సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ను రఫేల్ ప్రకంపనలు కుదిపేశాయి. ఈ ఒప్పందంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్‌సభలో పాలక, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రఫేల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)చే విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం నిరాకరించింది. రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోఫణలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చుతూ ఈ ఒప్పందం జరిగిన తీరు పట్ల సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు.
ఒప్పందంపై సర్వోన్నత న్యాయస్ధానం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయనందున దీనిపై జేపీసీ విచారణ అవసరం లేదన్నారు. జైట్లీ ప్రసంగానికి అడ్డుతగులుతూ విపక్ష సభ్యులు ఆయనపై కాగితాలను విసిరివేశారు. ప్రభుత్వం రఫేల్‌పై జేపీసీ విచారణ జరిపించాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు. అవినీతిలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ కట్టుకథలతో మోదీ సర్కార్‌కు సైతం ఆ మరకలు అంటించాలని ప్రయత్నిస్తోందని జైట్లీ ఈ సందర్భంగా విపక్షంపై విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment