'శశిథరూర్ సాయం తీసుకోలేదు'
న్యూఢిల్లీ: భారత నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్‌లో ఉరి శిక్ష విధించడాన్ని ఖండిస్తూ పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి విదేశాంగ శాఖ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సాయాన్ని కోరినట్లు ఓ ఇంగ్లీషు దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కొట్టిపారేశారు. విదేశాంగ శాఖలో అందుకు అవసరమైన నాణ్యత కలిగిన ఉద్యోగులు ఉన్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సుష్మా.. జాదవ్ విషయంపై పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఒకరిని ప్రతిపాదన సిద్ధం చేయాలని కోరినట్లు కూడా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. విదేశీ చట్టాలు, స్పై నిబంధనల ప్రకారం జాదవ్‌కు మరణశిక్ష విధించడం వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ నెంబరు 36ను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఒక విదేశీయుడిని అరెస్టు చేసినప్పుడు వియన్నా కన్వెన్షన్‌ను ప్రతి దేశం పాటించాల్సివుంటుంది.