జమ్మూ:కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే వేదికపైనే అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం(సెప్టెంబర్29) జమ్మూకాశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఆయన కళ్లుతిరిగి కిందపడబోయారు.దీంతో అక్కడున్న నేతలు వెంటనే ఖర్గేను పడకుండా పట్టుకున్నారు.
తర్వాత ఆయనకు నీళ్లందించారు. అనంతరం ఖర్గే తన ప్రరసంగాన్ని కొనసాగించారు.ప్రసంగిస్తుండగా పార్టీ నేతలు ఆయనను పట్టుకొని నిల్చున్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తామన్నారు. ఇందుకోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు.
తాను అప్పుడే చనిపోనని,మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అలసిపోనని సవాల్ చేశారు.అయితే ఖర్గే వేదికపైనుంచి కిందపడబోయిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా,జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 5 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఇదీచదవండి: పదేళ్ల మన్‌కీ బాత్‌లో ప్రధాని భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment