న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లుల అంశంపై ఏర్పాటు చేసే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)పై ఉత్కంఠ నెలకొంది. గురువారం(డిసెంబర్ 19) లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా జేపీసీని ఏర్పాటు చేస్తు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శుక్రవారంతో పార్లమెంట్ సెషన్ ముగుస్తుండడంతో ఈలోపే జేపీసీపై స్పీకర్ ప్రకటన చేయాల్సి ఉంటుంది. లేదంటే జమిలిపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఈ బిల్లులపై ధృడ నిశ్చయంతో ఉన్నందున జేపీసీపై గురువారం ప్రకటన వస్తుందనే అంతా భావిస్తున్నారు.
అధికారపక్ష సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. జేపీసీలోకి గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు.ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. వచ్చే సెషన్‌లో బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment