సాకక్షి, నిర్మల్: నిర్మల్ టీఎస్‌ఆర్టీసీ బస్ స్టేషన్ అభివృద్ధిపై దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో శనివారం టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మల్ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మించే ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద సెల్లార్, జి-ప్లస్ వన్, శుభకార్యాలకు నిర్వహించే హాల్, నిర్మాణం చేయాలని నిర్ణయించారు. టీఎస్‌ఆర్టీసీ ద్వారా రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్‌లలో 53 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు.
ఆర్టీసీ అధికారులతో నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ బస్టాండ్‌ఘా నిర్మించేందుకుగా తీసుకోవాల్సిన నిర్ణయాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో చర్చించారు. ఆర్టీసీ సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు బస్టాండులను ఆధునీకరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.బస్టాండులను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చి ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు.
ఇప్పటికే నిర్మల్ బస్ స్టేషన్‌కు నూతనంగా ప్రారంభించిన ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా సర్వీసులను నడుపుతున్నారు. టిఎస్ ఆర్టిసి ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని బాజిరెడ్డి తెలిపారుజ నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
నిర్మల్‌లో నిర్మించే టీఎస్‌ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రత్యేకతలు ఇవే..
1. 1.3 ఎకరాలలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం.
2. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్ మరియు జి ప్లస్ వన్ నిర్మాణం.
3. నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్మాణం చేయడానికి 35 కోట్ల నిధుల ఖర్చు.
4. కమర్షియల్ కాంప్లెక్స్ శుభకార్యాలు నిర్వహించేందుకు హాలును ప్రత్యేకంగా నిర్మాణం.
5. బస్టాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం 53 స్టాళ్లను ఏర్పాటు.
6. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్, బస్సుల కోసం వేచి ఉన్న వారికోసం ఎల్‌సీడీ తెరల ఏర్పాటు
7. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు.
8. మరో 10 తరాలకు అడ్వాన్స్‌గా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం.
9. టీఎస్‌ఆర్టీసీ బస్టాండుల యొక్క ఆధునికరించుకోవడం వల్ల ప్రయాణికులను ఆకట్టుకోవడం జరుగుతుందని, ప్రయాణికులు కూడా ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా టీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక రాయితీలు బస్సు సర్వీసులను ఆదరించాలని మరోసారి బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు.
10. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం ఉండాలని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment