శ్రీనగర్: ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు పాకిస్థాన్‌తో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా నౌషేరాలో జరిగిన ర్యాలీని అమిత్ షా పాల్గొని మాట్లాడారు.
‘‘నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విధంగా జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారు. ఆర్టికల్ 370ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ప్రస్తుతం బంకర్లు అవసరం లేదు ఎందుకంటే ఎవరూ బుల్లెట్లు కాల్చడానికి ధైర్యం చేయలేరు. జమ్ము కశ్మీర్‌లో 30 ఏళ్లుగా కొనసాగిన ఉగ్రవాదం 40వేల మందిని బలి తీసుకుంది.కశ్మీర్ ఉగ్రవాదంతో కాలిపోతున్నప్పుడు.. ఫరూఖ్ అబ్దుల్లా లండన్‌లో హాలిడే గడిపారు.
#WATCH | Rajouri, J&K: Addressing a public meeting in Nowshera, Union Home Minister Amit Shah says, "... Farooq Abdullah says that they will bring back Article 370. Farooq Sahab, nobody can bring back Article 370... Now, bunkers are not needed because no one can dare to fire… pic.twitter.com/cciMG6psOb
— ANI (@ANI) September 22, 2024
..పాకిస్థాన్‌తో మనం చర్చలు జరపాలని వారు కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాకిస్థాన్‌తో చర్చలు జరపబోం. ఉగ్రవాదులను జైళ్ల నుంచి విముక్తి చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీ హయాంలో ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా అంతం చేశాం. ఉగ్రవాది, రాళ్లదాడికి పాల్పడివారు జైలు నుంచి విడుదల కాలేరు. జమ్ము కశ్మీర్‌లో ఏ ఉగ్రవాది కూడా స్వేచ్ఛగా పరిస్థితి ఇకమీదట ఉండదని మీకు బీజేపీ హామి ఇస్తుంది’ అని అన్నారు.
మరోవైపు..జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత)జరుగుతున్నాయి.అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment