ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
‘‘నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో నేనేప్పుడూ రాజీ పడలేదు.. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా పోరాడి ఎదుర్కొన్న తప్పా.. ఏనాడు తలవంచి లొంగిన సందర్భం లేదు.. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నన్ను బహిష్కరించింది.. మావోయిస్టులు బుల్లెట్ దాడి చేశారు.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నన్ను అణగదొక్కాలని చూశారు. సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇచ్చి.. నన్ను మాత్రం మరో చోట పోటీ చేయమన్నరు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలదొక్కుకున్న.. ఏదైనా పని చేయాలని సంకల్పిస్తే పట్టు వదలకుండా చేసి చూపించాలనే మన స్తత్వం నాది.. రాజకీయాల్లో మూడు తరాలను చూసిన.. అన్ని తరాల్లోనూ కలిసిపోయిన.. నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు.. కానీ ఇంకా యూత్‌లాగే నా ఆలోచన ఉంటుందం’టున్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. అభిమానులు, అనుచరులు గోవన్నగా పిలుచుకునే బాజిరెడ్డితో ‘సాక్షి’ప్రతినిధి పర్సనల్ టైం..
అనాది బాల్య వివాహం. 7వ తరగతిలో ఉన్నప్పుడే లగ్గమైంది. వినోద, శోభ మేనమామ కూతుర్లే. విదేశీ పర్యటనలంటే ఎంతో ఇష్టం.ఇప్పటి వరకు సుమారు 25 పైగా దేశాలు తిరిగిన. ఆయా దేశాల్లో పల్లెలు ఎలా ఉన్నాయనేది ఎక్కువగా గమనిస్తుంటా.
మా కుటుంబానికి మాలీ పటేల్,
పోలీస్ పటేల్ వతందార్లు ఉండేవి. నేను రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ పటేల్‌గా పనిచేసిన. అప్పట్లో నాకు వేటాడటం అంటే సరదా ఉండేది. జీపు, బుల్లెట్ వంటి వాహనాలు నడపడం ఎంతో ఇష్టం.
మీ బాల్యం.. విద్యాభ్యాసం ఎలా ఎక్కడ జరిగింది..?
- ‘‘మా ఊరు చీమన్‌పల్లి. నేను మా అమ్మమ్మ ఊరు దేశాయిపేట్ (జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం)లో పుట్టి న. రాయల షావుకారు అనే పెద్దాయన నాకు అక్కడే శ్రీకారం పెట్టా రు. 1, 2 తరగతులు చీమన్‌పల్లిలో, మూడో తరగతి సిరికొండలో, 4, 5 తరగతులు న్యావనందిలో, 6,7 పల్లికొండలో చదువుకున్న. 8, 9, 10 తరగతుల కోసం ధర్పల్లి వచ్చిన. ఇంటర్ కోసం నిజామా బాద్‌కు రావాల్సి వచ్చింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన..’’
- మీది రాజకీయ కుటుంబమా?
- ∙అప్పట్లో మా కుటుంబానికి మాలీ పటేల్, పోలీస్ పటేల్ వతందార్లు ఉండేవి. మా తాత బాజిరెడ్డి సాయన్న మా ప్రాంతానికి తహసీల్దార్‌గా ఉండేవారు. మా చిన్నాన్న కూడా తహసీల్దార్‌గా పనిచేశారు. మా నాన్న బాజిరెడ్డి దిగంబర్ పటేల్ చదువు కున్న వ్యక్తి. నేను రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ పటేల్‌గా పనిచేసిన. 1973లో మా గ్రామంలో పోలీస్‌పటేల్ పోస్టు ఖాళీ అయింది. అప్పట్లో మా ఊరికి వెళ్లి సుమారు ఏడేండ్లు పోలీస్ పటేల్‌గా ఉన్న. 1981లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన. ఐదేళ్ల పాటు 1986 వరకు సర్పంచ్‌గా పనిచేసిన.
- రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది..?
- ‘‘చీమన్‌పల్లికి 15 ఏండ్లు ఒకే వ్యక్తి సర్పంచ్‌గా ఉండేవారు. గ్రామంలో మౌలిక వసతులు కూడా ఉండేవి కావు. గ్రామంలోని యువత అంతా నువ్వు సర్పంచ్‌గా చేయాలన్నారు.. అనుబంధ గ్రామాల ప్రజలు కూడా మద్దతిచ్చారు.. వారి ప్రోత్సాహంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన. గ్రామంలో రోడ్లు, పోస్టాపీసు, పశువైద్యశాల ఏర్పాటు చేసిన. సిరికొండ పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేసిన, ఎంపీపీగా కూడా పనిచేసిన. ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంగా సిట్టింగ్ టికెట్ ఇవ్వకుండా బాన్సువాడ పంపారు. అక్కడ కూడా విజయం సాధించిన. తర్వాత రూరల్ ప్రజలు రెండు పర్యాయాలు ఆశీర్వదించారు.
- మీ ఇష్టాలేమున్నాయి..
- అప్పట్లో నాకు వేటాడటం అంటే సరదా ఉండేది. మాది దట్టమైన అటవీ ప్రాంతం. అప్పుడప్పుడు అడవిలోకి వెళ్లేవాడిని. జీపు, బుల్లెట్ వంటి వాహనాలు నడపడం ఎంతో ఇష్టం. కొత్తగా ఏ స్పోర్ట్స్ వెహికిల్ వచ్చినా కొనాలనిపించేది. నడపాలనిపించేది. విదేశీ పర్యటనలంటే ఎంతో ఇష్టం. ఇప్పటి వరకు సుమారు 25 పైగా దేశాలు తిరిగిన. అక్కడికి వెళ్లినప్పుడు ఆయా దేశాల్లో పల్లెలు ఎలా ఉన్నాయనేది ఎక్కువగా గమనిస్తుంటా. అక్కడి పాలన ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. విదేశాల్లో నాకు చాలా మంది మంచి మిత్రులున్నరు.
- వైఎస్‌ఆర్‌తో మీకున్న అనుబంధం.. సంక్షేమ పథకాల అమలులో ఒక్కో నేతది ఒక్కో శైలి ఉంటుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో చాలా ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన నిరుపేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్‌లా పథకాలు అమలు చేశారు.
- ఎన్టీఆర్ ప్లస్ వైఎస్‌ఆర్ కలిస్తే వైఎస్‌ఆర్ అనుకునే వాడిని. ఇప్పుడు కేసీఆర్ కూడా ఎన్టీఆర్ ప్లస్ వైఎస్‌ఆర్ ప్లస్ కేసీఆర్ అనిపిస్తోంది. ఈ విషయంలో ముగ్గురూ ముగ్గురే. నా రాజకీయ గురువు శనిగరం సంతోష్‌రెడ్డి. ఎల్లప్పుడూ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండాలనిపిస్తుంది. అందుకే ఎప్పుడు నేను ప్రజల మధ్యలోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటాను.
- మీ వివాహం, కుటుంబం వివరాలు..
- నాది బాల్య వివాహం. 7 తరగతిలో ఉన్నప్పుడే లగ్గమైంది. వినోద, శోభ మేనమామ కూతుర్లే. ఇద్దరు కుమారులు.. జగన్ (దిలీప్), అజయ్, కూతురు ధరణి. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబసభ్యులతో గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తుంటాను. అందరం కలిసి విహార యాత్రలకు కూడావెళతాం. మనవల్లతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటా.
- మీ అబ్బాయి జగన్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు..
- అవును. పార్టీ అనుమతి తీసుకుని జగన్ ధర్పల్లి జెడ్పీటీసీగా పోటీ చేశారు. గెలుస్తున్నాం కూడా. రాజకీయ వారసత్వం జగనే. మా అబ్బాయి రాజకీయ భవిష్యత్తు కేసీఆర్, కేటీఆర్, కవిత చేతుల్లో పెట్టాను. ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది.
- డీఎస్, పోచారం వంటి అగ్రనేతలపై విజయం సాధించారు., నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి వరించలేదనే అసంతృతితో ఉన్నారనే వాదన వినిపిస్తోంది.
- అవును. ఈసారి మంత్రి పదవి వస్తుందనుకున్న.. సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిన. పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయం తీసుకున్నరు.. ఎప్పుడైనా నాకు న్యాయం చేస్తరని గట్టి నమ్మకంతో ఉన్నా.
- మూడు తరాలు చూశానంటున్నారు.. అప్పటి రాజకీయాలకు, ఇప్పటికీ తేడా ఎలా ఉంది?
- అప్పటి రాజకీయాలకు, ఇప్పటికీ బాగా మార్పులొచ్చాయి. ప్రస్తుత రాజకీయాలు కమర్షియల్ అ య్యాయి. నాయకులు ఆ ధోరణితో పనిచేయడంతో ప్రజలు కూడా అట్లాగే అవుతున్నారనిపిస్తోంది. క మర్షియల్‌గా ఉండే నాయకులు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండరు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. టెన్షన్ పెట్టుకుంటే మాత్రం పని చేయలేం..
Comments
Please login to add a commentAdd a comment