని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం గురించి అనుచరులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. బాజిరెడ్డికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ‘నా గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు. నేను, నా శ్రీమతి ఆరోగ్యంగానే ఉన్నాం. నా శ్రేయస్సు కోసం, మా కుటుంబ సభ్యుల కోసం పూజలు చేస్తున్న కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో ఆరోగ్యంగా తిరిగి వస్తానని’ వీడియోలో పేర్కొన్నారు. తనకు ధైర్యం ఉందని, తన ధైర్యం ఎలాంటిదో మీ అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. -
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై..
సాక్షి, నాగర్ కర్నూల్/నిజామాబాద్/భూపాలపల్లి : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో కొద్దిపాటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమకు కేబినెట్ బెర్త్ దక్కకపోవడంపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పారంటూ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు పార్టీని వీడతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీంతో కొందరు నేతలు మీడియాకు ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. తాను టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని తెలిపారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తుచేశారు. తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారతానంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. అలాంటి ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉంది.. తనకు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి రానందకు అసంతృప్తి లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. తాను ఎవరిని నమ్ముతానో వారితోనే చివరి వరకు ఉంటానని తెలిపారు. టీఆర్ఎస్లో పదవుల కోసం చేరలేదు : గండ్ర మంత్రివర్గ ఏర్పాటుపై తాను అసంతృప్తితో ఉన్నట్టు వచ్చిన వార్తల్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి పదవుల కోసం రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై పట్ల నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నట్టు చెప్పారు. పదవుల కన్నా పార్టీని బలోపేతం చేయడంపై తన దృష్టి ఉందని పేర్కొన్నారు. సీఎం ఆశీస్సుల వల్లే తన కుటుంబానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కిందని అన్నారు. తను అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నన్ను బహిష్కరించింది..
‘‘నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో నేనేప్పుడూ రాజీ పడలేదు.. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా పోరాడి ఎదుర్కొన్న తప్పా.. ఏనాడు తలవంచి లొంగిన సందర్భం లేదు.. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నన్ను బహిష్కరించింది.. మావోయిస్టులు బుల్లెట్ దాడి చేశారు.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నన్ను అణగదొక్కాలని చూశారు. సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇచ్చి.. నన్ను మాత్రం మరో చోట పోటీ చేయమన్నరు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలదొక్కుకున్న.. ఏదైనా పని చేయాలని సంకల్పిస్తే పట్టు వదలకుండా చేసి చూపించాలనే మన స్తత్వం నాది.. రాజకీయాల్లో మూడు తరాలను చూసిన.. అన్ని తరాల్లోనూ కలిసిపోయిన.. నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు.. కానీ ఇంకా యూత్‌లాగే నా ఆలోచన ఉంటుందం’టున్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. అభిమానులు, అనుచరులు గోవన్నగా పిలుచుకునే బాజిరెడ్డితో ‘సాక్షి’ప్రతినిధి పర్సనల్ టైం.. అనాది బాల్య వివాహం. 7వ తరగతిలో ఉన్నప్పుడే లగ్గమైంది. వినోద, శోభ మేనమామ కూతుర్లే. విదేశీ పర్యటనలంటే ఎంతో ఇష్టం.ఇప్పటి వరకు సుమారు 25 పైగా దేశాలు తిరిగిన. ఆయా దేశాల్లో పల్లెలు ఎలా ఉన్నాయనేది ఎక్కువగా గమనిస్తుంటా. మా కుటుంబానికి మాలీ పటేల్, పోలీస్ పటేల్ వతందార్లు ఉండేవి. నేను రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ పటేల్‌గా పనిచేసిన. అప్పట్లో నాకు వేటాడటం అంటే సరదా ఉండేది. జీపు, బుల్లెట్ వంటి వాహనాలు నడపడం ఎంతో ఇష్టం. మీ బాల్యం.. విద్యాభ్యాసం ఎలా ఎక్కడ జరిగింది..? ‘‘మా ఊరు చీమన్‌పల్లి. నేను మా అమ్మమ్మ ఊరు దేశాయిపేట్ (జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం)లో పుట్టి న. రాయల షావుకారు అనే పెద్దాయన నాకు అక్కడే శ్రీకారం పెట్టా రు. 1, 2 తరగతులు చీమన్‌పల్లిలో, మూడో తరగతి సిరికొండలో, 4, 5 తరగతులు న్యావనందిలో, 6,7 పల్లికొండలో చదువుకున్న. 8, 9, 10 తరగతుల కోసం ధర్పల్లి వచ్చిన. ఇంటర్ కోసం నిజామా బాద్‌కు రావాల్సి వచ్చింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన..’’ మీది రాజకీయ కుటుంబమా? ∙అప్పట్లో మా కుటుంబానికి మాలీ పటేల్, పోలీస్ పటేల్ వతందార్లు ఉండేవి. మా తాత బాజిరెడ్డి సాయన్న మా ప్రాంతానికి తహసీల్దార్‌గా ఉండేవారు. మా చిన్నాన్న కూడా తహసీల్దార్‌గా పనిచేశారు. మా నాన్న బాజిరెడ్డి దిగంబర్ పటేల్ చదువు కున్న వ్యక్తి. నేను రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ పటేల్‌గా పనిచేసిన. 1973లో మా గ్రామంలో పోలీస్‌పటేల్ పోస్టు ఖాళీ అయింది. అప్పట్లో మా ఊరికి వెళ్లి సుమారు ఏడేండ్లు పోలీస్ పటేల్‌గా ఉన్న. 1981లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన. ఐదేళ్ల పాటు 1986 వరకు సర్పంచ్‌గా పనిచేసిన. రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది..? ‘‘చీమన్‌పల్లికి 15 ఏండ్లు ఒకే వ్యక్తి సర్పంచ్‌గా ఉండేవారు. గ్రామంలో మౌలిక వసతులు కూడా ఉండేవి కావు. గ్రామంలోని యువత అంతా నువ్వు సర్పంచ్‌గా చేయాలన్నారు.. అనుబంధ గ్రామాల ప్రజలు కూడా మద్దతిచ్చారు.. వారి ప్రోత్సాహంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన. గ్రామంలో రోడ్లు, పోస్టాపీసు, పశువైద్యశాల ఏర్పాటు చేసిన. సిరికొండ పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేసిన, ఎంపీపీగా కూడా పనిచేసిన. ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంగా సిట్టింగ్ టికెట్ ఇవ్వకుండా బాన్సువాడ పంపారు. అక్కడ కూడా విజయం సాధించిన. తర్వాత రూరల్ ప్రజలు రెండు పర్యాయాలు ఆశీర్వదించారు. మీ ఇష్టాలేమున్నాయి.. అప్పట్లో నాకు వేటాడటం అంటే సరదా ఉండేది. మాది దట్టమైన అటవీ ప్రాంతం. అప్పుడప్పుడు అడవిలోకి వెళ్లేవాడిని. జీపు, బుల్లెట్ వంటి వాహనాలు నడపడం ఎంతో ఇష్టం. కొత్తగా ఏ స్పోర్ట్స్ వెహికిల్ వచ్చినా కొనాలనిపించేది. నడపాలనిపించేది. విదేశీ పర్యటనలంటే ఎంతో ఇష్టం. ఇప్పటి వరకు సుమారు 25 పైగా దేశాలు తిరిగిన. అక్కడికి వెళ్లినప్పుడు ఆయా దేశాల్లో పల్లెలు ఎలా ఉన్నాయనేది ఎక్కువగా గమనిస్తుంటా. అక్కడి పాలన ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. విదేశాల్లో నాకు చాలా మంది మంచి మిత్రులున్నరు. వైఎస్ఆర్తో మీకున్న అనుబంధం.. సంక్షేమ పథకాల అమలులో ఒక్కో నేతది ఒక్కో శైలి ఉంటుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో చాలా ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన నిరుపేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్‌లా పథకాలు అమలు చేశారు. ఎన్టీఆర్ ప్లస్ వైఎస్ఆర్ కలిస్తే వైఎస్ఆర్ అనుకునే వాడిని. ఇప్పుడు కేసీఆర్ కూడా ఎన్టీఆర్ ప్లస్ వైఎస్ఆర్ ప్లస్ కేసీఆర్ అనిపిస్తోంది. ఈ విషయంలో ముగ్గురూ ముగ్గురే. నా రాజకీయ గురువు శనిగరం సంతోష్‌రెడ్డి. ఎల్లప్పుడూ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండాలనిపిస్తుంది. అందుకే ఎప్పుడు నేను ప్రజల మధ్యలోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటాను. మీ వివాహం, కుటుంబం వివరాలు.. నాది బాల్య వివాహం. 7 తరగతిలో ఉన్నప్పుడే లగ్గమైంది. వినోద, శోభ మేనమామ కూతుర్లే. ఇద్దరు కుమారులు.. జగన్ (దిలీప్), అజయ్, కూతురు ధరణి. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబసభ్యులతో గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తుంటాను. అందరం కలిసి విహార యాత్రలకు కూడావెళతాం. మనవల్లతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటా. మీ అబ్బాయి జగన్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు.. అవును. పార్టీ అనుమతి తీసుకుని జగన్ ధర్పల్లి జెడ్పీటీసీగా పోటీ చేశారు. గెలుస్తున్నాం కూడా. రాజకీయ వారసత్వం జగనే. మా అబ్బాయి రాజకీయ భవిష్యత్తు కేసీఆర్, కేటీఆర్, కవిత చేతుల్లో పెట్టాను. ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. డీఎస్, పోచారం వంటి అగ్రనేతలపై విజయం సాధించారు., నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి వరించలేదనే అసంతృతితో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. అవును. ఈసారి మంత్రి పదవి వస్తుందనుకున్న.. సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిన. పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయం తీసుకున్నరు.. ఎప్పుడైనా నాకు న్యాయం చేస్తరని గట్టి నమ్మకంతో ఉన్నా. మూడు తరాలు చూశానంటున్నారు.. అప్పటి రాజకీయాలకు, ఇప్పటికీ తేడా ఎలా ఉంది? అప్పటి రాజకీయాలకు, ఇప్పటికీ బాగా మార్పులొచ్చాయి. ప్రస్తుత రాజకీయాలు కమర్షియల్ అ య్యాయి. నాయకులు ఆ ధోరణితో పనిచేయడంతో ప్రజలు కూడా అట్లాగే అవుతున్నారనిపిస్తోంది. క మర్షియల్గా ఉండే నాయకులు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండరు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. టెన్షన్ పెట్టుకుంటే మాత్రం పని చేయలేం.. -
తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు సోమవారం ప్రారంభయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలకు స్పీకర్ మధుసుదనా చారి అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రుణాలపై బ్యాంకులన్నిటింకి ఏకత్వ ప్రతిపాదన ఉండాలని సభలో కోరారు. రైతులను కొన్ని బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. -
రైతులపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదు