హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సోమవారం రైతు రుణమాఫీ, ఐటీ రంగ అభివృద్ధి, పంటలకు మద్ధతు ధర, తెలంగాణ కోరంలో పాఠ్యపుస్తకాల సమీక్ష తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. కాగా ఫాస్ట్ పథకానికి సంబంధించి అస్పష్టతపై బీజేపీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాగా నేడు సభలో బడ్జెట్పై చర్చ కొనసాగనుంది.
మరోవైపు సాయంత్రం నాలుగు గంటలకు రైతు ఆత్మహత్యలు.. విద్యుత్ సంక్షోభంపై చర్చకు అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఇక ప్రతిపక్షాలపై ఎదురు దాడికి అధికారపక్షం వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం టీఆర్‌ఎస్ వ్యూహరచన కమిటీ సమావేశమైంది.