TSRTC Chairman Bajireddy Govardhan Rejects Govt Salary, Check Details - Sakshi
Sakshi News home page

TSRTC: ఛైర్మన్‌ చరిత్రాత్మక నిర్ణయం.. ఎండీ సజ్జనార్‌ హర్షం

Published Wed, Nov 24 2021 3:24 PM | Last Updated on Wed, Nov 24 2021 9:25 PM

TSRTC Chairman Bajireddy govardhan Says I dont Take Salary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) గౌరవంగా ఇచ్చే జీతభత్యాలని తీసుకోనని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని లిఖిత పూర్వకంగా వ్రాసి ఇచ్చారు.

చదవండి: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలని, ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్థికభారం మోపడం ఇష్టం లేక తన వంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఛైర్మన్ బాజిరెడ్డి ఆర్టీసీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉదారంగా తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం పట్ల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ అధికారులు, సూపర్‌వైజర్లు ఉద్యోగులు హర్షం వక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement