paliament
-
‘జమిలి’ బిల్లులపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లుల అంశంపై ఏర్పాటు చేసే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)పై ఉత్కంఠ నెలకొంది. గురువారం(డిసెంబర్ 19) లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా జేపీసీని ఏర్పాటు చేస్తు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారంతో పార్లమెంట్ సెషన్ ముగుస్తుండడంతో ఈలోపే జేపీసీపై స్పీకర్ ప్రకటన చేయాల్సి ఉంటుంది. లేదంటే జమిలిపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఈ బిల్లులపై ధృడ నిశ్చయంతో ఉన్నందున జేపీసీపై గురువారం ప్రకటన వస్తుందనే అంతా భావిస్తున్నారు.అధికారపక్ష సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. జేపీసీలోకి గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు.ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. వచ్చే సెషన్లో బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. -
లోక్ సభలో మోడీ ప్రమాణస్వీకారం
-
హవ్వా! మహిళా ఎంపీలు చూస్తుండగానే..
Jordan Maps Brawl In Parliament Viral: చట్ట సభలకు గౌరవం ఇవ్వడం మాట అటుంచి.. నేతలు దాడులకు తెగబడుతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే పశ్చిమ ఆసియా దేశం జోర్డాన్‌లో చోటు చేసుకుంది. మంగళవారం జోర్డాన్ పార్లమెంట్లో ‘సమాన హక్కు’కు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం మీద చర్చ జరిగింది. ఆ సమయంలో విపక్ష ఎంపీ ఒకరు చట్టం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని అధికార పక్షం పట్టుబడింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. గల్లా గల్లా పట్టుకుని కొట్టుకునేంతదాకా వెళ్లారు. Several deputies engaged in a fight inside Jordan’s parliament on Tuesday. Live footage on state media showed several MPs punching each other in chaotic scenes that lasted a few minutes https://t.co/4WVq2L1Div pic.twitter.com/Z4wBA59NgE — Reuters (@Reuters) December 28, 2021 మహిళా సభ్యులు పక్కనే ఉన్నా పట్టనట్లు ఒకరినొకరు బండబూతులు తిట్టుకుంటూ తోసేసుకున్నారు. ఈ క్రమంలో సభ్యులు కిందపడగా.. కాసేపటికి సిబ్బంది వచ్చి వాళ్లను బయటకు తీసుకెళ్లారు. ఎవరికీ గాయాలు కాలేదు. పార్లమెంట్లో జరిగిన ఈ ఘటన దేశానికే అవమానమని, ప్రపంచవ్యాప్తంగా దేశ పరువు పోయిందంటూ ఎంపీ ఖలీల్ అతియేహ్ అంటున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. #MiddleEast It is #Jordan time. Scuffles among #parliamentarians during the discussion on the amendment of the #Constitution . What a show! pic.twitter.com/ixJLRBVAoM — Donato Yaakov Secchi (@doyaksec) December 28, 2021 -
ఆమె నిరీక్షణకు పాతికేళ్లు!
-
జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలి: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పార్లమెంట్ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు చేస్తున్న ఎంఎస్ఎంఈల బకాయిలు చెల్లించాలని, ఇందులో ఆలస్యం కారణంగా ఎంఎస్ఎంఈలు జీఎస్టీ కట్టలేకపోతున్నాయంటూ వివరించారు. రాష్ట్రానికి జీఎస్టీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలని ఆయన కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఎంఎస్ఎంఈల బకాయిలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమాధానమిచ్చారు. ఇక జూలై 19(సోమవారం) నుంచి 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు జరగనున్నాయి. -
హోదా వచ్చే వరకూ పట్టు వీడేదిలేదు
-
'శశిథరూర్ సాయం తీసుకోలేదు'
న్యూఢిల్లీ: భారత నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్లో ఉరి శిక్ష విధించడాన్ని ఖండిస్తూ పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి విదేశాంగ శాఖ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సాయాన్ని కోరినట్లు ఓ ఇంగ్లీషు దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కొట్టిపారేశారు. విదేశాంగ శాఖలో అందుకు అవసరమైన నాణ్యత కలిగిన ఉద్యోగులు ఉన్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. సుష్మా.. జాదవ్ విషయంపై పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఒకరిని ప్రతిపాదన సిద్ధం చేయాలని కోరినట్లు కూడా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. విదేశీ చట్టాలు, స్పై నిబంధనల ప్రకారం జాదవ్‌కు మరణశిక్ష విధించడం వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ నెంబరు 36ను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఒక విదేశీయుడిని అరెస్టు చేసినప్పుడు వియన్నా కన్వెన్షన్‌ను ప్రతి దేశం పాటించాల్సివుంటుంది. -
పెద్ద నోట్ల రద్దుపై పెల్లుబికిన ఆందోళన
అధిక విలువ కలిగిన పాత కరెన్సీ నోట్ల రద్దుపై విపక్షాలన్నీ బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. పార్లమెంటు వెలుపల భారీ ధర్నా నిర్వహించాయి. మీడియా స్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకూ విపక్ష సభ్యులు మానవహారం పాటించారు. పెద్దనోట్ల రద్దుపై పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశం మొత్తం నగదు మార్పిడి కోసం బ్యాంకుల ముందు నిలబడుతోందని అందుకే తాము కూడా పార్లమెంటు ముందు నిలబడుతున్నామని చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుపై చర్చకు స్పీకర్ సహకరించడం లేదని అన్నారు. ప్రధానమంత్రి వచ్చారా? లేదా? అన్నది కాదని చెప్పుకొచ్చిన రాహుల్.. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇచ్చారా? లేదా అన్నదే ముఖ్యమని అన్నారు. దాదాపు 200 మందికి పైగా ఎంపీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయిన్, జనతాదళ్(యూనైటెడ్) నాయకుడు శరద్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఉన్నారు. సీపీఐ రాజ్యసభ సభ్యుడు సీతారం ఏచూరి మాట్లాడుతూ.. పార్లమెంటుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండా రాజ్యాంగ నిబంధలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు.