‘వాళ్లు రాళ్లు ఇస్తే.. మేం పెన్ను, పుస్తకాలు ఇచ్చాం’ | narendra modi slams three parties in jammu kashmir election campaign | Sakshi
Sakshi News home page

జమ్మును మూడు పార్టీలు దోచుకున్నాయి: మోదీ

Published Thu, Sep 19 2024 1:08 PM | Last Updated on Thu, Sep 19 2024 2:39 PM

narendra modi slams three parties in jammu kashmir election campaign

శ్రీనగర్‌: మూడు కుటుంబాలు జమ్ము కశ్మీర్‌ను దోచుకున్నాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని మాట్లాడారు.

‘‘జమ్ము కశ్మీర్‌ను దోచుకోవటం తమ జన్మ హక్కు అన్నట్లు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తిచాయి. మూడు పార్టీలు జమ్ము కశ్మీర్‌ యువత భవిష్యత్తు నాశనం చేశాయి. ఆ మూడు పార్టీలు కశ్మీర్‌ యువత చేతికి రాళ్లు ఇచ్చి విధ్వంసాలు సృష్టించేవి.. బీజేపీ మాత్రం పుస్తకాలు, పెన్స్‌ ఇస్తోంది.

 

..స్కూల్స్‌ను కూడా ఉగ్రవాదులు టార్గెట్‌​ చేశారంటే.. వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం అవుతుంది. ఇప్పుడు జమ్ము​ కశ్మీర్‌ యువత చేతిలో రాళ్లు కాదు.. బుక్స్, పెన్నులు కనిపిస్తున్నాయి. ఎయిమ్స్‌, ఐఐటీ ఏర్పాటు వార్తలు ఇప్పుడు  జమ్ములో వినిపిస్తున్నాయి. కశ్మీర్‌లో ఉపాధి అవశాలు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 

..50 వేల మంది డ్రాపవుట్‌ విద్యార్థులను తిరిగి స్కూల్స్‌కు రప్పించాం. గతంలో లాల్‌చౌక్‌ దగ్గర ఉగ్ర దాడుల జరిగేవి. ఇప్పడు కశ్మీర్‌లో ఇంటర్నేషనల్‌ యోగా డే లాంటి కార్యక్రమాలు జరగుతున్నాయి.  రైల్‌ కనెక్టివిటీ కూడా పెరగటం వల్ల టూరిజం, ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తొడి విడతలో ప్రజలు  ఉత్సాహంగా ఓటు వేశారు’ అని మోదీ అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement