Rafale deal. Reliance
-
రాఫెల్ ఒప్పందంపై మళ్లీ మొదలైన రగడ..
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ద విమానాలపై రగడ మళ్లీ మొదలైంది. రాఫెల్ ఒప్పందంపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. 59 వేల కోట్ల విలువైన 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2106లో భారత్–ఫ్రాన్స్ ఒప్పందం మధ్య కుదిరింది. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి బాహాటంగా బయటపడిందన్నారు. రిలయన్స్-డసాల్ట్ డీల్‌లో అన్ని సాక్ష్యాధారాలను ఫ్రెంచ్ వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ బయటపెట్టిందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఇక జేపీసీ దర్యాప్తునకు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. తాజా నివేదికల ఆధారంగా ఫ్రాన్స్ జాతీయ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం జ్యుడిషియల్ దర్యాప్తుకు ఆదేశించినట్లు మీడియాపార్ట్ తెలిపింది. ఇన్ఫ్రా, డసాల్ట్ ఏవియేషన్ కలిసి డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఏఎల్) అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయని, దీనికి సంబంధించిన ఒప్పందం వివరాలన్నిటినీ ఈ వెబ్సైట్ వెల్లడించిందని తెలిపారు. ఈ అంశాలను అప్పటి ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయీస్ హొల్లాండ్ స్టేట్మెంట్ బలపరుస్తోందని తెలిపారు. డసాల్ట్ ఇండస్ట్రియల్ పార్టనర్‌గా రిలయన్స్‌ను నియమించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుందని హొల్లాండ్ చెప్పారన్నారు. ఈ విషయంలో ఫ్రాన్స్‌కు ఎటువంటి అవకాశం లేదని చెప్పారన్నారు. -
రఫేల్ రివ్యూ పిటిషన్లపై రేపు సుప్రీం తీర్పు..
న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందానికి క్లీన్ చిట్ ఇస్తూ సర్వోన్నత న్యాయస్దానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ తీర్పును వెల్లడిస్తుంది. గత ఏడాది డిసెంబర్ 14న రఫేల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై మే 10న అన్ని పక్షాల వాదనలు విన్న మీదట సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్‌లు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ల మధ్య కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు గతంలో కొట్టివేసిన సంగతి తెలిసిందే. రఫేల్ యుద్ధ విమానాల ధరలు, ఇతర వివరాలతో కూడిన పత్రాలను సుప్రీం కోర్టు పరిశీలించిన మీదట ఈ ఒప్పందానికి సర్వోన్నత న్యాయస్ధానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా రఫేల్ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని అప్పటి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
రఫేల్ రివ్యూ పిటీషన్లపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
-
రాఫెల్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
‘రాహుల్ పాకిస్తాన్నే నమ్ముతారు’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీని విచారించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ అవాస్తవాలను ప్రచారంలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారత వాయుసేనపై రాహుల్‌కు విశ్వాసం లేదని, ఆయన సుప్రీం కోర్టు, కాగ్‌ను కూడా నమ్మరని..మరి పాకిస్తాన్‌ను మాత్రమే రాహుల్ విశ్వసిస్తారా అని కేంద్ర మంత్రి నిలదీశారు. రఫేల్ పోటీదారులకు అనుకూలంగా రాహుల్ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. కాగా రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందం పత్రాలు గల్లంతయ్యాయని మీడియాపై మోదీ సర్కార్ ఆరోపణలు గుప్పిస్తోందని, రూ 30,000 కోట్ల రఫేల్ ఒప్పందంలో ప్రమేయం కలిగిన వారిపై మాత్రం విచారణ చేపట్టడం లేదని రాహుల్ మండిపడ్డారు. ప్రధాని మోదీ సహా ఈ ఒప్పందంలో భాగమైన వారందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. -
రఫేల్‌పై రివ్యూ పిటిషన్ల విచారణకు సుప్రీం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గతంలో తాను ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన రివ్యూ పిటిషన్ల బహిరంగ విచారణకు సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. రివ్యూ పిటిషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌నూ సర్వోన్నత న్యాయస్ధానం విచారిస్తుంది. రివ్యూ పిటిషన్లలో మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరిల పిటిషన్ ఒకటి కాగా, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ మరొకటి సుప్రీం ముందుకు రానున్నాయి. రికార్డుల్లో ఉన్న తప్పిదాల ఆధారంగా, ఈ అంశంలో ముందుకొచ్చిన అదనపు సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో సరైన న్యాయం జరగలేదని గత ఉత్తర్వులను తప్పుపడుతూ సిన్హా, శౌరి, భూషణ్‌లు తమ రివ్యూ పిటిషన్లలో పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందంపై విచారణ అవసరం లేదంటూ గతంలో సర్వోన్నత న్యాయస్ధానం జారీ చేసిన తీర్పును సమీక్షించడంతో పాటు తమ పిటిషన్లను బహిరంగ న్యాయస్ధానంలో విచారణ చేపట్టాలని వారు కోరారు. ఇక ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ సైతం రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను గత ఏడాది డిసెంబర్ 14న సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చుతూ ఈ ఒప్పందంలో అనుమానించాల్సిన అంశాలేమీ లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
రఫేల్ జెట్ భారత్‌కు రాకుండా చేయలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది
-
‘రఫేల్ ఒప్పందంలో రాజద్రోహానికీ పాల్పడ్డారు’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఈ ఒప్పందంపై కాగ్ నివేదికను పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రఫేల్ కేవలం అవినీతి వ్యవహారమే కాదని ఇది రాజద్రోహం కేసని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంపై సంతకాలు జరగకముందే దీని గురించి రిలయన్స్ డిఫెన్స్‌కు చెందిన అనిల్ అంబానీకి తెలుసని వెలుగులోకి వచ్చిన ఓ ఈమెయిల్ నిరూపిస్తోందని పేర్కొన్నారు. ఒప్పందం గురించి అనిల్ అంబానీకి ముందే తెలియడం అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని రాహుల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు కొద్ది రోజుల ముందు 2015, మార్చి 28న పంపినట్టుగా ఉన్న ఆ ఈమెయిల్ ఇమేజ్ను కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పోస్ట్ చేశారు. 2015 ఏప్రిల్ 9-11 మధ్య ఫ్రాన్స్‌తో రఫేల్ ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేస్తారని ఎయిర్‌బస్, ఫ్రాన్స్ ప్రభుత్వం, అనిల్ అంబానీలకు ముందే తెలుసని ఈమెయిల్ ద్వారా వెల్లడవుతోందని, ప్రభుత్వం దీనిపై చెబుతున్నవన్నీ అసత్యాలేనని తేలిందని కపిల్ సిబల్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ గూఢచారి పాత్రను అద్భుతంగా పోషించారని రాహుల్ మండిపడ్డారు. ఈ-మెయిల్లో ఏముంది..? యూరప్ ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ తాను అప్పటి ఫ్రాన్స్ రక్షణ మంత్రి సహచరుడితో టెలిఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు ఈమెయిల్లో ప్రస్తావించారు. అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రి కార్యాలయానికి వచ్చారని, ఒప్పంద పత్రాలు సిద్ధమవుతున్నాయని ప్రధాని మోదీ పర్యటనలో ఎంఓయూ (అవగాహనా ఒప్పందం)పై సంతకాలు జరుగుతాయని చెప్పారని ఆ ఎగ్జిక్యూటివ్ ఈ మెయిల్లో పేర్కొన్నారు. కపిల్ సిబల్ పోస్ట్ చేసిన ఈ ఈ-మెయిల్ రఫేల్ ఒప్పందంపై తాజా ప్రకంపనలకు కేంద్రమవుతోంది. -
పార్లమెంట్లో నేడు రఫేల్‌పై కాగ్ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రభుత్వం నేడు పార్లమెంట్ ముందుంచనుంది. ఫ్రాన్స్ కంపెనీ దాసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగియనుండటంతో దీనికి కేవలం ఒకరోజు ముందు రఫేల్‌పై కాగ్ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్లో సమర్పించనుండటం గమనార్హం. రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదిక పార్లమెంట్లో ప్రభుత్వం సమర్పించనున్న క్రమంలో మరోసారి రఫేల్ ప్రకంపనలు చట్టసభను కుదిపేయనున్నాయి. మరోవైపు రఫేల్ ఒప్పందం జరిగిన సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి ఈ ఒప్పందంపై ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆరోపించడం మరో వివాదానికి తెరలేపింది. కాగా కపిల్ సిబల్ ఆరోపణలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. వ్యవస్ధలను నీరుగార్చే ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఇక రఫేల్‌పై కాగ్ నివేదిక పార్లమెంట్లో మరిన్ని ప్రకంపనలకు దారితీస్తుందని భావిస్తున్నారు. -
రఫేల్‌పై రేపు పార్లమెంట్ ముందుకు కాగ్ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా పెనుదుమారం రేపుతున్న రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ ముందుంచనుంది. ఫ్రాన్స్ కంపెనీ దాసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందు రఫేల్‌పై కాగ్ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్లో సమర్పించనుండటం గమనార్హం. మరోవైపు రఫేల్ ఒప్పందం జరిగిన సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి ఈ ఒప్పందంపై ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆరోపించడం మరో వివాదానికి తెరలేపింది. కాగా కపిల్ సిబల్ ఆరోపణలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. వ్యవస్ధలను నీరుగార్చే ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఇక రఫేల్‌పై కాగ్ నివేదిక పార్లమెంట్లో మరిన్ని ప్రకంపనలకు దారితీస్తుందని భావిస్తున్నారు. -
రఫేల్ రగడ : ఎయిర్ మార్షల్ సిన్హా వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని నిరూపించే క్రమంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ నోట్లో ఎంపిక చేసుకున్న భాగాన్ని ప్రచారంలోకి తెచ్చారని ఈ ఒప్పందంలో భారత్ తరపున సంప్రదింపులు జరిపిన ఎయిర్ మార్షల్ ఎస్పీబీ సిన్హా పేర్కొన్నారు. నోట్లో చెబుతున్న అంశాలేవీ భారత సంప్రదింపుల బృందానికి సంబంధం లేనివని ఆయన స్పష్టం చేశారు. భారత్ తరపున రఫేల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిన బృందం సభ్యులంతా ఎలాంటి విభేదాలకు తావులేకుండా ఏడుగురు సభ్యుల సంతకాలతో కూడిన తుది నివేదికను సమర్పించారని పేర్కొన్నారు. ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో అవినీతి నిరోధక క్లాజుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటివరకూ అమెరికా, రష్యాలతో ప్రభుత్వం-ప్రభుత్వం మధ్య ఒప్పందాలున్నాయని, ఫ్రాన్స్‌తో ఇది ఈ తరహా మూడవ ఒప్పందమని చెప్పారు. వీటిలో ఇలాంటి క్లాజ్ ఇంతవరకూ లేదని తేల్చిచెప్పారు. రఫేల్ ఒప్పందంపై పీఎంఓ ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపిందంటూ రక్షణ మంత్రిత్వ శాఖ నోట్‌ను ఓ జాతీయ పత్రిక వెల్లడించడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పీఎంఓ సమీక్ష జోక్యంగా పరిగణించలేమని రఫేల్ ఒప్పందంపై అన్ని అంశాలను ప్రభుత్వం పార్లమెంట్, న్యాయస్ధానాల ముందుంచిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు దీటుగా బదులిచ్చారు. -
రాఫెల్ చుట్టు రచ్చ
-
పార్లమెంట్ ముందుకు రఫేల్‌పై కాగ్ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రఫేల్ ఒప్పందంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదకను ప్రభుత్వం సభ ముందుంచవచ్చని భావిస్తున్నారు. రఫేల్ ఒప్పందంతో పాటు పలు రక్షణ ఒప్పందాలపై కాగ్ లేవెనెత్తిన పలు ప్రశ్నలకు ఇప్పటికే ప్రభుత్వం సమాధానాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలన్నింటినీ కాగ్‌కు అందుబాటులో ఉంచామని గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కాగ్ నివేదిక కోసం వేచిచూస్తున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రఫేల్ సహా రక్షణ ఒప్పందాలపై కాగ్ నివేదికను పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం బహిర్గతం చేయవచ్చని అధికార వర్గాలు సంకేతాలు పంపాయి. కాగా, రఫేల్ ఒప్పందంపై ఇప్పటికే కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్‌ను ఇరుకునపెడుతున్న క్రమంలో ఈ వ్యవహారంపై కాగ్ నివేదిక పార్లమెంట్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘ఆ స్ధానంలో ఎవరున్నా అలాగే అంటా’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఇటీవల తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమర్ధించుకున్నారు. నిర్మలా సీతారామన్ స్ధానంలో పురుషుడున్నా తాను ఇలాగే మాట్లాడి ఉండేవాడినని రాహుల్ స్పష్టం చేశారు. దుబాయ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడిన రాహుల్ పార్లమెంటల్‌లో రఫేల్ డీల్‌పై ప్రధాని తన వైఖరిని సమర్ధించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ‘రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి ప్రధాని నరేంద్ర మోదీ రూ 30,000 కోట్లు దోచిపెట్టారు..అయితే లోక్‌సభలో తనను సమర్ధించుకోవాల్సిన ప్రధాని మోదీ తన తరపున మరో మనిషిని పంపారు..యాధృచ్చికంగా ఆమె మహిళ (నిర్మలా సీతారామన్)అయ్యారు..ఆ స్ధానంలో పురుషుడున్నా నేను అలాంటి వ్యాఖ్యలే చేస్తా’ నని రాహుల్ వ్యాఖ్యానించారు. తాను మహిళలను అవమానించినట్టు బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని రాహుల్ తోసిపుచ్చారు. మీ భావజాలాన్ని నాపై రుద్దవద్దని బీజేపీ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు. కాగా రఫేల్ ఒప్పందంపై చర్చ జరుగుతుంటే పార్లమెంట్ నుంచి పారిపోయిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ మహిళ (నిర్మలా సీతారామన్) వెనుక దాక్కున్నారని రాహుల్ ఎద్దేవా చేసిస సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మలా సీతారామన్‌పై వ్యాఖ్యలతో రాహుల్ మహిళలను అవమానించారని ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
‘రఫేల్ డీల్‌కు మిషెల్ అడ్డుపడ్డారు’
ముంబై : రఫేల్ ఒప్పందంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. రఫేల్‌ను వ్యతిరేకిస్తూ అగస్టా స్కాంలో దళారి క్రిస్టియన్ మిషెల్ లాబీయింగ్ చేశారనే వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని నిలదీశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ అగస్టా సూత్రధారి మిషెల్‌ను తాము భారత్‌కు రప్పించిన తర్వాత పలు అంశాలు బయటికొస్తున్నాయని, రఫేల్‌కు వ్యతిరేకంగా మిషెల్ మరో డీల్ ప్రతిపాదించారనే వార్తలపై కాంగ్రెస్ వివరణ ఇవ్వాలన్నారు. రఫేల్‌కు బదులుగా యూరోఫైటర్కు ఈ ఆర్డర్‌ను కట్టబెట్టేందుకు అగస్టా ఒప్పందంలో ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మిషెల్ ప్రయత్నించారని ఇండియా టుడే కొన్ని పత్రాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. -
అంబానీ కోసమే...
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరింత స్వరం పెంచారు. సోమవారం పార్లమెంట్ వెలువల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లుగా రూ.లక్ష కోట్ల కాంట్రాక్టులో హెచ్ఏఎల్కు ఒక్క ఆర్డర్ కానీ, ఒక్క రూపాయి కానీ ప్రభుత్వం నుంచి రాలేదు. ఆమె రక్షణ మంత్రిగా కాదు, మోదీకి అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు’ అని అన్నారు. మోదీ ప్రభుత్వం అనిల్ అంబానీకి లాభం చేకూర్చేందుకే ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ను బలహీన పరుస్తోందని ఆరోపించారు. ‘ఎంతో అనుభవం, ప్రతిభావంతులైన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఉన్న హెచ్ఏఎల్కు రూ.15,700 కోట్లను చెల్లించకుండా ప్రభుత్వం నిలిపివేసింది. ఆ సంస్థను ఆర్థికంగా దెబ్బకొట్టిన విషయంలో సమాధానం చెప్పేందుకు చౌకీదార్ (ప్రధాని మోదీ) సభలో ఉండరు. సభకు రావడానికి ఆయన భయపడుతున్నారు’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. -
పార్లమెంటుకు అబద్ధం చెప్పారు
న్యూఢిల్లీ: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు నిధుల కొరత ఏర్పడిందన్న అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మరో మాటల యుద్ధానికి దారితీసింది. హెచ్ఏఎల్కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు అబద్ధం చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులకు సాక్ష్యాలు చూపలేకపోతే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలనీ, హెచ్ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. లక్ష కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లుగా తానెప్పుడూ చెప్పలేదని నిర్మల స్పష్టం చేశారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ యద్ధ విమానాలు, హెలికాప్టర్లు, జెట్ ఇంజిన్లు తదితరాలను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందంటూ శనివారం ఓ వార్తా కథనం రావడం తెలిసిందే. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో రూ. వెయ్యి కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందనీ, ప్రభుత్వం నుంచి తమకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని హెచ్ఏఎల్ ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఈ కథనం వెల్లడించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రాజెక్టులో భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా ప్రభుత్వరంగ, అనుభవం ఉన్న హెచ్ఏఎల్ను కాదనీ, కొత్తదైన ప్రైవేటు సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేయడంపై ఇప్పటికే కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. అంబానీకి ప్రయోజ నం చేకూర్చేందుకే ప్రధాని మోదీ రిలయన్స్‌ను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసి, ప్రభుత్వ సంస్థల ఉసురు తీస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్లమెంటు ముందు దస్త్రాలు ఉంచండి హెచ్ఏఎల్కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చిన దానికి సంబంధించిన దస్త్రాలను సోమవారం నిర్మల పార్లమెంటుకు సమర్పించాలనీ, లేని పక్షంలో ఆమె రాజీనామా చేయాలని రాహుల్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘ఒక్క అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి మరెన్నో అబద్ధాలు చెబుతూ ఉండాలి. మోదీ రఫేల్ ‘అబద్ధం’ను కప్పిపుచ్చేందుకు ఇప్పుడు రక్షణ మంత్రి పార్లమెంటుకే అబద్ధం చెప్పారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. హెచ్ఏఎల్ను కాదని రిలయన్స్‌కు రఫేల్ ప్రాజెక్టు ఇచ్చినందుకు కాంగ్రెస్ మొదటి నుంచి కేంద్రంపై విమర్శలు చేస్తోంది. శనివారం కూడా మోదీ తన సూటు–బూటు స్నేహితుడి (అనిల్ అంబానీ)కి సాయం చేసేందుకు హెచ్ఏఎల్ను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. హెచ్ఏఎల్ ఏమంటోంది.. హెచ్ఏఎల్ ఈ అంశంపై స్పందిస్తూ.. 83 తేలికపాటి యుద్ధవిమానాలు, 15 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల ప్రాజెక్టులపై కీలక దశల్లో ఉన్నాయనీ, త్వరలో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. మార్చి వరకు ఖర్చుల కోసం రూ. 962 కోట్లను ప్రస్తుతం అప్పుగా తీసుకున్నామంది. పూర్తిగా చదివి మాట్లాడాలి: నిర్మల వార్తా కథనాన్ని పూర్తిగా చదివిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడాలని నిర్మల హితవు చెప్పారు. ఆ కథనంలోనే ఉన్న వివరాలను ఆమె ఉటంకిస్తూ ‘ఈ ఒప్పందాలు పూర్తయినట్లుగా నిర్మల పార్లమెంటుకు చెప్పలేదు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని మాత్రమే ఆమె వెల్లడించినట్లు లోక్‌సభ రికార్డులు చెబుతున్నాయి’ అని పేర్కొన్నారు. రాహుల్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తుండటం సిగ్గుచేటని ఆమె అన్నారు. ఆ తర్వాత నిర్మల కార్యాలయం ఓ ట్వీట్ చేస్తూ ‘రాహుల్ గాంధీ, మీరు ఏబీసీల నుంచి అన్నీ నేర్చుకోవాలి. ప్రజలను తప్పుదారి పట్టిం చేందుకు ఉత్సాహం చూపుతున్న మీలాంటి వారే పూర్తిగా కథనాన్ని చదవకుండానే, అదే కథనం ఆధారంగా ఆరోపణలు చేస్తారు. అబద్ధం చెబుతున్నది మీరే రాహుల్. 2014–18 మధ్య హెచ్ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. 26,570.8 కోట్ల ఒప్పందాలు జరిగాయి. మరో రూ. 73 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు మీరు దేశ ప్రజలకు పార్లమెంటులో క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ ఘాటుగా స్పందించింది. -
మళ్లీ కన్నుగీటిన రాహుల్
-
మళ్లీ కన్నుకొట్టిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి కన్ను గీటుతూ కెమెరాల కంటపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్ను కొట్టడం ద్వారా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ మరోసారి కన్నుగీటుతూ కెమెరాలకు చిక్కారు. రఫేల్ ఒప్పందంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రఫేల్‌పై చర్చలో ఏఐఏడీఎంకే ఎంపీ, డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతుండగా ఆయనను అభినందించిన రాహుల్ అనూహ్యంగా వేరొకరిని చూస్తూ కన్నుగీటారు. కాగా అంతకుముందు ఇదే అంశంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్నుగీటడం వంటి చర్యలపై క్షమాపణలు చెప్పారా అని రాహుల్‌ను నిలదీశారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల అనంతరం రాహుల్ మరోసారి కన్నుకొడుతూ కెమెరాల కంటపడ్డారు. రాహుల్ కన్నుగీటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
‘సెప్టెంబర్‌లో భారత్‌కు తొలి రఫేల్ విమానం’
-
అధికారంలోకి వస్తే రఫేల్‌పై విచారణ : రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తుందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రఫేల్‌పై చర్చకు ప్రభుత్వం బదులిచ్చే క్రమంలో శుక్రవారం పార్లమెంట్ వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడుతూ రఫేల్‌పై చర్చ అంటే ప్రధాని నరేంద్ర మోదీ పారిపోతున్నారని దుయ్యబట్టారు. ఈ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. రఫేల్‌పై విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదని, దీనిపై విచారణకు ఆదేశించే పరిధి న్యాయస్ధానానికి లేదని మాత్రమే సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొందని రాహుల్ అన్నారు. రఫేల్‌పై తాము లేవనెత్తిన అంశాలన్నింటికీ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ బదులివ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. మరోవైపు రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. అంబానీకి ఆ కాంట్రాక్టు ఎవరిచ్చారు.. అనిల్ అంబానీ సంస్థకు రఫేల్ ఒప్పందంలో భాగస్వామ్యం కల్పించింది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రసంగానికి అడ్డుతగిలిన రాహుల్ ఒప్పందానికి సంబంధించి పలు అంశాలను లేవనెత్తారు. రఫేల్ డీల్ అంతా ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో జరిగిందని అన్నారు. అనిల్ అంబానీ కంపెనీకి రఫేల్ ఒప్పందంలో భాగస్వామిగా చేర్చాలని ప్రధాని మోదీ సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ వెల్లడించారన్నారు. -
‘సెప్టెంబర్‌లో భారత్‌కు తొలి రఫేల్ విమానం’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై శుక్రవారం కూడా లోక్‌సభలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రఫేల్ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. భారత్ కొనుగోలు చేసిన తొలి రఫేల్ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని వెల్లడించారు. మిగిలిన విమానాలు 2022 నాటికి అందుబాటులో ఉంటాయని తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని మన ప్రాధాన్యతలకు అనుగుణంగా రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. అనిల్ అంబానీ కోసమే తాము యుద్ధ విమానాలు కొనుగోలు చేశామని కాంగ్రెస్ భావిస్తే యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందాల వెనుక ఖత్రోచీ, రాబర్ట్ వాద్రాలు ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ దుయ్యబట్టారు. హెచ్‌ఏఏల్‌కు ఎందుకు ఇవ్వలేదంటే.. ప్రభుత్వ రంగ హెచ్ఏఎల్కు రఫేల్ తయారీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ ప్రభుత్వాన్ని నిలదీయడంపై నిర్మలా సీతారామన్ స్పందించారు. హెచ్ఏఎల్కు ఆర్డర్‌ను ఎందుకు ఇవ్వలేదో రాహుల్ తెలుసుకోవాలన్నారు. హెచ్ఏఎల్ గొప్పలే కాదు, లోపాలనూ గుర్తించాలన్నారు. తేజస్ విషయంలో హెచ్ఏఎల్ మందకొడిగా వ్యవఃహరించిందన్నారు. తాము 43 తేజాస్ విమానాలకు ఆర్డర్ ఇస్తే హెచ్ఏఎల్ కేవలం 8 విమానాలనే సమకూర్చిందని చెప్పారు. తమ హయాంలో హెచ్ఏఎల్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేశామని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ రఫేల్‌పై సభకు తప్పుడు సమాచారం అందించారని అన్నారు. మంత్రి తన పేరును ప్రస్తావించడం పట్ల రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
‘రఫేల్ చర్చను పక్కనపెట్టి లెక్చర్లు ఇస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో రఫేల్ ఒప్పందంపై చర్చ జరుగుతుంటే పారిపోయిన ప్రధాని పంజాబ్‌లోని లవ్లీ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రఫేల్‌పై జరుగుతున్న కీలక చర్చలో పాల్గొనకుండా ప్రధాని పంజాబ్ పారిపోయారని గురువారం రాహుల్ మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రఫేల్‌పై చర్చలో పాల్గొనకుండా ప్రధాని వర్సిటీ విద్యార్ధులకు లెక్చర్లు ఇస్తున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. మోదీ గురువారం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించి అనంతరం గురుదాస్‌పూర్‌లో జరిగే ర్యాలీలో పాల్గొంటారు. కాగా, ప్రధానికి తాను నిన్న సంధించిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని మోదీని కోరాలని విద్యార్ధులను రాహుల్ కోరడం గమనార్హం. రఫేల్ ఒప్పందంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో మోదీ సర్కార్‌పై రాహుల్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాహుల్ ఆరోపణలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. -
రఫేల్ ఒప్పందంపై జేపీసీకి కేంద్రం నో
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ను రఫేల్ ప్రకంపనలు కుదిపేశాయి. ఈ ఒప్పందంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్‌సభలో పాలక, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రఫేల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)చే విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం నిరాకరించింది. రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోఫణలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చుతూ ఈ ఒప్పందం జరిగిన తీరు పట్ల సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఒప్పందంపై సర్వోన్నత న్యాయస్ధానం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయనందున దీనిపై జేపీసీ విచారణ అవసరం లేదన్నారు. జైట్లీ ప్రసంగానికి అడ్డుతగులుతూ విపక్ష సభ్యులు ఆయనపై కాగితాలను విసిరివేశారు. ప్రభుత్వం రఫేల్‌పై జేపీసీ విచారణ జరిపించాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు. అవినీతిలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ కట్టుకథలతో మోదీ సర్కార్‌కు సైతం ఆ మరకలు అంటించాలని ప్రయత్నిస్తోందని జైట్లీ ఈ సందర్భంగా విపక్షంపై విరుచుకుపడ్డారు. -
రఫేల్ ప్రకంపనలు : మోదీపై రాహుల్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లోక్‌సభలో బుధవారం రఫేల్‌పై చర్చను ప్రారంభిస్తూ మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రఫేల్‌పై విపక్షాల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని ఎద్దేవా చేశారు. రఫేల్‌పై తనను ఎవరూ ప్రశ్నించలేరని ప్రదాని చెప్పడం సరైంది కాదని, దీనిపై దేశ ప్రజలంతా ఆయనను ప్రశ్నిస్తున్నారన్నారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించి రూ 1600 కోట్ల నూతన ధరపై రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసింది నిజం కాదా అని నిలదీశారు. ఐఏఎఫ్ అధికారులు 126 విమానాలు కావాలని డిమాండ్ చేయగా వాటి సంఖ్యను 36కు ఎందుకు కుదించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఏఎన్ఐకి ప్రధాని ఇచ్చిన ఇంటర్వ్యూ ముందుగా సిద్ధం చేసిందేనన్నారు. ఇంటర్వ్యూలో 90 నిమిషాలు మాట్లాడిన ప్రదాని రఫేల్‌పై మాత్రం ఇప్పటికీ బదులివ్వడం లేదని ఆరోపించారు. రఫేల్‌కు సంబంధించిన ఫైళ్లనీ తన పడక గదిలో ఉన్నాయని గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారని ఆ రాష్ట్రమంత్రి విశ్వజిత్ రాణే చెబుతున్న ఆడియో క్లిప్‌ను సభలో ప్రదర్శిందుకు అనుమతించాలని రాహుల్ కోరారు. దీనికి స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ వాయిదా పడింది. జైట్లీ అభ్యంతరం.. రఫేల్ ఒప్పందంపై రాహుల్ వాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. రఫేల్‌పై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెలువరించడంతో దిక్కుతోచని కాంగ్రెస్ ఆడియో టేప్‌ల అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. గోవా మంత్రి చెబుతున్నట్టు రూపొందిన ఆడియో క్లిప్ నకిలీదని జైట్లీ అన్నారు.రఫేల్‌పై మోదీ సర్కార్‌పై బురద చల్లేందుకు ఈ టేప్‌ను కాంగ్రెస్ తయారుచేసిందని దుయ్యబట్టారు. -
రఫేల్‌పై సుప్రీంలో రివ్యూ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు బుధవారం సర్వోన్నత న్యాయస్దానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం సంతకం చేయకుండా సీల్డ్ కవర్లో ఇచ్చిన నోట్లో పేర్కొన్న అవాస్తవ అంశాల ఆధారంగా తీర్పు వెలువరించారని రివ్యూ పిటిషన్లో వారు ఆరోపించారు. ఓపెన్ కోర్టులో తమ పిటిషన్ విచారించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమకు కనిపించడం లేదని గత ఏడాది డిసెంబర్లో సుప్రీం కోర్టు రఫేల్ ఒప్పందంలో మోదీ సర్కార్‌ను సమర్ధిస్తూ తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. విమానాల కొనుగోలుకు నిబంధనలను అనుసరించి రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాల (డీపీపీ) ప్రకారమే మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పిటిషనర్ల ఆరోపణల్లోని ప్రధానంగా మూడు అంశాలపై విచారణ జరిపామని సుప్రీంకోర్టు తెలిపింది. వాటిలో ఒకటి ప్రభుత్వ నిర్ణయం, రెండోది విమానాల ధరలు కాగా ఇక మూడోది భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక ప్రక్రియ అని పేర్కొంది. ఈ మూడు అంశాలను పరిశీలించిన మీదట ఈ సున్నితమైన కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తమకు అనిపించలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు అన్నారు. -
రఫేల్ ఒప్పందంపై చర్చకు సిద్ధం : కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై చర్చకు తమ పార్టీ సిద్ధమని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ 85వేల కోట్ల అదనపు వ్యవయానికి సభ ఆమోదం తెలిపిన అనంతరం ఖర్గే మాట్లాడుతూ రఫేల్ ఒప్పందంపై చర్చకు తాము సిద్ధమని చెబుతూ ఈ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ ఒప్పందంపై బుధవారమే చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఖర్గే పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందపై ఖర్గే చర్చను ప్రారంభించాలని దీనికి ప్రభుత్వం బదులిచ్చేందుకు సిద్ధమని జైట్లీ చెప్పారు. చర్చ నుంచి తప్పించుకునేందుకు ఖర్గే పారిపోతున్నారని, రాఫేల్‌పై చర్చ జరగాలని ఈ ఒప్పందంపై కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని తాను నిరూపిస్తానని జైట్లీ పేర్కొన్నారు. ఇక సభ వాయిదాపడే సమయంలో చర్చను ఎప్పుడు నిర్వహిస్తారనేది వెల్లడించాలని స్పీకర్ సుమిత్రా మహజన్‌ను ఖర్గే కోరారు. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ చర్చకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం పార్లమెంట్లో రాఫేల్ ఒప్పందపై చర్చ జరగవచ్చని భావిస్తున్నారు. -
‘రఫేల్’ అతిపెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఆరోపించారు. రఫేల్ విమానాల కొనుగోలు కోసం హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాదని ఫ్రాన్స్‌లోని కంపెనీతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. అనిల్ అంబానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే రూ. 520 కోట్లుగా ఉన్న రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంచనాలను రూ. 1,600 కోట్లకు పెంచారని మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొçన్నం ప్రభాకర్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి మల్లు రవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ భద్రతపై ప్రధాని మోదీ రాజీపడి, భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. ఈ ఒప్పందంపై చాలా అనుమానాలున్నాయని, రోజుకో కొత్త ప్రశ్న తలెత్తుతుందన్నా రు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ చేయించాలన్నారు. మేకిన్ ఇండియా గురించి చెప్పే మోదీ ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం తప్పుడు సమాచారంతో సుప్రీంకో ర్టును సైతం తప్పుదోవ పట్టించి, కోర్టు విశ్వసనీయతను దెబ్బతీసిందని విమర్శించారు. కాగ్ నివేదికను పీఏసీకే సమర్పించలేదని, అలాంటి నివేదిక ఏదీ లేకుండానే సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించిందన్నారు. దీనిపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నా, ప్రధాని ఎందుకు వణికిపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు. -
మీ కంటే స్కూల్ పిల్లలు నయం..
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల వ్యవహారాల శైలిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై మంగళవారం పాలక, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను సజావుగా నడిపేందుకు ఆమె విఫలయత్నం చేశారు. ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ కంటే స్కూల్ పిల్లలు ఎంతో నయమని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై పాలక బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ కొద్దిసేపు వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది. సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు స్పీకర్ ప్రయత్నించినా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో ఎంపీల తీరుపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ప్రవర్తిస్తున్న తీరుతో సభ వెలుపల మంచి సంకేతాలు వెళ్లడం లేదని, భారత పార్లమెంట్లో ఏం జరుగుతోందని విదేశాల్లో ప్రజలు అడగటం తాను గమనించానని వ్యాఖ్యానించారు. పార్లమెంటేరియన్ల కంటే స్కూల్ చిన్నారులే మెరుగ్గా ప్రవర్తిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. కాగా రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం కోర్టుకు అసత్యాలు వెల్లడించిందని, దీనిపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టగా, కావేరి నదిపై ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించాలని ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక రఫేల్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా, ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదారిపట్టించిన రాహుల్ గాంధీయే క్షమాపణ చెప్పాలని పాలక బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. -
రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : ఫడ్నవీస్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ వాడిన భాష చాలా దారుణమన్నారు. దళారి లేకుండా రక్షణ ఒప్పందం చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మలేకపోతున్నారన్నారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 'కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ రఫెల్ డీల్ పై ఆరోపణలు, అబద్దాలు చెప్తునే ఉన్నారు. రక్షణ విషయంలో అంతర్జాతీయంగా మనదేశ పేరు చెడగొట్టే పని చేశారు. అబద్దాలు చెప్పి ప్రజలని నమ్మించాలనే ప్రయత్నం చేశారు. కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్థాన్, చైనాలతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తే, మన దగ్గర కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు లేవని అర్థం అయింది. రఫెల్ డీల్ వల్ల ఆధునిక హంగులతో, సాంకేతికంగా ఉన్నతమైన యుద్ధ విమానాలు పొందనున్నాము. 6 కంపెనీల నుండి 2008లో టెండర్లు వచ్చాయి. 2011 నవంబర్‌లో టెండర్లు ఓపెన్ చేస్తే డసెల్ ద్వారా తక్కువకి టెండర్లు వచ్చాయి. 2003 నుండి 2011 వరకు కనీసం టెండర్లు ఓపెన్ కూడా చేయలేదు. అది మన దుస్థితి. యూపీఏ హయాంలో దేశ రక్షణ కోసం డబ్బులు లేవని ఈ ఒప్పందానికి మంగళం పాడారు. 2015 లో మోదీ సర్కారు కంబాట్ విమానాల ఆవశ్యకతను గుర్తించి ఫ్రాన్స్, ఇండియా మధ్య ఎలాంటి దళారులు లేకుండా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గతంలో బోఫోర్స్, జీప్, ఆగస్టా వెస్టలాండ్ లాంటివి దళారుల సహాయంతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. 2016లో ఒప్పందం ఫైనల్ అయింది. 2019 అక్టోబర్ నుండి ఎయిర్ క్రాఫ్ట్ లు రావడం మొదలవుతుంది. రాహుల్ అబద్ధాల మీద అబద్దాలు చెప్పారు. 4 పిటిషన్లు సుప్రీంకోర్టులో వేశారు. అందులో కొన్ని కాంగ్రెస్ స్పాన్సర్ చేసినవి. యూపీఏలో 2013 లో పాలసీ ప్రకారమే తర్వాత కొన్నారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిలయన్స్ కంపెనీకి ఇచ్చారనే ఆరోపణ మీద కూడా, డసోల్కి భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్వ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈ ఆరోపణలను చాలా స్పష్టంగా కొట్టేశారు. జనరేషన్ 5 యుద్ధ విమానాల కొనుగోలు చాలా అవసరం. కాంగ్రెస్ అబద్ధాల పరదా తొలగిపోయింది. దేశ హితం కోసం భవిష్యత్ కోసం ఆలోచన చేసి మోదీ నిర్ణయం తీసుకుంటారు. రక్షణ ఒప్పందంలో దేశ అంతర్గత విషయాలుంటాయి కాబట్టి అవి బయటికి చెప్పరు, వీటి ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చెయ్యాలని అనుకుంది. కానీ కుదరలేదు. సుప్రీంకోర్టు తీర్పును జేపీసీ ఓవర్ రూల్ చెయ్యలేదు. అందుకే జేపీసీ వెయ్యడం వృధా. రాహుల్ వాడిన భాషకు ప్రజలే సమాధానం చెప్తారు. ఏదైనా కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే వ్యవస్థ మంచిది, వ్యతిరేకంగా వస్తే వ్యవస్థ మీద ఒత్తిడి అంటారు. సుప్రీంకోర్టు తీర్పులో 26వ పేరాలో ధరల విషయంలో లోతుగా పరిశీలన చేశాము కాబట్టి అనుమానం లేదని స్పష్టంగా ఉంది' అని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. -
‘రాఫేల్‌పై రాహుల్ ప్రచారం బూటకం’
సాక్షి, న్యూఢిల్లీ : రాఫేల్ ఒప్పందంపై ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పుతో కాంగ్రెస్ రాద్ధాంతం తేటతెల్లమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధ్వజమెత్తారు. భోఫోర్స్, రాఫేల్ ఒప్పందాలను ఒకటిగా చూపేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విఫలయత్నం చేశారని ఆరోపించారు. భోఫోర్స్ మాదిరిగా రాఫేల్‌లో దళారీలు లేవు, ముడుపులు లేవంటూ ముఖ్యంగా ఖత్రోచి లేరని ఎద్దేవా చేశారు. రాఫేల్‌పై ఏకరువు పెట్టిన అసత్యాలన్నీ సుప్రీం కోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలాయని జైట్లీ ట్వీట్ చేశారు. ఒప్పందంపై స్వార్ధ ప్రయోజనాల కోసం చెప్పిన అవాస్తవాలు కల్పితాలేనని వెల్లడైందన్నారు. రాఫేల్‌పై రాహుల్ నిస్పృహతో చేసిన ఆరోపణలు విఫలయత్నంగా మారాయని ఆరోపించారు. రాఫేల్ను యూపీఏ ప్రభుత్వంలోనే షార్ట్‌లిస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. -
రాఫేల్ కొనుగోలుపై జెపిసికి కాంగ్రెస్ డిమాండ్
-
రాహుల్ క్షమాపణకు బీజేపీ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ చీఫ్ అమిత్ షా డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందంలో ఎవరికీ ఆర్థిక లబ్ధి చేకూరలేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. అసత్యాలు ప్రచారం చేసిన వారికి తీర్పు చెంపదెబ్బ వంటిదని, చివరకు సత్యం గెలిచిందని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా పేర్కొన్నారు. రాఫెల్ డీల్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కోర్టు పేర్కొందని ఆయన చెప్పారు. ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదారి పట్టించినందుకు రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాఫెల్ విమానాల ధరల వల్ల దేశానికి లాభమే చేకూరిందని, కాంగ్రెస్ మాత్రం అబద్దాన్ని పదేపదే ప్రచారం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో రూ 15 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని అమిత్ షా విమర్శించారు. కాపలాదారును దొంగలా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : బీజేపీ
సాక్షి, అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రత విషయంలో బీజేపీపై బురద జల్లిన ప్రతిపక్షాలకు రాఫెల్ డీల్‌పై సుప్రీం కోర్టు తీర్పు చెంపదెబ్బ వంటిదని బీజేపీ వ్యాఖ్యానించింది. తనపై కేసుల విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీపై బురద జల్లినందుకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి గాయత్రి డిమాండ్ చేశారు. బీజేపీకి అభివృద్ధి అంత్యోదయ మాత్రమే తెలుసని, పచ్చ కాంగ్రెస్ నాయకుడు మాత్రం అంతర్జాతీయ కుట్రలు చేయడంలో ఆరితేరారని అన్నారు. సుప్రీంకోర్టు రాఫెల్ డీల్ విషయంలో ఎలాంటి కుంభకోణం జరగలేదని తీర్పునిస్తూ అన్ని పిటిషన్లను కొట్టివేసి దేశ భద్రత విషయంలో సన్నద్ధంగా ఉండవలసిందే అని సూచించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు నరేంద్ర మోదీ నిజాయితీపరుడు ఈ దేశానికి కాపలాదారుడు అని మరోసారి నిరూపించుకున్నారని సుప్రీం తీర్పుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం అన్నారు.రాఫెల్ ఒప్పందంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేయడం స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు . స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ రాఫెల్ విమానాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతను రాజకీయాలకోసం పణంగా పెడితే నరేంద్ర మోదీ నిజాయితీపరుడిగా దేశ కాపలాదారుగా మరోసారి నిరూపించుకున్నారని ఆయన కొనియాడారు. -
రాఫేల్‌పై కాంగ్రెస్ వాయిదాతీర్మానం
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో నూతనోత్సాహం నింపుకున్న కాంగ్రెస్ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాలక బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ గురువారం లోక్‌సభ, రాజ్యసభలో రాఫేల్ ఒప్పందంపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టింది. ఆప్ సైతం రాఫేల్ ఒప్పందంపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. మరోవైపు పార్లమెంట్లో విపక్షాల దాడిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశంపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. ఈ భేటీకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ఈ భేటీలో ప్రస్తావించారు. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 46 బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ యోచిస్తుండటంతో ఈ దిశగా కసరత్తును బీజేపీ ముమ్మరం చేసింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వైఖరిపై ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా పార్టీ సభ్యులకు మార్గనిర్ధేశం చేశారు. -
కాగితంతోనైనా విమానం చేశారా?
మహాసముంద్/బలౌదా బజార్: రఫేల్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును అనుభవం ఉన్న ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని హెచ్ఏఎల్కు కాకుండా, ఏ అనుభవమూ లేని రిలయన్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారనీ, అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. అసలు అనిల్ అంబానీ ఎప్పుడైనా కాగితంతోనైనా విమానం తయారు చేశారో లేదో అని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో ఎన్నికలు జరగనున్న మహాసముంద్, బలౌదా బజార్ జిల్లాల్లో రాహుల్ మంగళవారం ప్రచారం నిర్వహించారు. రఫేల్ కుంభకోణంపై విచారణకు సిద్ధమవుతున్న కారణంగానే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను అత్యవసరంగా అర్ధరాత్రి విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారని రాహుల్ అన్నారు. ‘సీబీఐ విచారణ జరిగితే రెండే పేర్లు బయటకొస్తాయి. ఒకటి నరేంద్ర మోదీ, రెండు అనిల్ అంబానీ. విచారణ అంటే మోదీకి భయం’ అని ఆయన పేర్కొన్నారు. ‘మోదీ చెబుతున్నదాని ప్రకారం 2014కు ముందు దేశంలో ఎక్కడా అభివృద్ధే లేదు. ఆయన ప్రధాని అయ్యాకే అభివృద్ధి మొదలైందట. దేశం ప్రజలతో ముందుకెళ్తుంది తప్ప ఒక్క వ్యక్తితో కాదనే చిన్న విషయం ఆయనకు అర్థం కావడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా ప్రజలను ఆయన అవమానిస్తున్నారు’ అని రాహుల్ అన్నారు. మోదీ ప్రజల వద్ద నుంచి డబ్బును లాక్కుని నోట్లరద్దు ద్వారా నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి మోసగాళ్ల జేబులు నింపారని రాహుల్ ఆరోపించారు. నోట్లరద్దు ద్వారా దొంగలు తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే అవకాశాన్ని మోదీ కల్పించారనీ, ఈ చర్య వల్ల సామాన్యులు తీవ్రంగా బాధలకు గురైతే ధనవంతులు మాత్రం లాభపడ్డారని అన్నారు. -
నేను అబద్ధం చెప్పలేదు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ముంగిట రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం మరో మలుపు తిరిగింది. ఎన్డీయే హయాంలో కుదిరిన ఒప్పందం ‘క్లీన్‌డీల్’ అని ఫ్రెంచ్ తయారీ కంపెనీ డసో సీఈఓ ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు. గత యూపీఏతో పోలిస్తే ఎన్డీయే ప్రభుత్వం 9 శాతం తక్కువ ధరకే ఒప్పందం చేసుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎరిక్ అబద్ధాలాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయంగా సున్నితమైన ఈ ఒప్పందానికి సంబంధించిన పలు విషయాల్ని ఎరిక్ బహిర్గతం చేశారు. సీఈఓ స్థానంలో ఉన్న తాను కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా అబద్ధాలు చెప్పడంలేదని అన్నారు. ఎరిక్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఎరిక్ కట్టుకథలు చెబుతున్నారన్న కాంగ్రెస్.. నిష్పాక్షిక విచారణతోనే నిజాలు బయటికొస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ దుష్ప్రచారం ఎరిక్ వ్యాఖ్యలతో బట్టబయలైందని బీజేపీ తిప్పికొట్టింది. బేరసారాలతో తగ్గిన ధర: ‘ఎన్డీయే కొనే 36 విమానాలు యూపీఏ ఆర్డర్ ఇచ్చిన 18 విమానాలకు రెండు రెట్లు. దీని ప్రకారం ధర కూడా రెట్టింపు కావాలి. అంతర ప్రభుత్వ ఒప్పందం కావడంతో బేర సారాల అనంతరం ధరను 9 శాతం తగ్గించాం. ‘ఫ్లై అవే’ విధానంలో కొనుగోలుచేస్తున్నందున ఎన్డీయే ఒప్పందంలోని 36 విమానాల ధర.. యూపీఏ కుదుర్చుకున్న 126 విమానాల కన్నా తక్కువే’ అని ఎరిక్ తెలిపారు. యూపీఏ ఒప్పందంలో భాగంగా భారత్‌లో తయారుచేయాల్సిన విమానాలు ఏ రకమైనవి, ధరల మార్పులు తదితరాలను ఆయన వెల్లడించలేదు. రిలయన్స్ ఒక్కటే కాదు.. ఆఫ్సెట్ నిబంధనలు పాటించేందుకు తాము రిలయన్స్ డిఫెన్స్‌తో పాటు పలు ఇతర సంస్థల్ని కూడా భాగస్వామ్య సంస్థలుగా ఎంచుకున్నామని ఎరిక్ తెలిపారు. ‘ఈ మేరకు మొత్తం 30 కంపెనీలతో అవగాహన కుదుర్చుకున్నాం. ఒప్పందం మేరకు మొత్తం ఆఫ్సెట్ వ్యయంలో 40 శాతాన్ని ఈ కంపెనీలతో కలసి పంచుకుంటాం. అందులో రిలయన్స్ డిఫెన్స్ వాటా 10 శాతమే. మిగిలినదంతా డసో, ఆ కంపెనీల మధ్య నేరుగా కుదిరిన ఒప్పందంలో భాగం’ అని ఎరిక్ వెల్లడించారు. రిలయన్స్ డిఫెన్స్‌లో డసో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోదని, కానీ 50:50 నిష్పత్తిలో రెండు కంపెనీలు జాయింట్ వెంచర్ ఏర్పాటుచేస్తాయని తెలిపారు. దీని మొత్తం విలువ రూ.800 కోట్లు ఉండొచ్చన్నారు. యూపీఏ అలా.. ఎన్డీయే ఇలా..: ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 126 విమానాల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిన యూపీఏ.. అందులో 18 విమానాల్ని ‘ఆఫ్ షెల్ఫ్’(అవసరాలతో నిమిత్తం లేకుండా అప్పటికే తయారైనవి) విధానంలో సేకరించడానికి అంగీకరించింది. మిగిలిన వాటిని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో స్వదేశంలోనే తయారుచేయించాలని ఒప్పందం చేసుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ఈ ఒప్పం దాన్ని రద్దుచేసి, 36 విమానాల్ని ‘ఫ్లై అవే’(ఎగరడానికి సిద్ధంగా ఉన్న) షరతుతో కొనుగోలుచేసేందుకు తాజా డీల్ కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.58 వేల కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. -
రాఫెల్ డీల్ : సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందం వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వం సోమవారం సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఒప్పందంలో ఏ భారత వాణిజ్య సంస్థ పేరును ప్రభుత్వం ఆఫ్సెట్ పార్టనర్‌గా సిఫార్సు చేయలేదని ఈ నివేదిక పేర్కొంది. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై పూర్తి వివరాలను పిటిషనర్‌తో పాటు ప్రజా బాహుళ్యానికి వెల్లడించాలని అక్టోబర్ 31న సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు రాఫెల్ విమానాల కచ్చిత ధరను సైతం సుప్రీం న్యాయమూర్తులకు సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికలో కేంద్రం పొందుపరిచింది. ఆఫ్సెట్ పార్టనర్ విషయంలో దసాల్ట్ ఏవియేషన్ నుంచి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. దీంతో ఈ ఒప్పందంలో రిలయన్స్ డిఫెన్స్ వాస్తవంగా ఎలాంటి పాత్ర పోషిస్తుందనే వివరాలను కేంద్రం అఫిడవిట్లో పొందుపరచలేదు. ఇక రాఫెల్ విమానాల సేకరణలో 2013 డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ విధానాలను పాటించామని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం పొందామని, ఫ్రాన్స్‌తో భారత బృందం సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఫ్రాన్స్‌తో సంప్రదింపులు ఏడాదిపాటు సాగయని, ఒప్పందంపై సంతకం చేసేముందు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతి తీసుకున్నామని పేర్కొంది. దసాల్ట్ ఏవియేషన్ ఆఫ్సెట్ భాగస్వాముల ఎంపికలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. -
రాఫెల్ డీల్‌పై రాహుల్ : మోదీకి నిద్రలేని రాత్రులు
-
రాఫెల్ డీల్‌పై రాహుల్ : మోదీకి నిద్రలేని రాత్రులు
సాక్షి, న్యూడిల్లీ : రాఫెల్ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.ఈ ఒప్పందంపై విచారణ చేపడితే చర్యలు తప్పవనే భయంతో ప్రధాని మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. దసాల్ట్ ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపిర్ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంబానీ భూమిని కొనుగోలు చేసిన అనంతరమే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్‌ను ఆఫ్సెట్ భాగస్వామిగా దసాల్ట్ నియమించిందని ఆరోపించారు. నాగపూర్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో భూములున్నందునే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాదని, రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకున్నట్టు దసాల్ట్ ఏవియేషన్ ఇటీవల వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఏఎల్కు ఎక్కువ భూములున్నా పక్కనపెట్టి మరీ అంబానీ కంపెనీని భాగస్వామిగా ఎంచుకున్నారని రాహుల్ ఆరోపించారు. అనిల్ అంబానీకి నాగపూర్ ఎయిర్పోర్ట్ వద్ద భూములున్నందునే కాంట్రాక్టును ఇచ్చినట్టు దసాల్ట్ సీఈవో చెబుతున్నారని, అయితే దసాల్ట్ ఇచ్చిన డబ్బుతోనే అనిల్ అంబానీ భూములను కొనుగోలు చేసినట్టు వెల్లడైందని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ డీల్ ప్రధాని నరేంద్ర మోదీ, అనిల్ అంబానీల మధ్య భాగస్వామ్య ఒప్పందమేనని దుయ్యబట్టారు. రాఫెల్ ఒప్పందంపై విచారణకు సిద్ధమైనందునే సీబీఐ చీఫ్ అలోక్ వర్మను తప్పించారని ఆరోపించారు. ఈ ఒప్పందంపై విచారణ జరిపితే మోదీ తప్పించుకోలేరని, ఇందుకు అవినీతి ఓ కారణమైతే, విధాన నిర్ణేతగా ప్రధాని దోషిగా నిలబడాల్సిందేనన్నారు. అనిల్ అంబానీకి రూ 30,000 కోట్లు కట్టబెట్టేందుకు మోదీ, అంబానీల మధ్య జరిగిన ఒప్పందం ఇదని రాహుల్ అభివర్ణించారు. రాఫెల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ చేపడితే స్వాగతిస్తామన్నారు. -
సీబీఐ డ్రామా మోదీ వైఫల్యానికి సంకేతమే..
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. సీబీఐపై ప్రధాని మోదీకి పట్టు లేకపోవడంతోనే దర్యాప్తు ఏజెన్సీలో డ్రామాకు తెరలేచిందని ఆరోపించారు. అంతర్యుద్ధంతో వీధినపడ్డ సీబీఐని చక్కదిద్దేందుకు సుప్రీం కోర్టు చొరవ చూపిందని వ్యాఖ్యానించారు. రాఫెల్ ఒప్పందంపై విచారణకు అవరోధం కల్పించాలనే చౌకబారు రాజకీయ ప్రయోజనాలతో కేంద్రం సీబీఐలో చిచ్చుకు పూనుకుందని విమర్శించారు. సీబీఐలో కేంద్రం జోక్యం చివరకు దర్యాప్తు ఏజెన్సీలో ఏవగింపు కలిగించే పరిణామాలకు దారితీసిందని ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో నలుగురు సుప్రీం న్యాయమూర్తులు సర్వోన్నత న్యాయస్ధానంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై బాహాటంగా ముందుకొచ్చిన తరహాలోనే సీబీఐలో అంతర్యుద్ధం సైతం దేశ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.మరోవైపు రాఫెల్ ఒప్పందంతో మోదీ సర్కార్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. రాఫెల్ డీల్‌పై విచారణకు విఘాతం కలిగించేందుకే సీబీఐలో విభేదాలను కేంద్రం ప్రోత్సహించిందని ఆరోపించారు. -
ఆ ఒక్కటీ తప్ప!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ‘రఫేల్’ భయం పట్టుకుంది. ఆ మాట వింటేనే వారిలో ఆందోళన కనిపిస్తోంది. అదేంటి.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన అస్త్రం అదే కదా? ఈ అంశంతోనే కదా కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెడుతోంది. అలాంటిది ఈ విషయంలో కాంగ్రెస్ నేతలకు భయమెందుకు అంటారా? ఇక్కడే అసలు విషయం ఉంది. తెలంగాణలో రఫేల్ అంశం వల్ల తమకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని టీపీసీసీ నేతల భావన. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తే ప్రయోజనం ఏమీ ఉండదని, టీఆర్ఎస్ లక్ష్యంగానే రాహుల్ ప్రసంగం ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే రాహుల్‌గాంధీ.. ఆ ఒక్క అంశం తప్ప మిగిలినవాటిపై దృష్టిసారిస్తే బావుంటుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రచారం చేస్తున్నా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం.. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదమే. బీజేపీ, మోదీ లక్ష్యంగానే ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల రెండ్రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా రాహుల్ రెండు బహిరంగ సభల్లోనూ రఫేల్ డీల్ పైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. బీజేపీని టార్గెట్ చేసుకుని అస్త్రాలు సంధించారు. అయితే.. ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్పై కాకుండా బీజేపీపై పోరాడితే పార్టీకి ఎన్నికల్లో చేకూరే ప్రయోజనం పెద్దగా ఉండదని రాష్ట్ర నేతలంటున్నారు. రఫేల్ గురించి గొంతు చించుకున్నా తెలంగాణలో కలిసిరాదనేది వారి ఆవేదన. అందుకే రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలను పేర్కొంటూ వీరు ఓ నోట్ సిద్ధం చేశారు. అందులో ఏముందని ఓ సీనియర్ కాంగ్రెస్ నేతను అడగ్గా.. రాఫెల్ తప్ప అన్నీ ఉన్నాయని నవ్వుతూ బదులిచ్చారు. టార్గెట్ టీఆర్ఎస్ ‘వచ్చే ఎన్నికల్లో మా కూటమికి ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్. అలాంటప్పుడు బీజేపీపై ఎంతగా అరచి గగ్గోలు పెట్టినా తెలంగాణలో మాకు పెద్దగా ఒరిగేది ఏముంటుంది. అందుకే.. టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చని వైనంపై ఓ నివేదిక తయారు చేశాం. వాటినే ప్రధానంగా తీసుకుని ఓ నోట్‌ను సిద్దంచేశాం. దీనిలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాలు, పాలమూరు ఎత్తిపోతల పథకం, పేదలకు ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, కేజీ టూ పీజీ వంటి హామీలకు సంబంధించి సవివరమైన పాయింట్లు చేర్చాం. బంగారు తెలంగాణకు బదులుగా కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ బంగారంలా కలిసి వచ్చిందన్నది ఉదాహరణలతో సహ వివరించాం. ఇవి కాకుండా నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సీఏం ఏళ్లతరబడి సచివాలయానికి రాకపోవడం వంటి చాలా విషయాలుంటాయి’అని ఆ సీనియర్ కాంగ్రెస్ నేత వివరించారు. ఇక రాజకీయానికి వస్తే తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ సమన్వయంతో ముందుకు వెడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల కోరిక. ఈ విషయాన్ని తమద్వారా కాకుండా రాహుల్ నోటివెంటచెప్పిస్తే.. ప్రాధాన్యత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రాహుల్ అంగీకరిస్తారా? తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆరాటం సరే.. వీరు సిద్దం చేస్తున్న ప్రసంగం నోట్‌ను రాహుల్ ఆచరిస్తారా? రాఫెల్‌ను కాదని స్థానిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారా? అంటే స్పష్టమైన సమాధానం దొరకడం లేదంటున్నారు. తాము చెప్పింది రాహుల్ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నామన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రచారంలో భాగంగా.. రాహుల్‌కు అక్కడ 15ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాల గురించి మాట్లాడాలని రాష్ట్ర నేతలు పెద్ద చిట్టా తయారుచేసి ఇచ్చారు. అయితే రాహుల్ మాత్రం.. వీటన్నింటికీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. తన 50 నిమిషాల ప్రసంగంలో దాదాపు 40 నిమిషాల పాటు రాఫెల్ ఒప్పందం, కేంద్రంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలపైనే మాట్లాడారు. అయితే మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై రాహుల్ పొడిపొడిగా మాట్లాడారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఈసారి మరింత జాగ్రత్త పడాలని ఆలోచిస్తున్నారు. రాహుల్ పర్యటనకు రెండ్రోజుల ముందే.. ఢిల్లీ వెళ్లి తెలంగాణ సభల్లో ఏం మాట్లాడాలన్నది ఆయనకు విడమరిచి చెప్పాలనుకుంటున్నారు. మంచి ప్రయత్నమే.. కానీ రాహుల్ వీరి మొరను ఆలకిస్తారా! -
రపేల్ డీల్‌లో రిలయన్స్ భాగస్వామ్యంపై డిసో ఏపియేషన్ క్లారిటీ
-
రాఫెల్ వివాదం: రిలయన్స్ ఎంపికపై దసాల్ట్ వివరణ
న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందాన్ని సొంతం చేసుకునేందుకే రిలయన్స్ డిఫెన్స్‌ను వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో దసాల్ట్ ఏవియేషన్ గురువారం వివరణ ఇచ్చింది. భారత్‌కు చెందిన రిలయన్స్ గ్రూప్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నామని, 2017, ఫిబ్రవరి 10న దసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఏఎల్) జాయింట్ వెంచర్ ఏర్పాటైందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్-ఫ్రాన్స్‌ల మధ్య 2016 సెప్టెంబర్‌లో జరిగిన ఒప్పందానికి అనుగుణంగానే దసాల్ట్ ఏవియేషన్ భారత్‌కు 36 రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించిందని ప్రకటన పునరుద్ఘాటించింది. బీటీఎస్ఎల్, కైనెటిక్, మహింద్రా, మైని, శాంటెల్ వంటి వంద సంస్ధలతో వ్యాపార భాగస్వామ్యాలు కుదర్చుకున్నామని కూడా దసాల్ట్ వివరించింది. రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టును దక్కించుకునేందుకు అనివార్యంగానే రిలయన్స్ డిఫెన్స్‌తో డీల్‌కు సంస్థ సంతకం చేసిందని కంపెనీ అంతర్గత నివేదిక పేర్కొందనే వార్తల నేపథ్యంలో ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ దసాల్ట్ ఏవియేషన్ తాజా వివరణతో ముందుకొచ్చింది. రూ 60,000 కోట్ల రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసిన ప్రకటనతో పెనువివాదంలో కూరుకుపోయింది. భారత్ ఒత్తిడి మేరకే రిలయన్స్ డిఫెన్స్‌ను ఒప్పందంలో భాగస్వామిగా చేర్చారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
సుప్రీంకోర్టుకు చేరిన రఫెల్ రగడ
-
నిబంధనల ప్రకారమే ఒప్పందం జరిగి ఉండొచ్చు
-
ఆయన దొంగల కమాండర్..
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగుతోంది. ప్రధాని మోదీ దొంగల కమాండర్ అంటూ సోమవారం రాహుల్ ట్వీట్ చేశారు. భారత్ సూచించిన మీదటే రిలయన్స్‌ను భాగస్వామిగా అంగీకరించినట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హూలాండ్ను ఇంటర్వ్యూ చేసిన ఫ్రెంచ్ న్యూస్ వెబ్సైట్ వీడియో క్లిప్‌ను ట్వీట్‌తో పాటు రాహుల్ పోస్ట్ చేశారు. హోలాండ్ వ్యాఖ్యలతో రాహుల్ రాఫెల్ డీల్‌కు సంబంధించి మోదీ లక్ష్యంగా దాడిని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో వాస్తవాలు వెలుగుచూడాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)చే విచారణ చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఒప్పందంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆ పార్టీ నేత ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్ధి కాకూడదని శర్మ పేర్కొన్నారు. ప్రధానిని కాపాడేందుకు ఆర్థిక, రక్షణ, న్యాయశాఖ మంత్రులు పోటీపడుతున్నారని ఆక్షేపించారు. -
రాఫెల్ డీల్ : జేపీసీ విచారణకు అఖిలేష్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై పెనుదుమారం రేగుతున్న క్రమంలో ఈ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. భారత్- ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందం అంతర్జాతీయ స్ధాయిలో రచ్చకెక్కడంతో జేపీసీ విచారణ జరిపిస్తేనే ఒప్పందంలోని అంశాలు వెలుగుచూస్తాయని చెప్పారు. రాఫెల్ ఒప్పందంలో భారత ప్రభుత్వ సూచనతోనే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండ్ స్పష్టం చేయడంతో ఈ ఒప్పందం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. హోలాండ్ ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస చీఫ్ రాహుల్ గాంధీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని దొంగ, అవినీతిపరుడని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు
-
రాఫెల్ రచ్చ
-
రాఫెల్ రచ్చ: మోదీపై రహుల్ పైర్
-
రాఫెల్ విషయంలో నిరాధార ఆరోపణలు తగదు
-
రాఫెల్ వివాదం : వచ్చే వారం సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం నిలిపివేతను కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు బుధవారం సర్వోన్నత న్యాయస్ధానం అంగీకరించింది. ఫ్రాన్స్‌తో జరిగిన ఈ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై స్టే విధించాలని కోరుతూ న్యాయమూర్తి ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ అంగీకరించింది. రాఫెల్ డీల్‌లో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూరేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో దేశ ప్రజలకు తెలియచెప్పేందుకు రాఫెల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోదీ తన క్రోనీ క్యాపిటలిస్ట్ స్నేహితుల కోసం భారీ అవినీతికి ఊతమిస్తున్నారని ఆరోపించారు. -
రాఫెల్ డీల్‌లో సినిమా ట్విస్ట్..
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌ను అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈ స్కామ్‌పై తాజాగా మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలతో చెలరేగారు. ‘ అవినీతి అంతర్జాతీయీకరించారు..ఈ రాఫెల్ విమానం చాలా వేగంగా..దూరంగా ఎగురుతోంది..ఈ విమానం రానున్న కొద్ది వారాల్లో భారీ బంకర్ బస్టర్ బాంబులను వేయబోతోంద’ని రాహుల్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సమయంలో ఆయన భాగస్వామి, నటుడు జూలీ గయెట్‌తో ఓ మూవీని నిర్మించేందుకు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఒప్పందం చేసుకుందనే వార్తల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 2012 నుంచి 2017 వరకూ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా హోలాండ్ వ్యవహరించగా, గయెట్‌తో ఆయన అనుబంధం 2014 జనవరిలో వెలుగులోకి వచ్చింది. భారత్-ఫ్రాన్స్‌ల మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అమలులో భాగంగా దాసాల్ట్తో రిలయన్స్ జాయింట్ వెంచర్ హోలాండ్ హయాంలోనే 2016 అక్టోబర్‌లో ఖరారు కావడం గమనార్హమని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఈ క్రమంలో మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ ఆరోపణలు గుప్పించారు. ‘మోదీజీ..ఫ్రాన్స్‌లో పెనుదుమారం రేగుతోందని అనిల్ అంబానీకి చెప్పండంటూ రాహుల్ ట్వీట్ చేశారు. రాఫెల్ డీల్‌కు సంబంధించి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని దాసాల్ట్తో రిలయన్స్ భాగస్వామ్యానికి ఇరు దేశాల (భారత్, ఫ్రాన్స్) ప్రభుత్వాలకు సంబంధం లేదని అనిల్ అంబానీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ అనిల్ వారిపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. -
ఆ కుంభకోణం దేశంలోనే అతి పెద్దది; రఘవీరా
సాక్షి, విజయవాడ: రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఆరోపించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ రిలయన్స్‌తో కుమ్మకై ఒక్కొ యుద్ద విమానం మీద 1000 కోట్లకు పైగా రాబందుల్లా దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్‌కు కాంట్రాక్టులు ఇవ్వడంలో జరిగిన అవినీతిని ఎండగడతామన్నారు. సెప్టెంబర్ 16 నుంచి 31 మధ్యలో రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేసి.. గవర్నర్ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు కేరళకు సహాయ చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. కేరళలో ఇళ్లు కొల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున 1000 ఇండ్లు కట్టివ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 2019 లో కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చిందని.. కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామన్నారు. కర్నూలు జిల్లాలో రాహుల్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని 97.8 శాతం మంది కోరుకుంటున్నారని తమ సర్వేలో తేలిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని.. తాము సొంతంగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు. -
రాఫెల్ డీల్ : కాంగ్రెస్‌కు రిలయన్స్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌పై బాధ్యతాయుతంగా మాట్లాడాలని లేకుంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ర్టక్చర్, రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఏరోస్ర్టక్చర్‌లు కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు పంపాయి. రాజకీయ నాయకులకు భావప్రకటనా స్వేచ్ఛ అంటే తమ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదని కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ సెర్గిల్‌ను ఉద్దేశించి రిలయన్స్ ఈ నోటీసులో పేర్కొంది. మీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అవాస్తవ, తప్పుడు ప్రకటనలను చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కాబోదని నోటీసులో స్పష్టం చేసింది. రాఫెల్ ఒప్పందంపై సంయమనంతో వ్యవహరించాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ ఏరోస్ర్టక్చర్, రిలయన్స్ డిఫెన్స్‌లు ఈ నోటీసులో జైవీర్ సెర్గిల్‌ను హెచ్చరించాయి. రిలయన్స్‌కు వ్యతిరేకంగా రణదీప్ సుర్జీవాల్, అశోక్ చవాన్, సంజయ్ నిరుపమ్, అనురాగ్ నారాయణ్ సింగ్, ఊమెన్ చాందీ, శక్తి సంహ్ గోయల్,గొహిల్, సునీల్ కుమార్ జకర్. అభిషేక్ మను సింఘ్వీ, సునీల్ కుమార్ జాఖర్, ప్రియాంక చతుర్వేది వంటి కాంగ్రెస్ నేతలు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని రిలయన్స్ పేర్కొంది. -
డీల్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదు
-
ఫ్రాన్స్ కంపెనీతో రిలయన్స్ భారీ డీల్
ముంబై: ఫ్రాన్స్‌తో రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన భారీ ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజం డస్సాల్ట్ ఏవియేషన్‌తో దేశీ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం ' డస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్' పేరుతో భాగస్వామ్య సంస్థ (జాయింట్ వెంచర్) ను ఏర్పాటు చేయనున్నాయి. రూ. 30,000 కోట్ల విలువైన ఆఫ్సెట్ కాంట్రాక్ట్ లను ఈ జేవీ చేపట్టనున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా వెల్లడించింది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కొత్త పథకం ఐడీడీఎం ప్రాజెక్టు (స్వదేశీపరిజ్ఞానంతోనే రూపకల్పన అభివృద్ధి మరియు ఉత్పత్తి)ను డసాల్ట్, రిలయన్స్ మధ్య ప్రతిపాదిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రమోట్ చేయనుంది. భారతదేశంలో తమ జాయింట్ వెంచర్ ఏర్పాటు పై డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్, రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ ధీరూభాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యూహాత్మక పారిశ్రామిక భాగస్వామ్యాల అభివృద్దిలో కట్టుబడి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం మేక్ ఇండియా పాలసీకి తమ జాయింట్ వెంచర్ మరింత దోహదం చేస్తుందని డసాల్డ్ సీఈవో వ్యాఖ్యానించారు. ఎరిక్ ట్రాపియర్ లాంటి అధ్బుతమైన ప్రపంచ నాయకుడితో భాగస్వామ్యం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. ఇది భారత ఏరోస్పేస్ రంగం లో ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్ అని తెలిపారు. అలాగే అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ కూడా ఈ జేవీ ద్వారా లబ్ది పొందనున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. దీంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేరు, రిలయన్స్ డిఫెన్స్ ఈనాటి మార్కెట్లో భారీ డిమాండ్ నెలకొంది. మరోవైపు ప్రయివేట్ డిఫెన్స్ ఇండస్ట్రీలో దేశంలో ఇదే అతిపెద్ద ఆఫ్ సెట్ ఒప్పందమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా రూ.58 వేల కోట్లతో 36 యుద్ధ విమానాల కొనుగోలుకుగత నెలలో ఒప్పందం కురింది. ఈ ఒప్పందంపై భారతదేశ రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి జీన్ యవెస్ లెడ్రియన్ ఢిల్లీలో సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.