discussion
-
మస్క్‌కు ప్రభుత్వం ఆహ్వానం
టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్‌తోపాటు ఇతర ప్రధాన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థల ఉన్నతాధికారులకు దేశంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం (SPMEPCI)కు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు వారికి ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఈమేరకు చర్చసాగనుంది.మార్చి 2024లో కొత్త ఈవీ పాలసీని ప్రతిపాదించారు. ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడానికి, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడానికి దీన్ని రూపొందించినట్లు ప్రభుత్వం గతంలో తెలిపింది. స్థానిక తయారీ, సరఫరాను తప్పనిసరి చేస్తూ దేశంలో ఉత్పత్తి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ (పీఎల్ఐ-ఆటో) కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుగుణంగా దేశీయ విలువ జోడింపు (DVA)ను లెక్కిస్తారు.ఈవీ పాలసీ నిబంధనలు ఇవే..భారతదేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్న వాహన తయారీదారులకు దిగుమతి సుంకాలను తగ్గించాలనే నిబంధనలున్నాయి. ఏదైనా కంపెనీ స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలో 25% డీవీఏ(DVA), ఐదో సంవత్సరం నాటికి 50% డీవీఏ సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన తయారీదారులకు చెందిన ఉత్పత్తులు 35,000 డాలర్లు(రూ.30 లక్షలు) కంటే ఎక్కువ ధర ఉంటే దిగుమతి పన్ను సుమారు 70%గా విధిస్తారు.విభిన్న వాదనలుప్రతిపాదిత పథకానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ పథకం ద్వారా గణనీయమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నప్పటికీ టెస్లా, విన్‌ఫాస్ట్ వంటి వాహన తయారీదారులు కొన్ని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 2024లో పాలసీపై ఇరు కంపెనీల నుంచి భిన్న వాదనలు వినిపించాయి. డీవీఏ లెక్కింపు పద్ధతి, అర్హత ప్రమాణాలపై ఆందోళన చెందాయి. నిర్ణీత గడువులోగా డీవీఏ లక్ష్యాలను చేరుకోవడంపై టెస్లా తన సలహాదారు ‘ది ఆసియా గ్రూప్ (TAG) ఇండియా’ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఇప్పటికే విన్‌ఫాస్ట్ పెట్టుబడులు500 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంటును నిర్మిస్తున్న వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్, ముందుగా కంపెనీలు చేస్తున్న ఖర్చులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని కోరుతోంది. ఈ రెండు కంపెనీలే కాకుండా ఇతర కంపెనీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పాలసీ మార్గదర్శకాలను సవరించడానికి ప్రభుత్వం యోచిస్తుందేమో చూడాల్సి ఉంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ), ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ పథకంలో చేర్చాలని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: గోవాలో హై డిమాండ్ వేటికంటే..గతంలో మస్క్ పర్యటన రద్దు2024లో మస్క్ ఇండియా పర్యటన కొన్ని కారణాల వల్ల రద్దు అయింది. అప్పటి నుంచి భారత్‌లో కంపెనీ పెట్టుబడి ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి. తాజా పరిణామాల వల్ల ఈమేరకు తిరిగి చర్చసాగే అవకాశం ఉంటుదేమోనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో రాబోయే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. దాంతో త్వరలో జరగబోయే ఈ సంప్రదింపులకు ప్రాముఖ్యత సంతరించుకుంది. టెస్లా, హ్యుందాయ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, కియా, టయోటాతో సహా టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటోకార్ప్ వంటి భారతీయ కంపెనీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. -
TG: గురుకులాలపై అసెంబ్లీలో మాటల యుద్ధం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థుల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం(డిసెంబర్18) హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలోని గురుకులాల్లో వివిధ కారణాలతో విద్యార్థులు మరణించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా ఎంత మంది విద్యార్థుల చావులకు కారణమవుతారని ప్రశ్నించారు. వెంటనే గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.దీనికి స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ అక్కడక్కడా గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరిగిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నారు. తమ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇటీవల విద్యార్థులకు 40 శాతం డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 54 యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.మంత్రి పొన్నం వర్సెస్ గంగులఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎదురుదాడి చేశారు.దీనికి గంగుల స్పందిస్తూ మొదటిసారి సభకు వచ్చిన వ్యక్తి తాను మాట్లాడుతుండగా అడ్డుకోవడం సరికాదన్నారు. దీనిపై పొన్నం అభ్యంతరం చెప్పారు. తాను ఎంపీగా పనిచేశానని, తనను మొదటిసారి సభ్యుడు అనడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తాను డబ్బుల సంచులతో గెలిచేవాడని కాదని, హుస్నాబాద్‌కు పారిపోయి గెలవలేదన్నారు. సభ్యుడు తొలిసారి వచ్చినా ఎన్నిసార్లు వచ్చిన గౌరవం ఇవ్వాలని మరో మంత్రి శ్రీధర్‌బాబు గంగులకు సూచించారు.గురుకులాల విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ గురుకులాలకు కనీసం భవనాలు కట్టలేకపోయిందని విమర్శించారు.గురుకులాల్లో ప్రతి పనిని పెండింగ్‌లో పెట్టిందన్నారు. తాము ఎప్పుడూ సామాన్యులవైపే ఉంటామని,గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు. -
చర్చ కాదు, రచ్చ
మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు. నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది. చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు. రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు. రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది. ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు. అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్‌లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు. పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్‌లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు. ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు. ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం! -
నేడు వార్షిక బడ్జెట్‌పై చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు శాసనమండలి, శాసనసభలో వార్షిక బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది.శాసన సభ ప్రారంభమైన వెంటనే నేరుగా బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు ప్రసంగిస్తారు. అనంతరం బడ్జెట్‌పై జరిగిన చర్చకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమా ధానం ఇస్తారు. శాసనమండలిలోనూ బడ్జెట్‌పై జరిగే చర్చకు భట్టి సమాధానం ఇస్తారు. -
నీట్ పై లోక్ సభలో రచ్చ
-
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
డెహ్రాడూన్: అత్యంత కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. యూసీసీ బిల్లును సీఎం పుష్కర్‌సింగ్ ధామీ మంగళవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. అధికార బీజేపీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మంగళవారమే చర్చ, ఓటింగ్ జరగాల్సి ఉండగా, విపక్షాల నిరసనల వల్ల అది సాధ్యం కాలేదు. చర్చ జరగకుండానే బిల్లును ఆమోదించుకోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్ష ఎమ్మెల్యే యశ్పాల్ ఆర్య మండిపడ్డారు. యూసీసీ బిల్లుపై ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఒకటి రెండు రోజుల్లో చర్చ, అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. సభలో ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం ఉండడంతో బిల్లు ఆమోదం పొందడం, గవర్నర్ సంతకంతో చట్టంగా మారడం లాంఛనమేనని చెప్పొచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం గోవాలో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి చట్టం అమలవుతోంది. అక్కడ పోర్చుగీసు పాలనా కాలంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో ఏముంది? ► ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఉత్తరాఖండ్ పౌరులకు ఈ బిల్లు వర్తిస్తుంది. ► గిరిజన వర్గాల ప్రజలను బిల్లు నుంచి మినహాయించారు. ► భారత రాజ్యాంగంలోని పార్ట్–21 కింద తమ హక్కుల రక్షణ పొందుతున్న వ్యక్తులకు, సమూహాలకు కూడా మినహాయింపు ఉంటుంది. ► సహజీవనాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► సహజీవనం ద్వారా జన్మించిన పిల్లలకు చట్టబద్ధంగా గుర్తింపు లభిస్తుంది. ► వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో మతాలకు అతీతంగా ప్రజలందరికీ ఒకే చట్టం అమలు చేస్తారు. ► మతాలతో సంబంధం లేకుండా బహుభార్యత్వంపై నిషేధం అమలవుతుంది. ఒక్కరు ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ► ఎవరి మతాచారం ప్రకారం వారు వివాహం చేసుకోవచ్చు. ► సహజీవనం చేసే స్త్రీపురుషుల వయసులు వరుసగా 18, 21 ఏళ్లకు పైబడి ఉండాలి. ► సహజీవనం ప్రారంభించిన తర్వాత నెల రోజులలోపు ప్రభుత్వ రిజి్రస్టార్‌కు సమాచారం ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే వారికి ఆరు నెలల దాకా జైలుశిక్ష లేదా రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. ► సహజీవనంపై రిజిస్ట్రార్‌కు తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ► సహజీవనం సాగిస్తున్న మహిళను పురుషుడు వదిలేస్తే బాధితురాలు కోర్టును ఆశ్రయించవచ్చు. అతడి నుంచి జీవనభృతి పొందవచ్చు. ► పెళ్లి కాని జంటల మధ్య సహజీవనాన్ని అరికట్టేలా బిల్లులో పలు కీలకాంశాలు జోడించారు. -
విద్యుత్ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్ రంగానిదేనని, ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ వినియోగమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా.. విద్యుత్తు సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టులే కారణమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. గురువారం భట్టి శాసనసభలో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి.. స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. చివరిగా చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సభలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కరెంటును ఒక్కరోజులో ఉత్పత్తి చేయలేరు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 24 గంటల కరెంటు అందించామని చెప్పిన బీఆర్ఎస్.. అందుకు అవసరమైన విద్యుత్‌ను ఎలా అందుబాటులోకి తెచ్చిందో చెప్పలేదు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్ జెన్కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు ముందే.. ఇక్కడ 2,960 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అవి ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ కొత్త విద్యుత్ కేంద్రాలే అనంతర కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాయి. గత ప్రభుత్వం పూర్తి చేసినది ఒక్కటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు వచ్చేలా నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఇది పూర్తి కావడానికీ సుదీర్ఘకాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ బొగ్గు వినియోగించాల్సి రావటం, కాలుష్యం వెదజల్లటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. మరో ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా కోసమే ఏటా రూ.800 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతోంది. భారీగా పెండింగ్ బకాయిలు రాష్ట్ర డిస్కంలు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్ 31 నాటికి విద్యుత్ శాఖ అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ.30,406 కోట్లు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇదేకాకుండా విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు మరో రూ.28,673 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల వల్లే డిస్కంలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సినవే రూ.14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూఅప్) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాటిచ్చి.. చెల్లించని రూ.14,928 కోట్ల భారం డిస్కంలపైనే పడింది. గుండె బరువెక్కుతోంది విద్యుత్ శాఖ అప్పులకు తోడు ప్రభుత్వం కరెంటు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొంటే ఈ మొత్తం రూ. 1.14 లక్షల కోట్లకు చేరింది. నాకు అప్పు అంటేనే భయం. వ్యక్తిగతంగా నేను అప్పు చేయను. కానీ ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్థిక, విద్యుత్ శాఖల సమీక్షల సందర్భంగా గత ప్రభుత్వం చేసిపెట్టిన అప్పులు చూసి గుండె బరువెక్కుతోంది. ముందు చూపు ఏది? రాష్ట్రంలో 2014 నాటికి కరెంటు డిమాండ్ 5,661 మెగావాట్లు. దానికి 2.7 రెట్లు ఎక్కువ విద్యుత్ అందించేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుచూ పుతో ఉంటే.. ఇప్పటి డిమాండ్‌కు 2.7 రెట్లు ఎక్కు వగా అంటే 39 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండాలి. అలా జరగలేదు. కనీసం డిమాండ్‌కు తగ్గట్టు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. కాంగ్రెస్ హయాంలోని ప్రణాళికలతోనే.. యూపీఏ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే ముందుచూపుతో తగిన ప్రణాళికలను అమల్లోకి తేవటంతో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7,778 మెగావాట్లు అందుబాటులో ఉంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ అందాలన్న ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్తగూడెం థర్మల్ కేంద్రం, కాకతీయ రెండో దశ, సింగరేణి జైపూర్ కేంద్రం, పులిచింతల హైడల్ కేంద్రం సహా పలు కొత్త విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. వీటితో 2,960 మెగావాట్ల కరెంటు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఏపీ నుంచి 1,800 మెగావాట్లు, ఎనీ్టపీసీ రామగుండం నుంచి 4 వేల మెగావాట్లు.. కలిపి 5,800 మెగావాట్లు సమకూరాయి. ఇలా అన్నీ కలిపి 16,538 మెగావాట్ల విద్యుత్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి అందుతోంది. అదే బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లతో నష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదు. రోజువారీ మనుగడకూ కష్టంగా.. డిస్కంలు రోజువారీ మనుగడ కోసం కూడా అలవికాని అప్పులు చేయాల్సిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల.. డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో కుదేలయ్యాయి. ఇలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినా.. మేం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్‌ను బాధ్యతాయుత, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. -
మన పార్టీలో కూడా ఫ్యామిలీ ప్యాకేజీలుంటాయా?
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఈసారి ఫ్యామిలీ ప్యాకేజీలుంటాయా ? లేదా అన్న చర్చ బీజేపీలో సాగుతోంది. కర్ణాటకలో మాదిరి తెలంగాణలోనూ ఒక్కో కుటుంబంలోని ఇద్దరికి టికెట్లు కేటాయిస్తారా అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇక్కడా ఆశావహులు ఉన్నారు.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఆయన సతీమణి కావ్యారెడ్డి, ఈటల రాజేందర్, ఆయన భార్య ఈటల జమున, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఆయన భార్య, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి, డీకే అరుణ, ఆమె కుమార్తె, ఇలా బీజేపీలో కూడా ఓ కుటుంబంలో రెండేసి టికెట్ల కోసం ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్టు చర్చ జరుగుతోందట..ఇదంతా నిజమవుతుందా? లేక ప్రచారానికే పరిమితమా చూడాలి. చదవండి: లక్ష్మీపుత్రుడి లక్కెలా ఉందో? -
పుతిన్‌తో త్వరలో కిమ్ జోంగ్ ఉన్ భేటీ!
సియోల్: ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధినేత పుతిన్‌తో సమావేశం కాబోతున్నారా? ఇందుకోసం త్వరలోనే రష్యాకు బయలుదేరి వెళ్తారా? నిజమేనని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికాకు బద్ధ వ్యతిరేకి అయిన కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలి కాలంలో పుతిన్‌కు స్నేహ హస్తం అందిస్తున్నారు. ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని రష్యా నిర్ణయించినట్లు సమాచారం. పుతిన్, కిమ్ సమావేశంలో ఇదే అంశంపై చర్చించే అవకాశం ఉంది. రష్యాకు అందించే సహాయానికి బదులుగా ఆహారం, అత్యాధునిక ఆయుధ టెక్నాలజీని తమకు అందజేయాలని పుతిన్ నుంచి కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు చివరిసారిగా 2019 ఏప్రిల్‌లో కలుసుకున్నారు. -
అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, ఇతర అవసరాలకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ, పారిశ్రామికవాడల నిర్మాణం కోసం వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించి తీసుకుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.4–5 కోట్ల విలువ చేస్తుందన్నారు. బుద్వేల్‌లో 164 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించిన ప్రభుత్వం ప్లాట్లు వేసి అమ్ముతోందని ఆరోపించారు. అసైన్డ్ భూములు అసైనీల వద్దే ఉండనీయాలని, ధరణిలో వారికి హక్కులు కల్పిం చాలని కోరారు. తెలంగాణ ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లక్షల మంది ప్రజలు నిరీక్షిస్తున్నారని, ప్రతి గ్రామంలో భూములను సేకరించి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై అధికార బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో యువత.. ఎమ్మెస్సీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లభించక గ్రామాల్లో ఇస్త్రీ షాపులు, సోడా దుకాణాలు నడుపుకుంటూ తీవ్ర ఆవేదనలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొనగా, మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం కలగజేసుకుని.. ‘భట్టి గారూ..మీరు ఆరు మాసాల పాదయాత్ర మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు’అని సూచన చేశారు. అనంతరం భట్టి ప్రసంగం కొనసాగిస్తూ.. వర్సిటీల్లో అధ్యాపకులను భర్తీ చేయాలని, ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు లేక బడులు మూతబడుతున్నాయని, తక్షణమే డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సరే.. కాల్వలు ఏవీ? రాష్ట్రంలో వివిధ కొత్త ప్రాజెక్టులను నిర్మించిన ప్రభుత్వం వాటి కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు సరఫరా కావడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం కింద కాల్వలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కడెం వంటి పాత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపునకు గురి అవుతున్న చెన్నూరు, భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రజలకు పునరావాసం కల్పిం చి, పరిహారం చెల్లించాలని కోరారు. గిరిజనబంధు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.. గిరిజనబంధుతో పాటు బీసీలకు సబ్‌ప్లాన్, మైనారిటీలకు సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కి 15 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, పంట రుణమాఫీ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు. -
'చర్చకు సిద్ధమే..' మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలకు అమిత్ షా కౌంటర్..
ఢిల్లీ: మణిపూర్‌లో అమానవీయ ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తక్షణమే చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు సరైన చర్చ జరిగింది లేదు. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమమని చెప్పారు. ఈ సున్నితమైన అంశం గురించి దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మణిపూర్ అంశంపై చర్చకు సహకరించాలని హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలను కోరారు. మణిపూర్ అంశంపై నిజం తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మణిపూర్ అంశంపై మూడు సార్లు సమావేశం వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30కు సమావేశం ప్రారంభం కాగానే హోం మంత్రి చర్చకు సిద్ధమని తెలిపారు. అయినప్పటికీ అమిత్ షా ప్రసంగానికి అడ్డుపడిన ప్రతిపక్షాలు గందరగోళం చేశారు. దీంతో స్పీకర్ హోం బిర్లా మరోసారి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. కొన్నిరోజులుగా అల్లర్లతో రగులుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అల్లర్లలో ఇప్పటికే 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు తెగల మధ్య జరుగుతున్న అల్లర్లపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే.. రూల్ నెంబర్ 267 ప్రకారం చర్చ జరపాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం 176 కింద చర్చిద్దామని స్పష్టం చేసింది. దీని ప్రకారం 267 కింద ప్రత్యేకంగా సుధీర్ఘమైన చర్చలు జరగాల్సి ఉంటుంది. 176 కింద అయితే.. తక్కువ కాల వ్యవధిలో చర్చను ముగిస్తారు. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు: కూతురి ఆచూకీ కోసం ఎదురుచూపులు.. ఆసుపత్రికి ఫోన్ చేస్తే.. -
రెజ్లర్లతో మరోసారి కేంద్రం చర్చలు
-
అదానీ వెనుక శక్తుల గురించి ప్రజలకు తెలియాలి: రాహుల్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రూ.లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంలో నిజానిజాలు దేశ ప్రజలకు తెలియాలని అన్నారు. అదానీపై చర్చించేందుకు కేంద్రం నిరాకరిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా తాను ఈ విషయం గురించి గళమెత్తుతూనే ఉన్నానని రాహుల్ అన్నారు. దేశంలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దేశ మౌలిక సదుపాయాలను ఒక వ్యక్తి హైజాక్ చేశారని పరోక్షంగా అదానీని ఉద్దేశించి అన్నారు. 'అదానీ గ్రూప్ వెనకాల ఉన్న శక్తుల గురించి ప్రజలకు కచ్చితంగా తెలియాలి. కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు అంగీకరించడం లేదు. అదానీపై చర్చ జరగకుండా ప్రధాని మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తారు.' అని రాహుల్ విమర్శించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాటి నుంచి రాజ్యసభ, లోక్‌సభలో కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుండగా.. కేంద్రం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. దీంతో సోమవారం కూడా ఉభయసభలు ఎలాంటి చర్చా లేకుండానే మంగళవారానికి వాయిదాపడ్డాయి. చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. -
రచ్చ రచ్చగా GHMC కౌన్సిల్ సమావేశాలు
-
కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆర్బీకేలతో వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామన్నారు. ఈ మూడేళ్లలో 98.4 శాతం హామీలు అమలు చేశామన్నారు. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చలో సీఎం మాట్లాడుతూ, మూడేళ్లలో ఒక్క మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరవేనన్నారు. కరవు, బాబు ఇద్దరూ కవలలు అని సీఎం అన్నారు. చదవండి: ఎన్టీఆర్‌గారంటే నాకే గౌరవం ఎక్కువ: సీఎం జగన్ కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చెరువులు, వాగులు,వంకలు కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో 5 ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు రాయలసీమ, రైతులకు అత్యధికంగా సాగునీరు అందుతుంది. గత మూడేళ్లలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు. సగటున 13.29 లక్షల టన్నుల దిగుబడి పెరిగింది. రైతులే కాదు.. రైతు కూలీలూ సంతోషంగా ఉన్నారని సీఎం అన్నారు. ‘‘ఈ 40 నెలల్లో వ్యవసాయ రంగంలో రూ.1,28,634 కోట్లు ఖర్చు చేశాం. గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రైతు భరోసా ద్వారా 52 లక్షల 38 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాం. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు అందించాం. ఏ సీజన్లో జరిగిన పంట నష్టాన్ని ఆ సీజన్లోనే చెల్లిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాస్తవ సాగుదారులకే బీమా రక్షణ కల్పిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘బాబు హయాంలో రైతులకు బీమా పరిహారం అందలేదు. సున్నా వడ్డీ కింద నేరుగా రైతుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నాం. రైతులకు వడ్డీ రాయితీ నవంబర్‌లో అందిస్తాం. మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282 కోట్లు చెల్లించాం. బాబు పెట్టిన బకాయిలు రైతులకు మనమే చెల్లించాం. రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని బాబు వాగ్ధానం చేశారు. రుణమాఫీ చేయకుండ బాబు రైతులను దగా చేశారు. చివరికి రైతులకు సున్నా వడ్డీని బాబు ఎగ్గొట్టారు’’ అని సీఎం జగన్ దుయ్యబట్టారు. రుణమాఫీపై చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చారు. బాబు లాంటి నాయకుల వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతోందని సీఎం జగన్ మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పెద్ద విప్లవాత్మక మార్పు. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి ఆర్భీకేలకు ప్రశంసలు వచ్చాయి. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు ఆర్బీకేల సాయం అందుతుందన్నారు. ‘‘ఆర్బీకేల పరిధిలోకి కిసాన్ డ్రోన్లను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మోటార్లకు మీటర్లపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎక్కడా ఏ రైతు నుంచీ రూపాయి వసూలు చేయలేదు. చేయం, చేయబోం అని సీఎం స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్లతో నాణ్యమైన విద్యుత్ అందించగలమన్నారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అండగా ఉంటున్నాం’’ అని సీఎం అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సాయం అందిస్తున్నాం. రైతుల కుటుంబాలకు పరిహారం రూ.7 లక్షలు అందిస్తున్నాం. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్నాం. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. -
అందరిముందు రిబ్బన్లు తీసేసిన ఉద్యోగులు
-
డిజిటల్ పేమెంట్లపై వడ్డన.. ఆర్బీఐ ‘నో’ క్లారిటీ
RBI Monetary Policy | UPI for Feature Phone Users: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. ఫీచర్ ఫోన్లకు సైతం(స్మార్ట్ ఫోన్లు కాకుండా బేసిక్ ఫోన్లు) యూపీఐ ఆధారిత పేమెంట్ పద్దతులను.. అదీ ఆర్బీఐ పర్యవేక్షణ నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తద్వారా చిన్నాచితకా ట్రాన్జాక్షన్లు జరిగే అవకాశం ఉందని ఆర్బీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే యూపీఐ ఆధారిత ఫీచర్ ఫోన్ ప్రొడక్టులు ఎలా పని చేయనున్నాయనేది ఆర్బీఐ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే పేమెంట్ వ్యవస్థలో డిజిటల్ ట్రాన్జాక్షన్స్ తీరును మరింత సరళీకరించే ఉద్దేశంతో ఆర్బీఐ ఉంది. ఇందుకోసం కార్డులు, వాలెట్లు, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఛార్జీల మీద చర్చా పత్రాన్ని విడుదల చేయబోతోంది. కార్డులు, వాలెట్ల వరకు ఓకే. కానీ, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన బేసిక్ పేమెంట్ యాప్స్ ఏవీ ఇప్పటివరకు పేమెంట్ల మీద పైసా ఛార్జీ వసూలు చేయలేదు. దీంతో భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్ ఆధారిత డిజిటల్ చెల్లింపుల మీద ఛార్జీలు వసూలు చేస్తారా? అనే కోణంలో చర్చ మొదలైంది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో యూపీఐ మోస్ట్ పాపులర్ పేమెంట్ మెథడ్‌గా ఉంది. ఒక్క నవంబర్లోనే 4.1 బిలియన్ల ట్రాన్జాక్షన్స్ ద్వారా 6.68 లక్షల కోట్లు యూపీఐ ద్వారా జరిగింది. ప్రస్తుతం యూపీఐ పరిధిలోని గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే ఏవీ కూడా ట్రాన్జాక్షన్స్కి యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కానీ, నాన్ యూపీఐ పరిధిలోని కొన్ని మాత్రం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇంకోవైపు యూపీఐ పరిధిలోని ప్లేయర్స్(గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటివి).. మర్చంట్ డిస్కౌంట్ రేటు విధించాలని ఎప్పటి నుంచో ఆర్బీఐను డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఫోన్ ఫే ఫౌండర్ సమీర్ నిగమ్ గతంలో ఓ సదస్సులో మాట్లాడుతూ.. యూపీఐ పరిధిలోని ప్లేయర్స్ ‘జీరో ఎండీఆర్’తోనే 85 నుంచి 90 శాతం ట్రాన్జాక్షన్స్ చేస్తున్నాయని ప్రస్తావించారు. మరి ఆర్బీఐ యూపీఐ ప్లేయర్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా?.. ఒకవేళ తీసుకుంటే డిజిటల్ ట్రాన్జాక్షన్స్పై సామాన్యుల మీదే భారం వేస్తుందా? ఆ చర్చా పత్రంలో ఎలాంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు? అనే విషయాలపై బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: ఏటీఎంల నుంచి విత్ డ్రా చేస్తే బాదుడే.. ఎప్పటినుంచంటే.. -
క్రిప్టోపై కేంద్రం కీలక అడుగులు.. నిషేధానికి నో
Parliamentary Panel Meeting on Cryptocurrency: క్రిప్టోలకు సంబంధించి నియంత్రణలు ఉండాలంటూ బీజేపీ నేత జయంత్‌సిన్హా అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఫైనాన్స్) సోమవారం నిర్వహించిన సమావేశంలో అభిప్రాయాలు వినిపించాయి. క్రిప్టో ఫైనాన్స్‌తో (ఆర్థిక లావాదేవీలు) లాభ, నష్టాలపై ప్యానెల్ చర్చించింది. కొందరు సభ్యులు క్రిప్టో కరెన్సీల ఎక్సేంజీలు, లావాదేవీలపై నియంత్రణ ఉండాలే కానీ, పూర్తిగా నిషేధించడం సరికాదన్న అభిప్రాయాన్ని వినిపించారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు తెలిపాయి. పొంజి కాకుడదు క్రిప్టో ఆస్తుల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుండడం, దేశీయంగాను కోట్లాది మంది వీటిల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్న క్రమంలో వచ్చే రిస్క్‌లపై ఆందోళనలు వ్యక్తమవుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటరీ ప్యానెల్ నిర్వహించిన ఈ సమావేశంలో క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్‌ల చీఫ్‌లు, బ్లాక్‌చైన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ సభ్యులు, సీఐఐ తదితర పరిశ్రమల మండళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. క్రిప్టో ఫైనాన్స్‌పై తమ అభిప్రాయాలను వీరు ప్యానెల్‌కు తెలియజేశారు. ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న క్రిప్టోలు పొంజి స్కీమ్లుగా మారిపోకూడదన్న ఆందోళనను కమిటీ సభ్యులు వ్యక్తం చేశారు. అనుమతి వద్దు ‘‘కరెన్సీ అనేది దేశ సారభౌమాధికార సాధనం. కానీ, క్రిప్టో కరెన్సీ అలా కాదు. అది కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇంటర్నెట్ వేదికగానే దీని నిర్వహణ ఉంటుంది. కొనుగోలు, యూజర్లే వీటి విలువను నిర్ణయిస్తుంటారు. ఇది చట్టవిరుద్ధం’’ అని కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెప్పారు. మొత్తానికి క్రిప్టో లావాదేవీల వ్యవహారాలు అలా వదిలివేయడం కాకుండా, నియంత్రణ అయితే ఉండాలన్న విస్తృతాభిప్రాయానికి సమావేశం వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. క్రిప్టోలపై ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహించిన తొలి సమావేశం ఇది. సమావేశానికి వచ్చిన వారి అభిప్రాయాలను విన్నామని, ఇది ఇక ముందు కూడా కొనసాగుతుందని సిన్హా తెలిపారు. చదవండి:క్రిప్టో.. తగ్గేదేలే! -
లోకేష్.. ఏమిటీ వ్యాఖ్యలు.. విస్తుపోతున్న టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో నిరుద్యోగం గురించి నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అందరూ నవ్వుకునేలా వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఒక యువకుడికి పదేళ్లుగా ఉద్యోగం రాలేదంటూ.. రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ పదేళ్లలో ఐదేళ్లు అధికారంలో ఉంది మనమేగా.. అంటూ తెలుగుదేశం నాయకులే విస్తుపోయారు. ఏదో అనుకుంటే ఇలా అయిందేమిటంటూ వారు చర్చించుకోవడం కనిపించింది. యువజనోత్సవంలో పాల్గొనేందుకు లోకేష్ గురువారం నెల్లూరు వచ్చారు. స్థానిక చుండూరివారివీధిలో ఈనెల 1న కమల్ (34) ఆత్మహత్య చేసుకున్నాడు. పదేళ్ల కిందట ఎంబీఏ పూర్తిచేసిన కమల్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కమల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరిగారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. 300 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పదేళ్లుగా అనేక ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో నెల్లూరులో కమల్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి సొంత జిల్లాలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులుంటే ఒక్క కంపెనీ తెచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ప్రజల్ని గాలికొదిలేశారని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించకపోతే.. చంద్రబాబునాయుడు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇస్తుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకిచ్చిన రూ.2 వేల నిరుద్యోగ భృతిని తక్షణమే ఇవ్వాలని కోరారు. ఇదంతా విన్నవారు.. పదేళ్లుగా ప్రయత్నించినా ఉద్యోగం రాలేదంటే అందులో ఐదేళ్లు తెలుగుదేశమే అధికారంలో ఉండటం, అందులోను తాను మంత్రిగా పనిచేసిన విషయం లోకేష్‌కు గుర్తులేదా అని విమర్శిస్తున్నారు. -
ఆంజనేయుడి జన్మస్థలంపై కొనసాగుతోన్న సందిగ్థత
-
పంపా క్షేత్రమే హనుమంతుని జన్మస్థలం
తిరుమల: కర్ణాటకలోని పంపా క్షేత్రంలోని కిష్కింధలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుని జన్మస్థలంగా తమ వాదన నిరూపితమవుతుందని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన తిరుమలలోని గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ పండితులతో హనుమంతుని జన్మస్థలం నిర్ధారణపై చర్చించనున్నామని తెలిపారు. ఇప్పటికే టీటీడీ హనుమంతుని జన్మస్థలం శేషాచలం వెంకటాద్రిలోని అంజనాద్రి పర్వతమేనని నిర్ధారించిన విషయం విదితమే. కాగా, వాదన ముగిసిన అనంతరం టీటీడీ పాలకమండలి సభ్యులను, టీటీడీ ఉన్నతాధికారులను పంపా క్షేత్రంలోని హనుమంతుని జన్మస్థానమైన అంజనాద్రి పర్వతం వద్దకు తీసుకెళతామని స్వామీజీ చెప్పారు. చదవండి: అమ్మానాన్నా లేకున్నా నేనున్నా... కరోనా 'చింత' లేని గిరిజనగూడెం -
హనుమంతుని జన్మస్థలంపై చర్చ రేపే
సాక్షి, చిత్తూరు: హనుమంతుడి జన్మస్థలంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెప్తుండగా, కాదు కిష్కింధే హనుమంతుడి జన్మస్థలం అని తీర్థ క్షేత్ర ట్రస్టు చెప్తోంది. ఈ నేఫథ్యంలో టీటీడీతో హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చర్చకు సిద్ధమైంది. రేపు తిరుపతిలో హనుమాన్ జన్మస్థలంపై సంస్కృత విద్యాపీఠంలో చర్చ జరగనుంది. కిష్కింధ ట్రస్టు తరపున గోవిందానంద సరస్వతి, టీటీడీ తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొంటున్నారు. రేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో పండితుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరుపక్షాలు చర్చించి శాస్త్రోక్తంగా నిర్ధారణకు రావడమే ఉపాయమని గోవిందానంద సరస్వతి తెలిపారు. చదవండి: శ్రీవారి కోసం 365 రకాల దేశీ వరి! -
పాక్ తీరు మారిందా?
గత మూడేళ్లుగా దేనిపైన అయినా ఏకాభిప్రాయం మాట అటుంచి, పరస్పరం చర్చించుకోవటానికి కూడా సిద్ధపడని భారత్, పాకిస్తాన్ల మధ్య చర్చలు జరగటం కీలకమైన పరిణామం. గత వారం ఈ రెండు దేశాలకూ చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ (డీజీఎంఓలు) సమావేశమై 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధీన రేఖ (ఎల్ఓసీ) వద్ద, ఇతర సెక్టార్లలోనూ కచ్చితంగా పాటించాలని అంగీకారానికి వచ్చారు. పరస్పర లాభదాయకమైన ప్రయోజనాల కోసం సరిహద్దుల పొడవునా సుస్థిర శాంతి నెలకొల్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్య సమితి, అమెరికా హర్షం వ్యక్తం చేశాయి. కాల్పుల విరమణ ఒప్పందం నిజానికి హాస్యాస్పదమైన అంశంగా మిగిలిపోయింది. దాన్ని పాటించిన సందర్భాలకంటే ఉల్లంఘించటమే అధికం. అసలు అలాంటి ఒప్పందం వుందన్న సంగతిని ఎవరైనా మర్చిపోతారేమోనన్నట్టు ఏడాదికో, రెండేళ్లకో ఒకసారి దాని దుమ్ము దులపటం, గంభీరంగా దాన్ని గురించి మాట్లాడుకోవటం...ఏదో రకమైన అంగీకారం కుదిరినట్టు ప్రకటించటం, సంతకాల తడి ఆరకముందే సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లటం రివాజైంది. అయితే దీనికి 2018లో బ్రేక్ పడింది. అంతక్రితం థాయ్‌లాండ్‌లో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కూ, అప్పటి పాకిస్తాన్ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ నాసిర్‌ఖాన్ జంజువాకూ మధ్య సంభాషణలయ్యాక తర్వాత రెండు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగాలని నిర్ణయించారు. కానీ ఆ ఏడాది జనవరి 3న సాంబ సెక్టార్లో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌ను కాల్చిచంపటంతో మొదలుపెట్టి కాల్పుల విరమణ ఉల్లంఘనలు విపరీతంగా పెరిగాయి. ఇవి ఆ ఏడాది మే నెలవరకూ సాగుతూనే వున్నాయి. ఆ నెలలో మళ్లీ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందంపై అంగీకారం కుదిరింది. జూన్ నెలలో అంతా ప్రశాంతంగానే వున్నట్టు కనబడినా, ఆ నెల చివరిలో మళ్లీ పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. అటుపై ఆ ఏడాదంతా అడపా దడపా సరిహద్దుల్లో కాల్పుల మోత తప్పలేదు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో 43మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి తర్వాత మన వైమానిక దళం సరిహద్దుల ఆవల పాక్ భూభాగంలో వున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అనేకమంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇలా వరస దాడులు, ప్రతిదాడుల పరంపరతో నిలిచిపోయిన చర్చలు ఉరుము లేని పిడుగులా హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చాయన్నది అంతుచిక్కని ప్రశ్నే. ఇవి కేవలం డీజీఎంఓ స్థాయి చర్చలేనని సరిపెట్టుకోవటానికి లేదు. పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అక్కడి సైన్యం చెప్పుచేతల్లో నడుస్తుంది. కనుక ఆ ప్రభుత్వం చర్చలకు సిద్ధపడిందంటే అది సైన్యం నిర్ణయం మేరకు జరిగిందని అర్థం. మన ప్రభుత్వం కూడా అందుకు సుముఖత తెలిపిందంటే వైఖరిని కొంత సడలించుకుందని భావించవచ్చు. చాన్నాళ్లపాటు లోపాయికారీగా రెండు దేశాల దూతల మధ్యా పరస్పరం సుదీర్ఘమైన చర్చలు జరిగితేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇప్పుడు కుదిరిన అవగాహనలో కశ్మీర్ అంశం లేకపోవటం సైతం అందరికీ ఆశ్చర్యం కలిగించేదే. ‘సమస్యలకు దారితీస్తున్న... శాంతిని భగ్నం చేస్తున్న కీలకమైన అంశాలను గుర్తించి వాటిని పరిష్కరించు కునేందుకు ఇరు దేశాలూ పాటుపడతాయ’న్న మాటైతే అవగాహనలో వుంది. ఇందులో పరోక్షంగా ప్రస్తావనకొచ్చింది కశ్మీర్ అంశమేనని పాక్ మీడియా భాష్యం చెబుతోంది. జనవరి నెలలో జరిగిన ఒక ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ జమ్మూ-కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తేనే భారత్‌తో చర్చలుంటాయని చెప్పారు. కానీ నెల తిరిగేసరికి ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన అవగాహనలో దాని మాటే లేకపోవటం చూస్తే ఎవరి ఒత్తిడితో ఈ చర్చలు జరిగాయన్న ప్రశ్న తలెత్తుతుంది. అమెరికాలో బైడెన్ ఏలుబడి వచ్చాక ఆ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిందా లేక పాకిస్తాన్ సైన్యమే తన ఆలోచన మార్చుకుందా అన్నది తెలియాల్సివుంది. గత నెల మొదట్లో పాకిస్తాన్ సైనిక దళాల చీఫ్ జనరల్ బజ్వా ఇరుగుపొరుగుతో మర్యాదగా మెలగటం, శాంతియుత సహజీవనానికి సిద్ధపడటం తమ విధానమని చెప్పినప్పుడే కొందరిలో ఆ ప్రకటన ఆసక్తి కలిగించింది. ఏదేమైనా ఘర్షణకు బదులు చర్చించుకోవటం, సదవగాహన ఏర్పర్చుకోవటం ఎప్పుడూ మంచిదే. నవాజ్ షరీఫ్ ఏలుబడిలోనూ, అంతకుముందూ పౌర ప్రభుత్వాలు మన దేశంతో చర్చలకు సిద్ధపడినప్పుడల్లా పాకిస్తాన్ సైన్యం ఏదోవిధంగా వాటిని వమ్ము చేసేందుకు ప్రయత్నించేది. ఎల్ఓసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవటం, సరిహద్దుల్లో చొరబాట్లను ప్రోత్స హించి ఉగ్రదాడులు జరిగేలా చూడటం వంటివి చేసేది. ఇప్పుడు అందుకు భిన్నంగా తానే చర్చలకు సరేననటం మంచిదే. అయితే ఇదింకా విస్తరిస్తుందా, ద్వైపాక్షిక చర్చలకు కూడా చోటిస్తుందా అన్నది చూడాల్సివుంది. ఎల్ఓసీ ప్రశాంతంగా వుండటం, సరిహద్దు గ్రామాల ప్రజలు తమ రోజువారీ పనులు నిర్భయంగా చేసుకునే అవకాశం రావటం హర్షించదగ్గదే. ఈ శాంతియుత పరిస్థితులు ఎన్నాళ్లు కొనసాగుతాయన్నది పాకిస్తాన్ చిత్తశుద్ధిపై ఆధారపడివుంటుంది. ఆ చిత్తశుద్ధి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు దారితీస్తుందని, అందువల్ల రెండు దేశాలూ ఎంతగానో లాభపడొచ్చని పాకిస్తాన్ గుర్తిస్తే మంచిది. -
ఇంట్లో తాగునీటి శుద్ధి–నిల్వపై ఫిబ్రవరిలో చర్చాగోష్టి
ఆర్.ఓ. పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి–పంచాయతీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.), ఎస్.ఎం.సెహగల్ ఫౌండేషన్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న మెరుగైన ‘ఇంటి స్థాయిలో తాగునీటి శుద్ధి– నిల్వ పద్ధతుల’పై అనుభవాలను పంచుకునేందుకు, జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఫిబ్రవరి 27–28 తేదీల్లో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.లో చర్చాగోష్టి జరగనుంది. కెనడాకు చెందిన సెంటర్ ఫర్ అఫార్డబుల్ వాటర్ శానిటేషన్ టెక్నాలజీ ఈ వర్క్‌షాపునకు నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. నీటిశుద్ధి–నిల్వ సాంకేతికతల డెవలపర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, వీటిని అనుసరిస్తున్నవారు తమ అనుభవాలను పంచుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. తాము వాడుతున్న ప్యూరిఫయ్యర్లను ప్రదర్శించవచ్చు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు/పోస్టర్లను చూపించి చర్చలో పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు ఫిబ్రవరి 7లోగా వివరాలు పంపాలి. వివరాలకు.. అపరాజిత–98012 73123. Email: a.vaibhav@smsfoundation.org మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ(పర్మాకల్చర్) మహాసభ సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ సమీపంలోని) బిడకన్నె గ్రామంలోని వ్యవసాయ శిక్షణా క్షేత్రంలో జరగనుంది. ‘భూతాపోన్నతి – శాశ్వత వ్యవసాయ పరిష్కారాలు’ అనే అంశంపై ఈ మహాసభలో విస్తృత చర్చ జరుగుతుంది. పర్యావరణపరమైన సుస్థిరతను అందించే రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తి సాధనకు దోహదపడే జీవవైవిధ్య, ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ఈ మహాసభ వేదిక కానుంది. రిజిస్ట్రేషన్ తదితర సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 75697 20601. E-mail id : aranyahyd@gmail.com చిరుధాన్య వంటకాలపై 18న ఐ.ఐ.ఎం.ఆర్.లో శిక్షణ వర్షాధారంగా పండే చిరుధాన్యాలలో సకల పోషకాలు ఉన్నాయి. వీటిని మూలాహారంగా తీసుకుంటే జీవనశైలి వ్యాధులు సైతం నయం అవుతాయి. అయితే, వీటితో సంప్రదాయ వంటకాలతో పాటు ఆధునిక వంటకాలను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు అని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ–ఐ.ఐ.ఎం.ఆర్. (కేంద్ర ప్రభుత్వ సంస్థ) చెబుతోంది. చిరుధాన్య వంటకాల తయారీపై కుకింగ్ విత్ మిల్లెట్స్ పేరిట గృహిణులు, హోటళ్ల నిర్వాహకులు, స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులకు ఈ నెల 18(శనివారం)న ఐ.ఐ.ఎం.ఆర్.లోని న్యూట్రిహబ్ శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. 1,500. పేర్ల రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం.. nutrihubtbi@gmail.com 040-24599379/ 29885838 / Mobile - 9490476098 www.millets.res.in / www.nutrihub-tbi-iimr.org మట్టి ద్రావణంతో చీడపీడల నివారణపై 19న శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి ద్రావణంతో వివిధ పంటల్లో చీడపీడల నివారణ పద్ధతులపై ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, మట్టి ద్రావణ ంపై పేటెంట్ పొందిన చింతల వెంకటరెడ్డి ఈ నెల 19(ఆదివారం)న గుంటూరు జిల్లా కొర్నెపాడులోని తమ శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా పేర్లు నమోదుకు సంప్రదించాల్సిన నంబర్లు.. 97053 83666, 0863–2286255. 22న విజయవాడలో మామిడి రైతులకు శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఈనెల 22(శుక్రవారం)న విజయవాడ పడమట లంకలోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. విజయవంతంగా సాగు చేస్తున్న రైతులు పాల్గొని ఇతర రైతులతో అనుభవాలను పంచుకోవలసిందిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కోరుతోంది. వివరాలకు.. జగదీష్ – 78934 56163. 29న చోహన్ క్యు, సీవీఆర్ సాగు పద్ధతులపై శిక్షణ రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 29న ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు డా. చోహాన్ క్యు(దక్షిణ కొరియా) ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, ‘సర్ర’ డైరెక్టర్ రోహిణీ రెడ్డి (బెంగళూరు), మట్టి సేద్యం ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్) రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు తెలియజేస్తారు. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్ (ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్) బెడ్ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. ఆసక్తి గల రైతులు ఈ నెల 20 లోగా రూ. 200 చెల్లించి ముందాగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. సంపత్‌కుమార్ – 98854 55650, నీలిమ – 99636 23529. -
‘వారి బినామీలే భూములు కొనుగోలు చేశారు’
సాక్షి, మచిలిపట్నం: అమరావతి పేరుతో గత ప్రభుత్వ హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం ఉదయం సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు బినామీలతో భూములు కొనుగోలు చేయించారన్నారు. చంద్రబాబు ఊహజనిత కలల రాజధాని కట్టాలనుకున్నారని.. చంద్రబాబు నిర్ణయాలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ‘లక్ష కోట్ల మౌలిక వసతులు కల్పించినా 30 ఏళ్ల తర్వాతైనా.. హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలతో పోటీ పడే పరిస్థితి వస్తుందా.. ఒక్క ప్రాంతంలోనే లక్ష కోట్లు ఖర్చుచేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితేంటి.. స్వయం సంవృద్ధి ప్రాంతమైతే వేల కోట్లు అప్పు ఎందుకు తెచ్చారు. ఏడాదికి రూ.570 కోట్ల వడ్డీ ఎందుకు చెల్లించారు’ అని పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఐదేళ్లలో కేవలం రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చినా సీఎం సానుకూలంగా స్పందిస్తారని తెలిపారు. కచ్చితంగా రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. అందరికీ సానుకూలమైన పరిష్కారమే ప్రభుత్వం చూపిస్తుందన్నారు. హెరిటేజ్‌తో తన కుమారుడు లోకేష్‌కు చంద్రబాబు సంపద సృష్టించారన్నారు. గత ప్రభుత్వంలో పోలవరం ఏటీఎంలా మారిందని సాక్ష్యాత్తూ ప్రధానే చెప్పారని పేర్ని నాని పేర్కొన్నారు. (చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే) -
జీరో ఎఫ్ఐఆర్పై స్పష్టమైన ఆదేశాలిచ్చాం
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ, భద్రతకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత్ర తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు మహిళా భద్రతపై చర్చ జరిగింది. మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆమె శాసనసభలో వివరించారు. మహిళలు, కిశోర బాలికలను చైతన్యపరిచి సాధికార పరచటానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. 11వేల గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, 3వేల వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల పదవులను నోటిఫై చేశామన్నారు. ఈ నియామకాలు ద్వారా పోలీసు సేవలు మరింత మెరుగుపడతాయన్నారు. మహిళలు, చిన్నారులకు మరింత రక్షణ కల్పించేందుకు ‘మహిళా మిత్ర’ ఏర్పాటు చేశామని వెల్లడించారు. యువత, బాలలకు అవగాహన కల్పించి మహిళలపై నేరాలు తగ్గించడమే లక్ష్యమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు పోలీస్ అధికారులు, మహిళా మిత్రలను సమన్వయకర్తలుగా చేసి మహిళా మిత్ర ఉద్దేశాలు, లక్ష్యాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడం కోసం ‘సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9121211100’ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించటం, మహిళల్లో విశ్వాసాన్ని నింపటానికి బహిరంగ ప్రచారాలు, అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తామని సుచరిత వివరించారు. మహిళల భద్రత కోసం కఠినమైన న్యాయ చర్యలు చేయటానికి వీలుగా నేరాలపై కేసులు తక్షణ నమోదు చేయటానికి అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు దీర్ఘకాలిక సూచనలు ఇచ్చామని తెలిపారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి ఏపీ డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. మహిళలపై నేరాల పరిష్కారం కోసం ప్రత్యేక ఫాస్ట్ కోర్టులను 13 జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. వీటికి అదనంగా పోస్కో కేసుల పరిష్కారానికి 8 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ డబ్ల్యూసీ మంత్రిత్వశాఖ మహిళా పోలీస్ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిందని వివరించారు. గృహహింస, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింస వంటివి నివేదించటం మహిళా పోలీస్ వాలంటీర్ల కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో 1500 మంది మహిళా పోలీసు వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో మానవ రవాణా నిరోధక యూనిట్లు, ఏపీ మహిళాభ్యుదయం, శిశుసంక్షేమ శాఖ సభ్యులు, స్థానిక ఎన్జీవోల సభ్యుల సహకారంతో వ్యక్తుల రవాణా నిరోధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోక్సో నేరస్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని, పదేపదే అదే నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను నిర్భందించాలని యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పైలట్ విధానంలో ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్లల్లో ప్రాజెక్ట్ అభయ్ ప్రారంభించామని సుచరిత పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు టైమ్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎట్టకేలకు చర్చలకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో ఈ చర్చలు జరుగుతాయని సమాచారం. అయితే కార్మిక సంఘాల నేతలతో చర్చల్లో ఆర్టీసీ ఈడీలు పాల్గొంటారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 5 గంటల పాటు జరిగిన సమీక్షలో ఎట్టకేలకు చర్చల ప్రక్రియకు సీఎం కేసీఆర్ సమ్మతం తెలిపినట్లు సమాచారం. ఈ నెల 28న హైకోర్టులో సమ్మెపై విచారణ ఉన్న నేపథ్యంలో చర్చలు జరిపి వివరాలు కోర్టుకు సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. గడువు ఎక్కువగా లేనందున శనివారమే చర్చలకు ముహూర్తం ఖాయం చేశారు. సమ్మె ప్రారంభం కాకముందు ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ చర్చలు జరిపిన ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఈ చర్చలు ఉంటాయని తెలుస్తోంది. బస్‌భవన్‌లోనే చర్చలు జరపాలని తొలుత భావించినా, అక్కడికి పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో ఎర్రమంజిల్‌లో జరపాలని భావిస్తున్నట్లు తెలిసింది. చర్చల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించకపోవటం విశేషం. శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు అటు కార్మిక సంఘాల జేఏసీకి కూడా ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. నివేదికపై సుదీర్ఘ చర్చ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ కాకుండా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై పరిశీలించి నివేదిక సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు సునీల్‌శర్మను ఆదేశించిన నేపథ్యంలో, కమిటీ ఏర్పాటు బాధ్యతను సునీల్శర్మకే సీఎం అప్పగించారు. మూడు రోజుల కింద జరిగిన సమీక్షలో సీఎం సమక్షంలోనే ఎండీ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ గురువారమే నివేదికను సిద్ధం చేయగా, అదేరోజు సాయంత్రం ఎండీకి సమర్పించారు. దీనిపై చర్చించిన ఎండీ చేసిన సూచనల మేరకు పలు మార్పులు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి కమిటీ సభ్యులు భేటీ అయి తుది నివేదిక సిద్ధం చేసి సాయంత్రం ఎండీకి అందజేశారు. ప్రగతిభవన్‌లో నివేదికపై దాదాపు 5 గంటలపాటు సీఎం సమీక్షించారు. కార్మికులతో చర్చలు జరపాలా వద్దా.. జరిపితే ఏయే అంశాలు ఎజెండాలో ఉండాలి.. సమ్మె పర్యవసానాలు, సమ్మెకు దారితీసిన పరిస్థితులు, తరచూ సమ్మెల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, ఆర్టీసీ కుప్పకూలే దుస్థితికి చేరుకోవటానికి దారితీసిన పరిస్థితులు.. ఇలా సమగ్ర సమాచారాన్ని కోర్టుకు సమర్పించటం తదితర అంశాలపై చర్చించారు. సమ్మెపై పలుసార్లు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీకి చేసిన సూచనలు, ఐఏఎస్ అధికారుల కమిటీ తీరుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడని డిమాండ్లపైనే ఈ చర్చలు ఉంటాయని తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ప్రధాన డిమాండుగా జేఏసీ పేర్కొంటున్నా, అసలు దాన్ని పరిగణనలోకే తీసుకోబోమని సీఎం ఇప్పటికే తేల్చిచెప్పారు. దీంతో ఇప్పుడు చర్చల్లో ఆ అంశం ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. కోర్టు సూచించినట్లు మిగతా అంశాల ప్రస్తావనే ఉండనుంది. కాగా, సమావేశానంతరం సీఎంవో నుంచి కానీ, ఆర్టీసీ నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అధికారులు కూడా మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ప్రభుత్వానికి నివేదిక మూడు రోజుల పాటు కసరత్తు చేసిన అనంతరం ఆర్టీసీ ఉన్నతాధికారుల కమిటీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఆర్టీసీ ఎండీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు కసరత్తు చేసి ఆర్టీసీ ఈడీలు టి.వెంకటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వరరావు, వినోద్‌కుమార్, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఆర్టీసీ ఆర్థిక సలహాదారు రమేశ్‌లతో కూడిన ఈ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. దాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేశారు. అంతా రికార్డు చేయాలి: అశ్వత్థామరెడ్డి చర్చలకు ఆహ్వానిస్తే సంతోషమేనని, అయితే ఆర్టీసీ విలీనం అంశం కూడా చర్చల్లో ఉండాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి శుక్రవారం రాత్రి ‘సాక్షి’తో తేల్చిచెప్పారు. చర్చల ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయాలని తాము కోరబోతున్నట్లు వెల్లడించారు. వీడియో రికార్డు జరపలేకపోతే చర్చల సారాంశాన్ని నమోదు చేసి తమ సంతకాలు, చర్చల్లో పాల్గొన్న అధికారుల సంతకాలు తీసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు. -
టీవీ చర్చలలో మహిళల స్థానం ఎక్కడ?
ట్రిపుల్ తలాక్ వంటి విషయాల మీద చర్చలు జరుగుతుంటే, అందులో మహిళల కంటే పురుషులే అధికంగా ఉంటున్నారు. మతాలు, నేరాలకు సంబంధించిన వాటిలో 30 శాతం మంది పాల్గొంటుంటే, ఒక్క మహిళను కూడా ఆహ్వానించటం లేదని ఈ సర్వే చెబుతోంది. క్రీడల విభాగం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలలో కూడా స్త్రీలకు స్థానం కల్పించట్లేదు. పోలీసు విభాగం నుంచి ఒక్కరిని కూడా ఆహ్వానించట్లేదని, చర్చా కార్యక్రమాలలో మహిళలు చాలా తక్కువగా ఉంటున్నారని ఈ సర్వే చెబుతోంది. పస్తుతం టీవీ యుగం నడుస్తోంది. వార్తా చానెల్స్‌లో నిత్యం ఏదో ఒక అంశం మీద చర్చాకార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఎంతోమంది పాల్గొంటూనే ఉంటారు. కానీ, వారిలో మహిళలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు. ఈ విషయం మీద ఎన్‌డబ్ల్యూఎంఐ (నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇన్ ఇండియా) ఒక సర్వే నిర్వహించింది.12 భాషలకు చెందిన 28 చానెల్స్‌లో ఈ సర్వే చేశారు. ఇంగ్లీషు – 6, హిందీ – 4, గుజరాతీ, పంజాబీ, ఉర్దు, తమిళం, తెలుగు, మలయాళం, బంగ్లా, ఒడియా, అస్సామీస్, మరాఠీ భాషలన్నీ కలిపి 18 చానెల్స్లోను ఈ సర్వే నిర్వహించారు. ప్రతి చానెల్ నుంచి ఒక ప్రైమ్‌టైమ్ న్యూస్ షో, ఒక టాప్ వీక్లీ టాక్ షోల ఆధారంగా రివ్యూ చేశారు. ఇందులో అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, అస్సాం, కోల్‌కతా, ముంబై, పుణేలకు చెందిన 11 మంది ఎన్‌డబ్ల్యూ ఎంఐ సభ్యులు పాల్గొన్నారు. ఈ సర్వేలో, మూడు వంతులమంది మేల్ యాంకర్లే ఉన్నారని తేలింది. ఈ వివక్ష హిందీ చానెల్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయ టీవీ న్యూస్ చానల్స్‌లో... ప్రముఖ వ్యాఖ్యాతలుగా మహిళలు 13.6 శాతం, పురుషులు 86 శాతం ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది. సాధారణంగా చర్చాకార్యక్రమాలలో చర్చలో కేవలం ఒక్క మహిళను మాత్రమే ప్రతినిధిగా పిలుస్తున్నాయి చానల్స్. గుజరాతీలో 21 శాతం, తమిళం, పంజాబీలలో 5 శాతం మాత్రమే. బంగ్లా, తెలుగులలో 11 శాతం, మలయాళంలో 10 శాతం ఉన్నారు. మహిళా సమస్యల మీద చర్చించే వారిలో మహిళలు తక్కువగా ఉండటం చాలా ఆశ్చర్యం. రాజకీయాలకు సంబంధించిన చర్చలలో కేవలం 8 శాతం మాత్రమే ఉంటున్నారు. వివక్ష తగ్గాలి... చానెల్స్‌లో ఈ వివక్ష తగ్గేలా చూడాలని, మహిళలను అన్ని అంశాలకు చెందిన చర్చలలోకి ఆహ్వానించాలని, చర్చలో మహిళల గొంతు ఎక్కువగా వినిపించాలని ఈ సర్వే చేసిన మహిళలు ఆశిస్తున్నారు. సీనియర్ మేల్ యాంకర్లతో ప్రోగ్రాములు చేయిస్తుంటారు కాని, సీనియర్ మహిళలను మాత్రం విధుల నుంచి తొలగిస్తుంటారని, ఇది ఎంతవరకు న్యాయమని వీరు ప్రశ్నిస్తున్నారు. 13.6 శాతం మహిళలు, 86 శాతం పురుషులు ఈ చర్చలలో పాల్గొంటున్నారు. దీనిని బట్టి మహిళలు గొంతు విప్పి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం సున్నితమైన అంశాలకు మాత్రమే కాకుండా, అన్ని అంశాల మీద చర్చకు మహిళలను ఆహ్వానించాలని చెబుతున్నారు ఈ సర్వే ద్వారా. డా. వైజయంతి (ఢిల్లీలో ఇటీవల జరిగిన 14వ జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు నుంచి) -
రఫేల్ ఒప్పందంపై చర్చకు సిద్ధం : కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై చర్చకు తమ పార్టీ సిద్ధమని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ 85వేల కోట్ల అదనపు వ్యవయానికి సభ ఆమోదం తెలిపిన అనంతరం ఖర్గే మాట్లాడుతూ రఫేల్ ఒప్పందంపై చర్చకు తాము సిద్ధమని చెబుతూ ఈ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ ఒప్పందంపై బుధవారమే చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఖర్గే పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందపై ఖర్గే చర్చను ప్రారంభించాలని దీనికి ప్రభుత్వం బదులిచ్చేందుకు సిద్ధమని జైట్లీ చెప్పారు. చర్చ నుంచి తప్పించుకునేందుకు ఖర్గే పారిపోతున్నారని, రాఫేల్‌పై చర్చ జరగాలని ఈ ఒప్పందంపై కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని తాను నిరూపిస్తానని జైట్లీ పేర్కొన్నారు. ఇక సభ వాయిదాపడే సమయంలో చర్చను ఎప్పుడు నిర్వహిస్తారనేది వెల్లడించాలని స్పీకర్ సుమిత్రా మహజన్‌ను ఖర్గే కోరారు. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ చర్చకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం పార్లమెంట్లో రాఫేల్ ఒప్పందపై చర్చ జరగవచ్చని భావిస్తున్నారు. -
చర్చ లేకుండానే ఆర్థిక బిల్లులు ఆమోదమా?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్‌కున్న ప్రాధాన్యత గురించి విడమర్చి విఫులంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల వాణిని ప్రతిధ్వనించేందుకు, కార్యనిర్వాహక విధుల్లో ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వాన్ని కాళ్ల బొటన వేళ్లపై నిలబట్టేందుకు పార్లమెంట్ వేదిక ఉపయోగపడుతుంది. ప్రతి అంశంపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరిపి సముచిత నిర్ణయం తీసుకునేందుకు దోహద పడుతుంది. ఇంతటి ప్రాధాన్యంగల పార్లమెంట్ సమావేశాలు వరుసగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. వివిధ డిమాండ్లపై ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తుండగా, సందట్లో సడేమియా లాంటి ఎలాంటి చర్చ లేకుండానే పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదిస్తూ పోతోంది. దీంతో బుధవారం నాడు లోక్‌సభ కీలకమైన బడ్జెట్, ఆర్థిక బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా కేవలం 30 నిమిషాల కాల వ్యవధిలో ఆమోదించింది. సాధారణ రోజుల్లో ఈ బిల్లులపై చర్చ జరిపి ఆమోదించడానికి కొన్ని వారాలు పడుతుంది. ఈ విషయంలో తప్పు మీదంటే మీదంటూ ప్రభుత్వ, ప్రతిపక్షాలు పరస్పరం వేలెత్తి చూపుకుంటున్నాయి. వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు గొడవ చేయడం వల్ల పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. తమ డిమాండ్లపై ముందుగా చర్చ జరిపితే ఆ తర్వాత ఇతర డిమాండ్లపై చర్చ జరిపే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. లోక్‌సభలో గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతున్న దృష్యాలను చూస్తుంటే చర్చ పట్ల ప్రభుత్వానికిగానీ, ప్రతిపక్షానికిగానీ చిత్తశుద్ధి మాటను పక్కన పెడితే కనీస ఆసక్తి కూడా లేదని స్పష్టం అవుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై తీవ్రమైన చర్చకు అవకాశమే ఇవ్వలేదు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ ‘కావేరి జలాల నిర్వహణ బోర్డు’ ఏర్పాటుకు ఎలాంటి చొరవ తీసుకోలేదు. గతేడాది పన్నులతో సంబంధంలేని పలు చట్టాల సవరణకు ఆర్థిక బిల్లు ప్రతిపాదించడం, వాటిలోని కొన్ని అంశాలపై ఇప్పటికీ సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుండడం తెల్సిందే. ఈసారి అలా కాకుండా కీలకమైన ఆర్థిక అంశాలకే పరిమితమైన ఆర్థిక బిల్లును ఎలాంటి చర్చ లేకుండా ఆమోందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ఈ బిల్లులో చివరి క్షణంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 20 సవరణలను ప్రతిపాదించారు. వాటిల్లో విదేశీ నిధుల నియంత్రణ కింద రాజకీయ విరాళాలను క్రమబద్ధీకరించడం లాంటి కీలకమైన సవరణలు ఉన్నాయి. ఎన్నికల విరాళాల్లో పారదర్శకతను దెబ్బతీసే సవరణలు కూడా ఇందులో ఉండవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా సవరణలు ఉన్నాయనడంలో కూడా సందేహం లేదు. అలాంటప్పుడు చర్చకు ఆస్కారం ఇవ్వక పోవడం ఏ మేరకు సమంజసం? బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తీరును ఆ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీలను కూడా విస్మయానికి గురిచేశాయి. పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగేలా ప్రతిపక్షాలను ఒప్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, అఖిల భారత అన్నా డీఎంకే నాయకుడు ఎం. తంబిదురై విమర్శించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -
హోదా కోసం అవిశ్వాసం
-
దుబారా దెబ్బకు దివాళా
-
సుస్థిర ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు
-
అవినీతికి అధికారం అండ
► ‘ఉపాధి’లో అంతులేని అక్రమాలు ► సిబ్బందికి అండగా విచారణాధికారి అనుకున్నదే జరిగింది. ముందుస్తు ప్రణాళిక ప్రకారం ప్రొసీడింగ్ అధికారి, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు అవినీతిపరులకు అండగా నిలిచారు. రూ.కోట్ల ప్రజా ధనాన్ని బొక్కేసిన అధికారపార్టీ నాయకులకు, ఉపాధి సిబ్బందికి హాని జరగకుండా కంటికి రెప్పులా కాపాడారు. సామాజిక తనిఖీ బృందం ఉపాధి పనుల్లో భారీగా జరిగిన అవినీతికి ఆధారాలు చూపిస్తున్నా బహిరంగ చర్చా వేదిక మీద న్యాయ నిర్ణేతలు పట్టించుకోలేదు. తమ గ్రామాల్లో ఉపాధిలో జరిగిన అవినీతి గురించి చెప్పేందుకు వచ్చిన వారు ప్రొసీడింగ్ అధికారి తీరు చూసి న్యాయం జరగదని వెనుదిరిగారు. ఇదంతా సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు నిర్వహించిన ఉపాధి హామీ పథకం బహిరంగ చర్చావేదిక వద్ద జరిగింది. ఉదయగిరి/సీతారామపురం: సీతారామపురం మండలంలో 2016 మార్చి నుంచి 2017 జూన్ వరకు జరిగిన రూ.16.77కోట్ల ఉపాధి పనులకు సంబంధించి జూలై 28 నుంచి ఆగస్టు 18 వరకు సోషల్ ఆడిట్ బృందం క్షేత్రస్థాయిలో పనులు తనిఖీ చేసి అందులో లోపాలు, అవినీతిని గుర్తించి చర్చావేదక వద్ద తమ నివేదికలు చదివి వినిపించారు. వీరు తమ క్షేత్ర పరిశీలనలో రూ.9.84కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఇందులో యంత్రాలతో పనులు చేసి బినామీ మస్టర్లు వేసి నేతలు, సిబ్బంది రూ.కోట్లు దిగమింగారు. పనులు చేయకుండానే పెద్ద మొత్తంలో దోచేసిన వైనం గురించి వేదిక ముందుంచారు. నాయకులు, ఉపాధి సిబ్బంది, సామగ్రి సప్లయర్లు ఏ విధంగా ఉపాధి నిధులు కాజేశారో సవివరంగా తెలియజేశారు. అయినా దీంతో మాకు పని ఏముంది, న్యాయ నిర్ణేతను తాను అయినందున తాను చెప్పింది వేదం అన్నట్లుగా ప్రొసీడింగ్ అధికారి నాసర్‌రెడ్డి వ్యవహరించారు. రూ.కోట్లలో జరిగిన అవినీతిని భారీగా తగ్గించి రూ.87 లక్షలకు కుదించారు. ఉపాధి సిబ్బందికి, నాయకులతో కుదిరిన ఒప్పుందం మేరకు, బహిరంగ వేదిక వద్ద ముందే చెప్పిన విధంగా జరిగిన అవినీతితో నిమిత్తం లేకుండా పది శాతం మాత్రమే రికవరీకి ఆదేశాలిచ్చారు. ఊపిరి పీల్చుకున్న తెలుగు తమ్ముళ్లు, సిబ్బంది మండలంలో భారీగా జరిగిన అవినీతి ఎక్కడ బయటపడి పరువు పోతుందో అనే ఆందోళనతో ఉన్న తెలుగు తమ్ముళ్లు ప్రొసీడింగ్ అధికారి సహకారంతో ఊపిరి పీల్చుకున్నారు. సస్పెన్షన్లు తప్పవని కంగారుగా ఉన్న ఉపాధి సిబ్బందిపై కూడా సదరు అధికారి ప్రేమ చూపడంతో చిన్న చర్యలు కూడా లేకపోవడంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. నియోజవర్గంలో ఇప్పటికే అధికారి పార్టీ ముఖ్య నేతలు పసుపు కుంభకోణంలో చిక్కి క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పార్టీ ప్రతిష్ట, ఎమ్మెల్యే పరువు పోయింది. ఇదే తరుణంలో ఉపాధి అవినీతి బయటపడితే ప్రజల వద్ద మరింత పలచనవుతామని కంగారుపడ్డారు. దీంతో సదరు నాయకులు చర్చావేదికకు వచ్చిన అధికారులను లోబరుచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు చేసిన మేలుకు ప్రతిఫలంగా రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయనే ప్రచారం సాగుతోంది. అధికారుల తీరుపై విస్మయం అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బంది అంతు తేల్చే కలెక్టర్ ఉన్నప్పుటికీ పక్కాగా జరిగిన అవినీతిని కప్పిపుచ్చిన అధికారుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిజాయితీ అధికారులతో విచారణ చేయిస్తే అవినీతిపరుల భరతం పట్టే అవకాశం ఉంది. ఇదేమీ తీరు మండలంలో 15 నెలలకు సంబంధించి రూ. 16.77 కోట్ల ఉపాధి పనులు నిర్వహించారు. వాటిలో మెటీరియల్ పనులు రూ.7 కోట్లు, కూలీల పనులు రూ.9.75 కోట్లు జరిగాయి. జిల్లాలోనే ఎక్కువ పనులు, అవినీతి జరిగే మండలం సీతారామపురం అనే విషయం జిల్లా అధికారులకు బాగా తెలుసు. అయితే ఈ మండలంలో జరుగుతున్న అవినీతిపై మీడియా, పత్రికలు పెద్దగా ఫోకస్ చేయకపోవడంతో వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. దీంతో జిల్లా అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇదే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, ఉపాధి సిబ్బందికి, రాజకీయ నాయకులకు వరంగా మారింది. దీంతో ఇష్టారాజ్యంగా ప్రజా ధనాన్ని మింగేస్తున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో అక్రమార్కులు మరింత అవినీతికి పాల్పడేందుకు ఆస్కారం కల్పిస్తోంది. చర్చా వేదికలో ప్రొసీడింగ్ అధికారి రికవరీకి ఆదేశించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి సిబ్బంది నుంచి రూ.45.10 లక్షలు, కూలీల నుంచి రూ.4.80 లక్షలు, లబ్ధిదారుల నుంచి రూ.2.92 లక్షలు, సప్లయిదారు నుంచి రూ.9 లక్షలు, ఫారెస్ట్ అధికారులు నుంచి రూ.14.76 లక్షలు, ఇరిగేషన్ శాఖ నుంచి రూ.2.84 లక్షలు రికవరీకి ఆదేశించారు. అదేవిధంగా వివిధ పంచాయతీల్లో 42 పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు, రెండు పనులు ఏపీడీకి పరిశీలనకు ఇచ్చారు. -
నంద్యాల ఉప ఎన్నికపై చర్చ
-
ఫిట్నెస్ మంత్ర
-
2019లో అధికారంలోకి రావడమే లక్ష్యం
-
నత్తల కన్నా నెమ్మదిగా...!
-
చెప్పింది కొడంత...చేసింది గోరంత..!
-
లారీల సమ్మె సడలింపు
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో లారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై లారీ యజమానుల సంఘ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో గురువారం రాత్రి నుంచి లారీలు రోడ్లపైకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలపై ఇంకా పరిష్కారం లభించలేదు. దీంతో పక్క రాష్ట్రాలకు లారీలను నడిపే అవకాశాలు లేకుండా పోయింది. ఈ మేరకు రాష్ట్రంలో లారీలు తిరగవచ్చనే సమాచారాన్ని రాష్ట్ర అసోసియేషన్‌కార్యదర్శి జిల్లాలోని అసోసియేషన్ బాధ్యులకు గురువారం సాయంత్రం సమాచారం పంపించారు. దీంతో రహదార్లపైకి లారీలు రావడానికి మార్గం సుగమమైంది. శుక్రవారం నుంచి గురువారం వరకు జిల్లాలో లారీలు తిరగనందువల్ల సుమారు రూ.300 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. జిల్లాలో దాదాపు 5 వేల లారీలు ఉండగా వారం రోజులుగా నిలిచిపోయాయి. వేలాది కుటుంబాలు ఆదాయం లేక విలవిల్లాడాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిశ్రమపై నిరవధిక సమ్మె తీవ్ర ప్రభావం చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గం దొరికిందని గూడెం లారీ అసోసియేషన్‌నాయకుడు గురుజు సూరిబాబు అన్నారు. -
విషమ పరీక్ష
-
పట్టుకొల్పోతున్న అయ్యన్న పాత్రుడు
-
కోటప్ప కొండ వెనుక చరిత్ర
-
ఆదర్శగ్రామంగా పేరు తెచ్చుకున్నకుమ్మరిపాడు
-
పవన్‌కల్యాణ్ పై విస్త్రుత చర్చ
-
ఎన్.టి.ఆర్.
-
బడ్జెట్ పై విశ్లేషణ
-
ర్యాలీపై ఏపీ కేబినెట్లో చర్చ
-
చోరీ బంగారం రికవరీలో రగడ
తణుకు : చోరీకి గురైన బంగారం రికవరీలో రగడ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళా నిందితురాలు తాను చోరీ చేసిన సుమారు 300 గ్రాముల బంగారాన్ని తణుకు పట్టణంలోని సురేంద్ర జ్యూయలరీలో మూడునెలల క్రితం తాకట్టు పెట్టింది. ఆమెను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఈనెల 18న విశాఖపట్నం నుంచి వచ్చిన పోలీసులు 150 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. మళ్లీ సోమవారం రాత్రి వచ్చి మిగిలిన 150 గ్రాముల బంగారాన్ని అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో షాపు యజమాని వాగ్వాదానికి దిగారు. గతంలోనే రికవరీ చేసి తీసుకెళ్లారు కదా మళ్లీ ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ సీహెచ్ రాంబాబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. ఇదిలా ఉంటే తమ వద్ద తాకట్టు పెట్టింది 35 గ్రాములేనని బంగారంషాపు యజమాని చెబుతుండటం కొసమెరుపు. ఈ సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా స్థానిక బంగారు దుకాణాల యజమానులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సురేంద్ర బంగారు నగల దుకాణం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
దివికేగిన నటశిఖరం
-
ఫీజు రీయింబర్స్మెంట్ పై అదే పట్టు
• సభ ప్రారంభం కాగానే చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షాలు • ప్రశ్నోత్తరాల తర్వాత చేపడదామన్న సీఎం.. ససేమిరా అన్న విపక్షాలు • అక్బరుద్దీన్ అభ్యంతరంతో అన్ని పక్షాల నుంచి అభిప్రాయ సేకరణ సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై అసెంబ్లీలో మరోమారు వాడివేడి చర్చ జరిగింది. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఫీజులపై చర్చకు పట్టుబట్టాయి. సీపీఎం మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇదే అంశంపై స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. బుధవారం సభ ఆకస్మికంగా ముగి సిందని, ప్రతిపక్షాలు అడిగే సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ఆందో ళనకు దిగాయి. అందుకు అంగీకరించని స్పీకర్.. ముందుగా ప్రశ్నోత్తరాలను కొనసాగిం చాలని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. అయినా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ సందర్భంగా సీఎల్పీ నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ఈ అంశంపై చర్చిం చాలని, ఆ తర్వాత ప్రశ్నోత్తరాలను కొనసాగిం చాలని కోరారు. ఈ దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంచేసుకుంటూ.. తామేమీ ప్రతిష్టకు పోవడం లేదని, చర్చ ఆకస్మికంగా ముగిసిందని సభ్యులు భావిస్తున్నారు కనుక దీనిపై మళ్లీ మాట్లాడేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ప్రశ్నోత్తరాల తర్వాత చర్చ కొనసాగిద్దామన్నారు. దీంతో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మీ రెండు పక్షాలేనా..?: అక్బరుద్దీన్ ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత మాట్లాడి, సీఎం చెబితే అంతా అయిపోయినట్టేనా అని ప్రశ్నిం చారు. దీంతో స్పీకర్ అన్ని పక్షాలకు అవకాశం ఇచ్చారు. కిషన్‌రెడ్డి (బీజేపీ), రేవంత్‌రెడ్డి (టీడీపీ), సున్నం రాజయ్య(సీపీఎం) మాట్లాడుతూ ఫీజులపై చర్చించాలని కోరారు. తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సభలో సభ్యులు మాట్లాడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సింగరేణిపై కూడా సభలో చర్చించాల్సి ఉన్నందున ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామన్నారు. దీంతో స్పీకర్ ప్రశ్నోత్త రాలను కొనసాగిస్తున్నట్టు ప్రకటిం చడంతో విపక్షాల సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలకు ప్రభుత్వం సిద్ధమై వచ్చిందని, ఫీజుల పథకంపై సమాధానా లివ్వాలంటే అధికారులను కూడా పిలిపించి గణాంకాలను చెప్పాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. ప్రశ్నోత్తరాల తర్వాత అవసరమైతే గంట సేపయినా ఫీజులపై చర్చిద్దామని చెప్పడంతో 35 నిమిషాల గందరగోళానికి తెరపడి ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. బకాయిలు వెంటనే చెల్లించండి ప్రశ్నోత్తరాల తర్వాత 11:30 గంటల సమ యంలో ఫీజులపై చర్చకు స్పీకర్ అనుమ తించారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడు తూ.. గత ప్రభుత్వాల హయాంలో పేరుకు పోయిన బకాయిలను చెల్లించడం భారంగా మారిందనే కోణంలో ప్రభుత్వం సమాధానం చెప్పడం సరి కాదన్నారు. 2014లో తాము అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరిలోనే గవర్నర్ పాలన వచ్చిందని, తెలంగాణ ఆందోళనలు జరిగాయని, చివరి త్రైమాసికం నిధులు రాక పోవడంతో కొన్ని బకాయిలు ఉన్నాయన్నారు. 2014–16 మధ్య మధ్య తెలంగాణ ప్రభుత్వమే రూ.1,800 కోట్ల మేర బకాయిలు పెట్టిందన్నారు. తర్వాత కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, రాజయ్యలు మాట్లాడుతూ ఫీజులు వెంటనే చెల్లించాలని కోరారు. గణాంకాలతో అక్బర్ ప్రసంగం ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఈపాస్ వెబ్సైట్లో ఉన్న గణాంకాలను పేర్కొంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. 2015–16లో 2,22,475 మంది అర్హులు ఉంటే కేవలం ఏడుగురి దరఖాస్తులు మాత్రమే రిజి స్టర్ అయ్యాయని, 2016–17లో మొత్తం 9,02,898 విద్యార్థులు అర్హులు అయితే.. 7,70,953 మంది రిజిస్టర్ చేసుకున్నారని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఇంజ నీరింగ్ కాలేజీలను మూసివేయాలని సీఎం చెప్పడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ప్రజల మధ్యే సభ నిర్వహించాలి
దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ తహసీల్దార్‌కు వినతిపత్రం తొండంగి : దివీస్ బాధిత గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారి మధ్యే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సభ నిర్వహించాలని దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. రెండు రోజుల క్రితం బాధిత గ్రామాలకు చెందిన కొంత మంది రైతులతో సమస్యలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ రమన్నారంటూ తొండంగి తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణ బాధిత గ్రామాల ప్రజలకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పంపాదిపేట, తాటియాకులపాలెం, కొత్తపాకలు, నర్శిపేట, ఒంటిమామిడి తదితర గ్రామాల ప్రజలు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మట్ల ముసలయ్య, గంపల దండు, మేరుగు ఆనందహరి, యనమల సత్తిబాబు, కుక్కా కొండ, కుక్కా సత్యనారాయణ, బద్ది బుజ్జి, తాటిపర్తి బాబూరావులతోపాటు మరికొంత మంది రైతులు బుధవారం తహసీల్దార్‌ను కలిశారు. రెవెన్యూ అధికారులు కోరిక మేరకు జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు బాధిత గ్రామాల ప్రజలమంతా కలిసి చర్చించుకున్నామన్నారు. కలెక్టర్ తమ సమస్యలను తెలుసుకునేందుకు నిర్ణయించుకుంటే బాధిత గ్రామంలో ఎక్కడైనా సభ ఏర్పాటు చేసుకోవచ్చని తహసీల్దార్‌కు వివరించారు. గతంలో పంపాదిపేటలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో కాలుష్య దివీస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమ వద్దన్న బాధిత గ్రామాల ప్రజలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. తర్వాత సుమారు 1200 మంది సంతకాలు చేసిన వినతిపత్రాలు కలెక్టర్‌కు ఇచ్చేందుకు వెళ్లినా పట్టించుకోలేదు. శాంతియుతంగా పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందిపెడుతుంటే స్పందించలేదు. మూడు నెలలుగా 144 సెక్ష¯ŒS అమలు చేసి, పోరాటానికి వచ్చిన నాయకులు, మహిళలపై పోలీసులు దాడి చేసినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. తమ భూములకు ప్రభుత్వం ఎన్ని లక్షలు పరిహారం ప్రకటించినా సరే కాలుష్య పరిశ్రమకు అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా తమతో చర్చించేందుకు రమ్మనడంపై ప్రజల్లో అనేక దురభిప్రాయాలు వస్తాయన్న కారణంగా జిల్లా కలెక్టర్‌ను కలిసే పరిస్థితి లేదన్నారు. అధికారులు ఎటువంటి చర్చ చేయదలచినా తమ ఉద్యమానికి మద్దతు పలికిన స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టిరాజా, ప్రజా సంఘాల నాయకులు, దివీస్ వ్యతిరేక పోరాటకమిటీ సభ్యుల సమక్షంలో బాధిత ప్రజల ముందే సభ నిర్వహించాలని తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ దివీస్ వ్యతిరేక పోరాటకమిటీ సభ్యుల వినతిపత్రాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయితే రైతులు, బాధిత ప్రజల అభిప్రాయాలను, అభ్యం తరాలను లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు నేరుగా తెలియజేయాలని దివీస్ వ్యతిరేకపోరాట కమిటీ సభ్యులకు సూచించారు. దీనిపై స్పందించిన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని కలెక్టర్‌కు తహసీల్దార్ వినతిప్రతం ద్వారా తెలిపాలని కోరారు. బాధిత గ్రామాల ప్రజలతో చర్చించుకున్న తర్వాతే కలెక్టర్‌ను కలవడంపై సమాచారమిస్తామని తహసీల్దార్‌కు వివరించారు. -
మనీ మ్యాటర్స్
-
ఆసుపత్రిలో భార్యపై కత్తితో దాడి
-
భార్యపై కత్తితో దాడి
గణపవరంలో ఈ దారుణం చిలకలూరిపేట టౌన్: భార్యపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన పడాల సావిత్రి తన అక్క కూతురిని పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చింది. వైద్యుడు లేకపోవడంతో ఇద్దరూ ఓపీ వద్ద వేచి ఉన్నారు. సుమారు మధ్నాహ్యం మూడు గంటల సమయంలో సావిత్రి భర్త పడాల అక్కిరాజు ఆసుపత్రికి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. హటాత్తుగా బొడ్డులో నుంచి కత్తి తీసి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన సావిత్రి డాక్టర్ గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకొనే ప్రయత్నం చేసింది. తలుపు గడియ పడకపోవడంతో లోనికి తోసుకువెళ్లిన అక్కిరాజు తన వద్ద ఉన్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యాడు. దాడిలో పొట్ట,ఛాతీ, తల,చేతిపై మొత్తం ఏడు పోట్లు పడ్డాయి. స్థానికులు గాయపడిన సావిత్రిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి తీవ్ర రక్తస్రావం కావడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పట్టణ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది. -
రేపు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ విద్యార్థులకు త్వరలో జరిగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ (అథ్లెటిక్స్)కు సంబంధించి నిర్వహణపై చర్చిం చేందుకు స్థానిక కొత్తూరు ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటేశులు తెలిపారు. రేపు ఆంగ్ల బోధనోపాధ్యాయులకు శిక్షణ జిల్లాలోని మోడల్ ప్రైమరీ స్కూళ్లలో పని చేస్తున్న ఇంగ్లిషు టీచర్లకు బుక్కపట్నం డైట్ కళాశాలలో బుధవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 14 నుంచి 18 వరకు ధర్మవరం, పెనుకొండ డివిజన్లకు, 20 నుంచి 24 వరకు అ నంతపురం, గుత్తి డివజన్ల పరిధిలోని టీచర్లు హాజరుకావాలని సూ చించారు. గతంలో ఆంగ్లపరీక్ష రాసిన ప్రతి ఉపాధ్యాయుడు త ప్ప కుండా శిక్షణకు హాజరుకావాలని, ఈ పరీక్షకు గైర్హాజరైన పాఠశాలల్లో ప్రస్తుతం ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు తప్పక హా జరుకావాలని తెలిపారు. హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల జాబితా పంపండి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సమ్మేటివ్–1 పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులు జాబితా, మీడియంల వారీగా విద్యార్థుల సంఖ్య వివరాలు ఎంఈఓలకు అందజేయాలని హెచ్ఎంలను డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో ఆదేశించారు. ఎంఈఓలు, మండలస్థాయిలో నిర్దేశించిన కమిటీ సభ్యులు బుధవారం ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో నిర్వహించే సమావేశానికి వివరాలతో హాజరుకావాలని సూచించారు. మీడియం, పాఠశాలల వారీగా మండలంలో ని 6–10 తరగతుల విద్యార్థుల సంఖ్య, సబ్జెక్టు వారీగా మండలంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన పాఠశాల, నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు తదితర వివరాలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. -
హోదాపై చర్చకు బాబు సర్కారు జంకుతోందా
-
మౌనమే సోనమ్!
గాసిప్ ఓహ్... సోనమ్ కపూర్ స్టైల్ వెనక సీక్రెట్ ఇదా! అప్పుడోసారి ఓ ఇంటర్వ్యూలో భానే బ్రాండ్ దుస్తులు గురించి అంతలా ఎందుకు హైప్ చేసిందో ..మాకు ఇప్పుడు అర్థమైందంటున్నారు బాలీవుడ్ జనాలు. అసలు విషయంలోకి వస్తే... ‘రుస్తుమ్’ సినిమా మంచి సక్సెస్ అయినందుకు హీరో అక్షయ్ కుమార్... ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది ఆ సక్సెస్ పార్టీకి హాజరయ్యారు. అందులో సోనమ్ కపూర్ కూడా ఉన్నారు. పార్టీలోనూ, పార్టీ ముగిసిన తర్వాత ‘రుస్తుమ్’ సక్సెస్ కంటే ఎక్కువగా సోనమ్ గురించే సెలబ్రిటీల్లో డిస్కషన్ జరిగిందట. ఆ పార్టీ తర్వాత ఆనంద్ అహూజా పేరు బాగా పాపులర్ అయ్యింది. ఆనంద్ అహూజా, సోనమ్ కపూర్లు జంటగా, ఒకే కారులో ‘రుస్తుమ్’ సక్సెస్ పార్టీకి వచ్చారట. ఎవరీ హ్యాండ్సమ్ కుర్రాడు? అని ఆరా తీసిన వాళ్లకు భానే క్లాతింగ్ బ్రాండ్ కంపెనీ ఓనర్ అతడేనని కాసేపటికి అర్థమైంది. సినిమా ప్రీమియర్ షోలకు లేదా ఎక్కడికైనా ఊరు వెళ్లినప్పుడు సోనమ్ భానే బ్రాండ్ డ్రస్సులే వేసుకుని కనిపిస్తుంటారు. ఓ ఇంటర్వ్యూలో ‘నా ఫేవరెట్ బ్రాండ్ భానే’ అని చెప్పారు. సో, సోనమ్‌కు ఆనంద్ అహూజా మంచి ఫ్రెండ్ అయ్యుంటారని అక్కడున్న వారందరూ అనుకున్నారట. వీరిద్దరి వ్యవహారం చూసిన తర్వాత కన్ఫర్మ్గా సోనమ్ డేటింగ్లో ఉందంటున్నారు. ఎప్పుడూ మీడియాలో వ్యక్తిగత విషయాల గురించి సోనమ్ మాట్లాడలేదు. గతంలో పునీత్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందన్నప్పుడు కూడా సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడూ మౌనమే సోనమ్ భాష! -
కేంద్రమంత్రిని ఆకర్షించిన రజాక్
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఉపాధ్యాయులకు సూచించారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మైనారిటీ విద్యార్థులతో శనివారం మాటామంతీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పినపుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. విద్యార్థులతో మాటామంతీ అంతకుముందు మంత్రి ప్రకాశ్ జవదేకర్ విద్యార్థులతో మాట్లాడారు. అబ్దుల్ అనే విద్యార్థి తాను వాలీబాల్ బాగా ఆడతానని అనగా.. స్పోర్ట్స్ చానల్స్ చూసి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. చాలా దూరం నుంచి వచ్చే విద్యార్థులు ఎవరని మంత్రి ప్రశ్నించగా జుబేదా, సమీరా తాము చాలా దూరం నుంచి నడిచి వస్తామని చెప్పారు. తాను కూడా చిన్నపుడు స్కూల్‌కు చాలా దూరం నడుచుకుంటూ వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంగ్లిష్ అంటే ఇష్టమన్న రజానాకు.. రోజూ రెండు ఇంగ్లిష్ పేపర్లు చదవాలని, ఇంగ్లిష్ టీవీ చానల్స్ చూడాలని సూచించారు. సంగీతమంటే ఇష్టమని చెప్పిన గౌసియా బేగంను పాడమని కోరగా.. ఆ విద్యార్థిని ‘దిల్ దియా హై.. ఏ వతన్ తేరే లియే’ పాట వినిపించింది. సయ్యద్ రజాక్ అనే విద్యార్థి కేంద్ర మంత్రి దృష్టిని ఎక్కువగా ఆకర్షించాడు. మల్కాజ్గిరి నుంచి స్కూల్‌కు రోజూ 7 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి వచ్చే రజాక్‌ను భవిష్యత్‌లో ఏం చేస్తావని ఆయన అడిగారు. ‘మా బస్తీలో చదువుకోలేని వారికి చదువు చెప్తానని... ప్రస్తుతం నా స్నేహితుడు షరీఫుద్దీన్‌కు చెబుతున్నా’నని అన్నాడు. రజాక్‌ను అభినందించిన మంత్రి.. ‘మళ్లీ వచ్చి నిన్ను కలుస్తా’నని విద్యార్థికి చెప్పారు. -
హోదాపై చర్చకు పట్టుబట్టిన వైఎస్ఆర్సీపీ
-
రెవెన్యూ చట్టాలపై చర్చ జరగాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లో ఉన్న వివిధ రెవెన్యూ చట్టాలపై సమగ్ర చర్చ జరగాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సూచించారు. అసైన్డ్, భూదాన భూములు, ఆర్వోఆర్, భూసంస్కరణల చట్టం, కౌల్దారు తదితర అంశాలున్నందున తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయిదెకరాల లోపు సాదా బైనామాలను ఉచితంగా రిజిస్టర్ చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడం సరికాదన్నారు. వివాదాస్పద, బోగస్ భూములు ఉన్నందున.. రాజకీయ పార్టీలు, నిపుణులతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలన్నారు. మంగళవారం మఖ్దూం భవన్లో ఆ పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డితో కలసి చాడ విలేకరులతో మాట్లాడారు. జూన్ 2న పార్టీ కార్యాలయంలో రాష్ర్ట అవతరణ ఉత్సవాలు, అదేరోజు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ ప్రగతిరథం స్పీడెంత’ అంశంపై సదస్సు నిర్వహిస్తామన్నారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్షాలు రాజకీయ స్వయ్రోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్య రాజోలిబండ డైవర్షన్ స్కీం రాజుకుంటున్నదని, ఈ సమస్య పరిష్కారానికి చంద్రబాబు, కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చరిత్ర-చర్చ
దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుల్లో భగత్‌సింగ్, ఆయన అనుచరుల స్థానం విశిష్టమైనది. భగత్‌సింగ్ అనగానే అందరికీ ఆయన సాహసోపేత చర్యలు గుర్తొస్తాయి. ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఉరికంబమెక్కిన ఆయన త్యాగనిరతి స్ఫురణకొస్తుంది. అన్నిటికీ మించి ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటి పరిష్కార మార్గాలపైనా 23 ఏళ్ల చిరుప్రాయంలోనే భగత్సింగ్కున్న అవగాహన అబ్బురపరుస్తుంది. అందువల్లే అంతటి మహోన్నతుణ్ణి ఎవరైనా ‘విప్లవ ఉగ్రవాది’(క్రాంతికారి ఆటంక్వాద్) అని ముద్రేస్తే ఆగ్రహం కలగడంలో, వివాదం సాగడంలో వింతేమీ లేదు. ఢిల్లీ యూనివర్సిటీ తన చరిత్ర విద్యార్థుల కోసం నిర్దేశించిన పాఠ్య ప్రణాళికలో చదవదగిన గ్రంథమంటూ సూచించిన ‘ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్’, దాని హిందీ అనువాదం‘భారత్ కా స్వతంత్ర సంఘర్ష్’ పుస్తకాలపై ప్రస్తుత వివాదం నడుస్తోంది. ఇందులో కొన్నిచోట్ల భగత్‌సింగ్‌నూ, ఆయన అనుచరులనూ విప్లవ ఉగ్రవాదులుగా అభివర్ణించారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ఆరోపించారు. వారినలా అభివర్ణించడమంటే ఆ వ్యక్తుల త్యాగనిరతిని ‘అకడమిక్‌గా’ హత్య చేయడమేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. భగత్‌సింగ్ కుటుంబీకులనుంచి సైతం తమకు ఫిర్యాదులందాయని ఆమె చెప్పారు. రాజ్యసభలో ఉపాధ్యక్షుడు పీజే కురియన్ స్పందిస్తూ ఆ గ్రంథాల్లోని అభ్యంతరకర ప్రస్తావనలను తొలగించేలా చూడాలని కోరారు. ఢిల్లీ యూనివర్సిటీ వెనువెంటనే రంగంలోకి దిగి ఆ గ్రంథాల పంపిణీ, అమ్మకం నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి ఒక్క ఢిల్లీ యూనివర్సిటీ మాత్రమే కాదు...దేశంలోని అనేక యూనివర్సిటీలు వాటిని చదవదగిన పుస్తకాలుగా సూచిస్తున్నాయి. భగత్‌సింగ్ పట్ల ఈ దేశ ప్రజల్లో ఉండే ఆదరాభిమానాలు సామాన్యమైనవి కాదు. అవి మన నేతల ఆగ్రహావేశాల్లో వ్యక్తం కావడంలో వింతేమీ లేదు. అయితే ఇప్పుడు చెలరేగిన వివాదం కేవలం అందుకు మాత్రమే పరిమితమైనది కాదని ఇంకొంచెం లోతుల్లోకి వెళ్తే అర్ధమవుతుంది. విఖ్యాత చరిత్రకారుడు బిపన్‌చంద్ర మరికొందరితో కలిసి ఈ గ్రంథాన్ని రచించారు. వీరంతా చరిత్ర రచనలో లబ్ధప్రతిష్టులైనవారు. జాతీయోద్యమంపై వీరు సాగించిన పరిశోధన, అధ్యయనం...ఎన్నో కొత్త కోణాలను ఆవిష్కరించాయి. ఆ ఉద్యమంలో భిన్న వర్గాల ప్రజలు పాల్గొన్న తీరుపైనా, అది వలస పాలకులను వణికించిన తీరుపైనా ఈ చరిత్రకారులు చేసిన నిర్ధారణలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందాయి. ముఖ్యంగా బిపన్ చంద్ర వలసవాదం, సమకాలీన చరిత్ర, మతతత్వ వ్యతిరేక ఉద్యమాలువంటి అంశాలపై విస్తృతంగా రచనలు చేశారు. ఆధునిక భారత చరిత్రను సాధారణ ప్రజానీకానికి సుబోధకం చేశారు. అలాంటివారు త్యాగాల, సాహసాల కలబోత అయిన భగత్‌సింగ్ ప్రభృతులను అంత బాధ్యతారహితంగా ఉగ్రవాదులతో ఎలా పోల్చారన్న సంశయం మన నేతలకు రావలసింది. పుస్తక రచయితల్లో ఒకరైన బిపన్‌చంద్ర 2014లో కన్నుమూశారు. ఇప్పుడు వివాదం తలెత్తింది గనుక ఆ గ్రంథ రచనలో పాలుపంచుకున్న ఇతర రచయితలను సంప్రదించడం, వారి వివరణ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. ఉగ్రవాది అనే పదం పఠితల్లో కలగజేసే భావనను వారు గ్రహించలేకపోయారా లేక దాన్ని ఉపయోగించడానికి ప్రత్యేకమైన కారణమేమైనా ఉన్నదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సింది. ఆ పని జరగలేదు. పార్లమెంటు చర్చలో మాట్లాడినవారు కూడా పరస్పరం విమర్శించుకోవడానికే ఈ వివాదాన్ని ఉపయోగించుకున్నారు. పాతికేళ్లకు పైబడి వివిధ యూనివర్సిటీల్లోని చరిత్ర విద్యార్థులు ఉపయోగిస్తున్న పుస్తకంలోని వివాదాస్పద అంశం ఇంతకాలం ఎందుకు మరుగున పడిపోయిందో ఎవరూ చెప్పలేకపోయారు. జాతీయోద్యమంలో భిన్న స్రవంతులున్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం రావడానికి అనుసరించాల్సిన పద్ధతులపై నాయకుల్లో వేర్వేరు అభిప్రాయా లున్నాయి. వలసపాలకులను ఒప్పించి, నిష్ర్కమించక తప్పని పరిస్థితులు కల్పించి అహింసా విధానంలో స్వాతంత్య్రం సాధించడం సాధ్యమేనని కాంగ్రెస్, మహాత్మాగాంధీ విశ్వసిస్తే...ఖుదీరాం బోస్, మదన్‌లాల్ ధింగ్రా వంటివారు తుపాకులు, బాంబులతో దాడులు చేస్తేనే వారి పాలన విరగడవుతుందని భావించారు. 1908-1918 మధ్య అలాంటి హింసాత్మక విధానాలకు పాల్పడిన అనేకమందిని పాలకులు ఉరితీశారు. ఖైదు చేశారు. ఆ తర్వాత అలాంటి ఘటనల తీవ్రత తగ్గిపోయింది. మహాత్ముడి నేతృత్వంలో సాగుతున్న సహాయ నిరాకరణోద్యమం చౌరీచౌరాలో హింసకు దారితీయడం పర్యవసానంగా నిలిపేసినప్పుడు 1922లో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు రంగంలోకొచ్చారు. వారి చర్యలను విప్లవకర ఉగ్రవాదమని వ్యవహరించేవారు. ప్రజలను నిలువుదోపిడీ చేస్తూ, వారిపై అణచివేత చర్యలకు పాల్పడే వలస పాలకులపై హింసను ప్రయోగించి, భీతావహుల్ని చేసి దేశంనుంచి తరిమికొట్టడమే వీరి ధ్యేయం. బిపన్‌చంద్ర విప్లవకర ఉగ్రవాదం పదాన్ని పుస్తకంలో తొలిసారిగా వినియోగించినప్పుడే అందుకు సంబంధించిన వివరణనిచ్చారు. దాన్ని అవమానకర అర్ధంలో వినియోగించడంలేదని చెప్పారు. అయినప్పటికీ నిస్సహా యులైన పౌరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చడంవంటి ఉన్మాద చర్యలు అంతర్జాతీ యంగా పెచ్చుమీరాక దాని అర్ధమే పూర్తిగా మారిపోయింది. కనుక ఆ పదాన్ని తొలగిస్తున్నట్టు రచయితలు ప్రకటించి ఉంటే వేరుగా ఉండేది. వారు ఆ పని చేయలేదు. అయితే 2006లో భగత్‌సింగ్ రచనల సంపుటిని వెలువరించినప్పుడు ఆయనను బిపన్‌చంద్ర విప్లవ సామ్యవాదిగా అభివర్ణించారు. అనంతర రచనల్లో సైతం దాన్నే కొనసాగించారు. ఇలాంటి నేపథ్యంలో బిపన్‌చంద్ర వంటి విఖ్యాత చరిత్రకారుడిలో అవగాహనా లోపం ఏమైనా ఉంటే విమర్శించడంలోగానీ, దానితో విభేదించడంలోగానీ తప్పు లేదు. కానీ ప్రపంచం మెచ్చే మేధావులకు ఉద్దేశాలు ఆపాదించడం సబబనిపించుకోదు. ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు ఆదరణ పెరిగి తరగతి గదులనుంచి నిష్ర్కమిస్తున్న ‘చరిత్ర’ పార్లమెంటుకెక్కడం మంచిదే అయినా ఆ చర్చ భగత్‌సింగ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు, ఆయన కలలుగన్న సమాజం తదితరాలపై సాగాలని... అది మెరుగైన విధానాల రూపకల్పనకు దోహదపడాలని ఆశిద్దాం. -
చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్‌కు ఆత్మ: మోదీ
న్యూఢిల్లీ : చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్‌కు ఆత్మ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగమే మనకు ఆశారేఖ అని ఆయన వ్యాఖ్యానించారు. హోప్ అనే పదంలో హెచ్ అంటే (H) సామరస్యం, ఓ(o) అంటే అవకాశం, పి (P) అంటే ప్రజల భాగస్వామ్యం, ఈ (E) అంటే సమానత్వం అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఎంపీలు వ్యవహరిస్తారని అన్నారు. పార్లమెంట సమావేశాలు సజావుగా జరగాలని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అందరూ ముక్తకంఠంతో చెప్పారని మోదీ తెలిపారు. -
కరువుపై అట్టుడికిన అసెంబ్లీ
దుర్భిక్ష పరిస్థితులను సభ దృష్టికి తెచ్చిన ప్రతిపక్ష నేత ♦ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడంపై నిలదీత ♦ గణాంక సహితంగా పరిస్థితిని వివరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ♦ కేంద్ర నిధులనూ రైతులకు దక్కనీయకపోవడంపై మండిపాటు ♦ రైతులకు కనీసస్థాయిలో కూడా రుణాలు ఇవ్వకపోవడంపై ఆవేదన ♦ కరువు మండలాల ప్రకటనలోనూ అన్యాయమేనని ఆగ్రహం ♦ ఇప్పటి వరకూ ఏ రైతుకూ దమ్మిడీ సాయం చేయలేదని మండిపాటు ♦ జగన్‌కు అడుగడుగునా అడ్డు తగిలిన అధికార పార్టీ నేతలు ♦ మరణించిన ప్రతి రైతు కుటుంబాన్నీ పరామర్శిస్తానని జగన్ ప్రకటన హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపట్టడంలో సర్కారు ఘోర వైఫల్యంపై శాసనసభ అట్టుడికిపోయింది. కరువు బారి నుంచి రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం కర్షకులకు దక్కాల్సిన నిధులను దారి మళ్లిస్తోందంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2013 -14లో పంట నష్టపోయిన రైతులకు రూ.1,690 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన సర్కారు, గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు దక్కాల్సిన ఇన్పుట్ సబ్సిడీని రూ.1,067 కోట్ల నుంచి రూ.692 కోట్లకు తగ్గించడంపై నిలదీశారు. ప్రభుత్వ నిర్వాకంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాండవిస్తోన్న కరువు పరిస్థితులపై శాసనసభలో గురువారం స్వల్ప కాలిక చర్చలో ప్రతిపక్షనేత మాట్లాడారు. ఈ ఏడాది 556 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పెట్టుబడుల రూపంలోనే రైతులు రూ.8 వేల కోట్లకుపైగా నష్టపోయారని, రూ.1,500 కోట్లకుపైగా ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారని చెప్పారు. కలెక్టర్లు పంపిన నివేదికలపై తక్షణం స్పందించి.. అక్టోబర్‌లో కరువు మండలాలను ప్రకటించాల్సిన ప్రభుత్వం డిసెంబర్ వరకూ ఆ అంశాన్నే మరిచిపోయిందని విమర్శించారు. 'డిసెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షం నిలదీస్తుందనే భయంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. 2014 డిసెంబర్ 17 రాత్రి హడావుడిగా 238 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కానీ రైతులకు దమ్మిడీ సహాయం కూడా చేసిన పాపాన పోలేదు. ఏప్రిల్ 22 వరకూ రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వం ఆలోచన చేసిన దాఖలాలు కూడా లేవు. ఆ రోజున కరువుపై కేబినెట్ సమావేశంలో చర్చించి, రైతులకు రూ.1,067 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వాలని ప్రకటించారు. జూలై 22న మరోమారు కేబినెట్లో చర్చించి ఇన్పుట్ సబ్సిడీని రూ.692 కోట్లకు తగ్గించారు. అంటే ఇన్పుట్సబ్సిడీలో రూ.375 కోట్లు కోత వేశారు. కరువు తీవ్రత దృష్ట్యా ఇన్పుట్ సబ్సిడీని పెంచాల్సింది పోయి తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిది. పోనీ ఆ నిధులైనా రైతులకు ఇచ్చారా అంటే అదీ లేదు. 2014-15కు సంబంధించి ఒకసారి రూ.190 కోట్లు, ఇటీవల రూ.100 కోట్లు మొత్తం రూ.290 కోట్లను ఇన్పుట్ సబ్సిడీ రూపంలో విడుదల చేశారు. కలెక్టర్లు ప్రతిపాదించిన ఇన్పుట్ సబ్సిడీ రూ.1,500 కోట్లు ఎక్కడ? ఏప్రిల్ 22న కేబినెట్ నిర్ణయించిన రూ.1,067 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ? జూలై 22న కేబినెట్ తీర్మానించిన రూ.692 కోట్లు ఎక్కడ? విడుదల చేసిన ఇన్పుట్ సబ్సిడీ రూ.290 కోట్లు ఎక్కడ? రైతులను ఇలాగేనా ఆదుకోవడం? 2015-16కు కేంద్రం కేటాయించిన విపత్తు నిధిని 2014-15కు మళ్లిస్తే ఈ ఏడాది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎలా చెల్లిస్తారు? సాయమంటే నిధులు మళ్లించడమా? 2013-14లో వరుస తుఫాన్లు, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల సంవత్సరం కావడంతో అప్పట్లో రాజకీయ పార్టీల నేతలు అందరూ రైతుల వద్దకు వెళ్లి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రైతుల వద్దకు వెళ్లి దన్నుగా నిలుస్తానని మాట ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ.1,690 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చేది లేదని శాసనసభ సాక్షిగా సీఎం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రభుత్వం అలా ఇతర వ్యాపకాలకు మళ్లిస్తోంది. రైతులకు మాత్రం మొండిచేయి చూపుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 554 మిల్లీమీటర్లకుగానూ 378 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని మంత్రిగారే చెప్పారు. కనీసం కరువు ఛాయల గురించి వారికి ఇప్పటికైనా అర్థం అయ్యింది. వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఖరీఫ్‌లో నూనెగింజల పంటలు 11.98 లక్షల హెక్టార్లు సాగు చేయాల్సి ఉండగా కేవలం 5.69 లక్షల హెక్టార్ల(47 శాతం)లో మాత్రమే సాగు చేశారు. పప్పుధాన్యాల పంటలు 25.96 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 15.04 లక్షల హెక్టార్ల(57.9 శాతం)లో సాగు చేశారు, వరి పంట 16.75 లక్షల హెక్టార్లకుగానూ 8.54 లక్షల హెక్టార్ల(50.98 శాతం)లో సాగు చేశారు. మిగతా వారంతా పంట విరామాన్ని ప్రకటించారు. ఒక్క పత్తి పంట మాత్రం 5.84 లక్షల హెక్టార్లకుగానూ 4.49 లక్షల హెక్టార్ల(76 శాతం)లో సాగు అయ్యింది. ఇలా సాగు చేసిన పంటలు కూడా వర్షాభావం వల్ల ఎండిపోయాయి. ఖరీఫ్‌లో రైతులు ఇలా పంటలు సాగుచేయకపోవడానికి ప్రకృతి ఒక కారణమైతే, మరో కారణం చంద్రబాబు పుణ్యం. అప్పుల ఊబిలో రైతన్న.... పంట రుణాలు దక్కక రుణాలు రెన్యూవల్ చేయకపోవడం వల్ల బీమాకు దూరమై రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వ్యవసాయ రుణాలను లక్ష్యం కన్నా అధికంగా పంపిణీ చేయడం రివాజు. 2011-12లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.48 వేల కోట్ల కాగా రూ.58,511 కోట్లను రైతులకు పంపిణీ చేశారు. 2012-13లో రూ.52,972 కోట్ల లక్ష్యానికి గానూ రూ.73,648 కోట్లు, 2013-14లో రూ.67,224 కోట్లకు గానూ రూ.73,494 కోట్లను వ్యవసాయ రుణాలుగా పంపిణీ చేశారు. కానీ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారింది. 2014-15లో వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యం రూ.56,019 కోట్లుకాగా కేవలం రూ.39,938 కోట్లే పంపిణీ చేశారు. 2015-16 ఖరీఫ్‌లో రూ.29,022 కోట్లకుగానూ రూ.21,018 కోట్లనే పంపిణీ చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా లక్ష్యం కన్నా తక్కువగానే వ్యవసాయ రుణాలు పంపిణీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇది రైతుల దుస్థితికి అద్దం పడుతోంది.మరో వైపు చంద్రబాబు మాత్రం రుణమాఫీ కింద తొలి, మలి విడతల్లో రూ.ఏడు వేల కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. వ్యవసాయ రుణాలపై 18 నెలల్లో వడ్డీ రూ.15 నుంచి రూ.16 వేల కోట్లు అయింది. అంటే చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదన్నది స్పష్టమవుతోంది. ఆత్మహత్యల బాటన రైతన్న... అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 197 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే 101 మంది అన్నదాతలు ఆత్మార్పణం చేసుకున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 26 రోజుల్లో 46 కుటుంబాలను పరామర్శించాను. ఇంకా ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబం ఇంటికీ నేను వెళ్లి పరామర్శిస్తాను వారి బాధలు, గాథలను అందరికీ వినిపిస్తా’’ అని జగన్ ప్రకటించారు. మార్చగలిగితే మార్చండి రైతుల తలరాతలను అని ప్రభుత్వానికి సూచించారు. ఈ సందర్భంలో ప్రసార, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జోక్యం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 24 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతుంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ విపక్ష నేతను ప్రశ్నించారు. ఇందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ చర్చలో పట్టిసీమ గురించి కూడా చెబుతానన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుంటూ కరువు అంశానికే పరిమితం కావాలన్నారు. కరువుపై చర్చలో ప్రాజెక్టులు కూడా భాగమేనని జగన్ చెబుతూ పట్టిసీమ అంటే ఎందుకంత భయం అని అధికారపక్షాన్ని నిలదీశారు. స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. పరిహారం పేరుతో పరిహసిస్తారా? వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్చను కొనసాగిస్తూ... 'చంద్రబాబు అధికారం చేపట్టాక అనంతపురంలో 101, శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 4, తూర్పుగోదావరిలో 5, కృష్ణాలో 2, గుంటూరులో 10, చిత్తూరులో 5, వైఎస్సార్ కడప జిల్లాలో 9, ప్రకాశంలో 7, విశాఖలో ఒకరు, నెల్లూరులో ఒకరు, కర్నూలులో 45 మంది... మొత్తం 197 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని నేను పరామర్శించి.. వారి బాధలను గాథలను ప్రభుత్వం కళ్లు తెరిపించేలా వివరిస్తాను. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరిహారం పేరుతో పరిహసిస్తున్నారు. రూ.ఐదు లక్షలుగా అందించే పరిహారంలో రూ.1.50 లక్షలు అప్పులు తీర్చడానికి రూ.3.50 లక్షలు కుటుంబ జీవనానికి కేటాయించారు, కానీ ఆ రూ.3.50 లక్షలను బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్‌పై డిపాజిట్ చేసి ఏటా వచ్చే వడ్డీ రూ.35 వేలను అందిస్తున్నారని రైతుల కుటుం బాలు చెబుతున్నాయి. అది కూడా పంటలు సాగుచేసినట్టుగా ఆధారాలు చూపిస్తే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఆ డబ్బును ఇస్తామంటున్నారు. పరిహారంగా ఇవ్వాల్సిన సొమ్మును రైతు ల కుటుంబాలకు దక్కనీయకుండా చేస్తూ... భవిష్యత్తులో ఆ రూ.3.50 లక్షలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకునే కుట్రను చేస్తోంది. చివరకు రూ.ఐదు లక్షల పరిహారాన్ని రూ.రెండు లక్షలకు తగ్గిస్తూ జీవో ఇచ్చారు.' అని మండిపడ్డారు. ఊళ్లకు ఊళ్లు ఖాళీ కరువు దెబ్బకు వ్యవసాయం కుదేలైతే ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. 'ఒక్క అనంతపురం జిల్లాలోనే నాలుగు నుంచి ఐదు లక్షల మంది బెంగ ళూరుకు వలస వెళ్లారు. రాయలసీమలో 1,500 అడుగుల మేర బోర్లు తవ్వినా చుక్క నీళ్లు దొరకడం లేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాకు రప్పించి కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లిస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. కానీ.. పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది...'అని జగన్ వ్యాఖ్యానించగా స్పీకర్ మైక్ కట్ చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నిరసనల హోరు మధ్యే మంత్రులు రావెల కిశోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు మరో మారు విపక్షనేతపై విరుచుకుపడ్డారు.డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కరువు పరిస్థితుల గురించి కేంద్రానికి తెలియజేస్తామన్నారు. విపక్ష సభ్యుల నిరసన మధ్యనే కరువుపై చర్చను అర్ధాంతరంగా ముగించి స్పీకర్ కోడెల సభను శుక్రవారానికి వాయిదా వేశారు. -
ఉభయ సభలు గురించి సాక్షి ఈడీతో చర్చ
-
బ్లాక్‌లో.. బిగ్ సినిమా!
-
ఎవరు మారాలి?
-
నిజంగా ఆగిపోతాయా ?
-
విజయేంద్ర బాహుబలి
-
ఆత్మహత్య!
-
ఫోరెన్సిక్‌తో గుట్టురట్టు!
-
‘108’ సమ్మె వాయిదా !
-
కళ్లార్పకుండా.. గంటా పది నిమిషాల అబద్ధాలు
-
మనిషిగా మారని ముఖేష్
-
నిర్భయా?నిర్ధయా?
-
ఫోర్త్ ఎస్టేట్ : రైల్వే బడ్జెట్ - విశ్లేషణ
-
'కార్పొరేట్ గూఢచర్యం'పై చర్చిద్దాం
కార్పొరేట్ గూఢచర్యం కేసుకు సంబంధించిన విషయంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సమాజ్‌వాది పార్టీకి చెందిన నరేశ్ అగర్వాల్ ఈ విషయంపై చర్చను లేవనెత్తారు. ముఖ్యమైన శాఖల(పెట్రోలియం, రక్షణ, విదేశీ)కు చెందిన విలువైన రహస్య పత్రాలు లీకయినప్పటికీ అందుకు కారణమైన ప్రధానమైన వ్యక్తులను వదిలేసి చిన్నచితకా, జూనియర్స్‌ను మాత్రమే అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ కార్యదర్శి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకుని ఈ విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పెట్రోలియంశాఖతోపాటు రక్షణశాఖకు చెందిన పలు విలువైన పత్రాలు లీకైన విషయంపై కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. -
హై డ్రగ్స్ బాద్
-
ఢిల్లీ డిసైడ్స్
-
ఢిల్లీ ఫలితాలపై ఉత్కంఠ