లోక్‌సభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే (ఫైల్‌పోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై చర్చకు తమ పార్టీ సిద్ధమని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ 85వేల కోట్ల అదనపు వ్యవయానికి సభ ఆమోదం తెలిపిన అనంతరం ఖర్గే మాట్లాడుతూ రఫేల్ ఒప్పందంపై చర్చకు తాము సిద్ధమని చెబుతూ ఈ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ ఒప్పందంపై బుధవారమే చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఖర్గే పేర్కొన్నారు.
రఫేల్ ఒప్పందపై ఖర్గే చర్చను ప్రారంభించాలని దీనికి ప్రభుత్వం బదులిచ్చేందుకు సిద్ధమని జైట్లీ చెప్పారు. చర్చ నుంచి తప్పించుకునేందుకు ఖర్గే పారిపోతున్నారని, రాఫేల్‌పై చర్చ జరగాలని ఈ ఒప్పందంపై కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని తాను నిరూపిస్తానని జైట్లీ పేర్కొన్నారు. ఇక సభ వాయిదాపడే సమయంలో చర్చను ఎప్పుడు నిర్వహిస్తారనేది వెల్లడించాలని స్పీకర్ సుమిత్రా మహజన్‌ను ఖర్గే కోరారు.
కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ చర్చకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం పార్లమెంట్‌లో రాఫేల్ ఒప్పందపై చర్చ జరగవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment