ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ సంస్థ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.
వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబరు నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు 8 డీఏలను మంజూరు చేశామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. "పెండింగ్ లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 2, 2023
ఇది కూడా చదవండి: వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణలో మూడు రోజులు గట్టి వానలే!
Comments
Please login to add a commentAdd a comment