జమ్మూ: సరిహద్దు వెంబడి శాంతి నెలకొనేదాకా పాకిస్తాన్‌తో చర్చల్లేవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. జమ్మూలో శనివారం(సెప్టెంబర్ 7) జరిగిన బీజేపీ విజయసంకల్ప్ బూత్ వర్కర్‌ల భేటీలో షా మాట్లాడారు.‘ జమ్మూకాశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తాం. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి వేర్పాటువాదులను, ఉగ్రవాదులను విడుదల చేయాలనుకుంటోంది.
జమ్మూకాశ్మీర్‌ను అస్థిరతకు గురిచేయాలని చూస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మూడు కుటుంబాలు దోచుకున్నాయి. చాలా ఏళ్ల తర్వాత కాశ్మీర్‌లోయలో భయం లేకుండా అమర్‌నాథ యాత్ర విజయవంతమైంది. ఎన్సీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు రెచ్చిపోతుంది. ఉగ్రవాదం కావాలా.. శాంతి కావాలా కాశ్మీర్ ప్రజలు తేల్చుకోవాలి’అని షా కోరారు. జమ్మూకాశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25 అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment