సాక్షి, నిజామాబాద్: దుబ్బాక ఎన్నికల్లో నష్టం జరిగిన మాట వాస్తమమేనని మంత్రి కేటీఆర్ అంగీకరించారని, కొందరు ఒక్క గెలుపుతోనే విర్రవీగుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర బీజేపీ పై మండిపడ్డారు. నిజామాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాక్షసుల్లా తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నేతలకు హిందుత్వ సిద్ధాంతం తప్ప అభివృద్ధి అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ లాగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే నిరూపించాలన్న సీఎం కేసీఆర్ సవాలుకు ఇప్పటికీ సమాధానం లేదన్నారు. (చదవండి: సీఎంకు దుబ్బాక ప్రజల దీపావళి గిఫ్ట్)
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని న్యావనంది మహిళ హత్య కేసుపై ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు గాలి మాటలేనన్నారు. ప్రజా ఆమోదంతో నాలుగుసార్లు గెలిచిన తనపై నిరాధార భూకబ్జా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డు తీసుకు వస్తానన్నహామీ ఏమైంది, ఇంకా ఎన్ని రోజులు మాయా మాటలతో కాలం వెళ్లదీస్తావని నిజామాబాద్ ఎంపీని ప్రశ్నించారు. (చదవండి: ఒక ఎన్నిక.. అనేక సంకేతాలు!)
Comments
Please login to add a commentAdd a comment