jammu kashimir assembly elections
-
సభా వేదికపై ఖర్గేకు అస్వస్థత
జమ్మూ:కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే వేదికపైనే అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం(సెప్టెంబర్29) జమ్మూకాశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఆయన కళ్లుతిరిగి కిందపడబోయారు.దీంతో అక్కడున్న నేతలు వెంటనే ఖర్గేను పడకుండా పట్టుకున్నారు.తర్వాత ఆయనకు నీళ్లందించారు. అనంతరం ఖర్గే తన ప్రరసంగాన్ని కొనసాగించారు.ప్రసంగిస్తుండగా పార్టీ నేతలు ఆయనను పట్టుకొని నిల్చున్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తామన్నారు. ఇందుకోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు. తాను అప్పుడే చనిపోనని,మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అలసిపోనని సవాల్ చేశారు.అయితే ఖర్గే వేదికపైనుంచి కిందపడబోయిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా,జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 5 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.ఇదీచదవండి: పదేళ్ల మన్‌కీ బాత్‌లో ప్రధాని భావోద్వేగం -
జమ్ములో కాల్పులు జరిపే ధైర్యం ఎవరికీ లేదు: అమిత్ షా
శ్రీనగర్: ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు పాకిస్థాన్‌తో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా నౌషేరాలో జరిగిన ర్యాలీని అమిత్ షా పాల్గొని మాట్లాడారు.‘‘నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విధంగా జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారు. ఆర్టికల్ 370ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ప్రస్తుతం బంకర్లు అవసరం లేదు ఎందుకంటే ఎవరూ బుల్లెట్లు కాల్చడానికి ధైర్యం చేయలేరు. జమ్ము కశ్మీర్లో 30 ఏళ్లుగా కొనసాగిన ఉగ్రవాదం 40వేల మందిని బలి తీసుకుంది.కశ్మీర్ ఉగ్రవాదంతో కాలిపోతున్నప్పుడు.. ఫరూఖ్ అబ్దుల్లా లండన్‌లో హాలిడే గడిపారు.#WATCH | Rajouri, J&K: Addressing a public meeting in Nowshera, Union Home Minister Amit Shah says, "... Farooq Abdullah says that they will bring back Article 370. Farooq Sahab, nobody can bring back Article 370... Now, bunkers are not needed because no one can dare to fire… pic.twitter.com/cciMG6psOb— ANI (@ANI) September 22, 2024..పాకిస్థాన్‌తో మనం చర్చలు జరపాలని వారు కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాకిస్థాన్‌తో చర్చలు జరపబోం. ఉగ్రవాదులను జైళ్ల నుంచి విముక్తి చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీ హయాంలో ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా అంతం చేశాం. ఉగ్రవాది, రాళ్లదాడికి పాల్పడివారు జైలు నుంచి విడుదల కాలేరు. జమ్ము కశ్మీర్లో ఏ ఉగ్రవాది కూడా స్వేచ్ఛగా పరిస్థితి ఇకమీదట ఉండదని మీకు బీజేపీ హామి ఇస్తుంది’ అని అన్నారు.మరోవైపు..జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత)జరుగుతున్నాయి.అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
‘వాళ్లు రాళ్లు ఇస్తే.. మేం పెన్ను, పుస్తకాలు ఇచ్చాం’
శ్రీనగర్: మూడు కుటుంబాలు జమ్ము కశ్మీర్‌ను దోచుకున్నాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని మాట్లాడారు.‘‘జమ్ము కశ్మీర్‌ను దోచుకోవటం తమ జన్మ హక్కు అన్నట్లు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తిచాయి. మూడు పార్టీలు జమ్ము కశ్మీర్ యువత భవిష్యత్తు నాశనం చేశాయి. ఆ మూడు పార్టీలు కశ్మీర్ యువత చేతికి రాళ్లు ఇచ్చి విధ్వంసాలు సృష్టించేవి.. బీజేపీ మాత్రం పుస్తకాలు, పెన్స్ ఇస్తోంది.#WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says "...The three families think that it is their birthright to capture power by any means and then loot you all. Their political agenda has been to deprive the people of Jammu and Kashmir of their legitimate rights. They have… pic.twitter.com/lsTADRKFv1— ANI (@ANI) September 19, 2024 ..స్కూల్స్‌ను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటే.. వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం అవుతుంది. ఇప్పుడు జమ్ము కశ్మీర్ యువత చేతిలో రాళ్లు కాదు.. బుక్స్, పెన్నులు కనిపిస్తున్నాయి. ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు వార్తలు ఇప్పుడు జమ్ములో వినిపిస్తున్నాయి. కశ్మీర్లో ఉపాధి అవశాలు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ..50 వేల మంది డ్రాపవుట్ విద్యార్థులను తిరిగి స్కూల్స్‌కు రప్పించాం. గతంలో లాల్‌చౌక్ దగ్గర ఉగ్ర దాడుల జరిగేవి. ఇప్పడు కశ్మీర్లో ఇంటర్నేషనల్ యోగా డే లాంటి కార్యక్రమాలు జరగుతున్నాయి. రైల్ కనెక్టివిటీ కూడా పెరగటం వల్ల టూరిజం, ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తొడి విడతలో ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు’ అని మోదీ అన్నారు.#WATCH | Srinagar: Prime Minister Narendra Modi says "Today the world is seeing how the people of Jammu and Kashmir are strengthening the democracy of India and I congratulate the people of Jammu and Kashmir for this. A few days ago, when I came to Jammu and Kashmir, I had said… pic.twitter.com/gOfNsixo9L— ANI (@ANI) September 19, 2024 -
పాకిస్తాన్‌తో చర్చల్లేవ్: అమిత్ షా
జమ్మూ: సరిహద్దు వెంబడి శాంతి నెలకొనేదాకా పాకిస్తాన్‌తో చర్చల్లేవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. జమ్మూలో శనివారం(సెప్టెంబర్ 7) జరిగిన బీజేపీ విజయసంకల్ప్ బూత్ వర్కర్ల భేటీలో షా మాట్లాడారు.‘ జమ్మూకాశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తాం. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి వేర్పాటువాదులను, ఉగ్రవాదులను విడుదల చేయాలనుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌ను అస్థిరతకు గురిచేయాలని చూస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మూడు కుటుంబాలు దోచుకున్నాయి. చాలా ఏళ్ల తర్వాత కాశ్మీర్‌లోయలో భయం లేకుండా అమర్నాథ యాత్ర విజయవంతమైంది. ఎన్సీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు రెచ్చిపోతుంది. ఉగ్రవాదం కావాలా.. శాంతి కావాలా కాశ్మీర్ ప్రజలు తేల్చుకోవాలి’అని షా కోరారు. జమ్మూకాశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25 అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
జమ్మూ కాశ్మీర్‌లోనూ బీజేపీ ఒంటరి పోరే
జమ్మూ: ఇటీవలి మహారాష్ర్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని బీజేపీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేయనుంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, రాష్ట్రంలోని మొత్తం 87 స్థానాల్లోనూ పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ, జమ్మూ కాశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ అవినాష్రాయ్ ఖన్నా తెలిపారు. అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.