
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళలోని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) బీజేపీలో చేరనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో తన పాత్ర విషయంలో శశిథరూర్ సంతృప్తిగా లేరని, అందుకే పార్టీని వీడాలనుకుంటున్నారని సమాచారం. దీనికితోడు ఆయన తాజాగా బీజేపీ ఎంపీ జై పాండాను కలుసుకోవడం, దానికి సంబంధించిన ఫొటో వైరల్ కావడం.. మొదలైనవన్నీ ఆయన బీజేపీలో చేరుతున్నారనడానికి సంకేతాలని పలువురు చెబుతున్నారు. శశి థరూర్ తిరువనంతపురం నుండి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే గత కొన్నేళ్లు ఆయనకు, కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తి
కాంగ్రెస్ తన సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదని థరూర్ భావిస్తున్నారు. 2022లో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. కానీ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) చేతిలో ఓడిపోయారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు కావాలని ఆయన కోరుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇవి దక్కనందున ఆయనలో అసంతృప్తి నెలకొంది.
కేరళలో నిర్లక్ష్యం
శశి థరూర్ కేరళకు చెందిన నేత. ఆయన తిరువనంతపురం నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ కేరళ కాంగ్రెస్‌లో అతనికి ఎలాంటి కీలక పాత్ర లేదు. కేరళలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం అవసరమని థరూర్ పలుమార్లు అన్నారు. రాష్ట్రంలో ఆయనకు ప్రజాదరణ ఉన్నా, పార్టీ నాయకత్వం దానిని పట్టించుకోలేదని సమాచారం.
పార్టీ వైఖరికి భిన్నంగా..
శశి థరూర్ తరచూ పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. మోదీ-ట్రంప్ సమావేశం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని థరూర్ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా ఉంది.
థరూర్‌పై ఇతర పార్టీల కన్ను
కేరళలోని అధికార లెఫ్ట్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) థరూర్‌ను పార్టీలోకి స్వాగతిస్తున్నదనే వార్తలు వినిపించాయి. దక్షిణ భారతదేశం(South India)లో తన ఉనికిని పెంచుకోవడానికి బీజేపీ థరూర్ సాయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్‌సీపీ వంటి ఇతర పార్టీలు కూడా థరూర్‌తో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
వ్యక్తిగత ఆశయం
థరూర్ తాను కేవలం ఎంపీగానే ఉండాలని కోరుకోవడం లేదు. పార్లమెంటులో జరిగే ప్రధాన చర్చల్లో పాల్గొని జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభావవంతమైన పాత్ర పోషించాలని అభిలషిస్తున్నారు. కానీ ఆయనకు కాంగ్రెస్‌లో ఇటువంటి అవకాశం రావడం లేదు. రాహుల్ గాంధీ- థరూర్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం అసంపూర్ణంగానే ముగిసింది.
ఇది కూడా చదవండి: Bihar Diwas: బీహార్ @ 113.. ప్రముఖుల శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment