జమ్మూ: ఇటీవలి మహారాష్ర్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని బీజేపీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేయనుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, రాష్ట్రంలోని మొత్తం 87 స్థానాల్లోనూ పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ, జమ్మూ కాశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ అవినాష్‌రాయ్ ఖన్నా తెలిపారు. అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.