upset
-
బీజేపీ గూటికి శశిథరూర్?.. ఖచ్చితమైన సంకేతాలివే..
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళలోని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) బీజేపీలో చేరనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో తన పాత్ర విషయంలో శశిథరూర్ సంతృప్తిగా లేరని, అందుకే పార్టీని వీడాలనుకుంటున్నారని సమాచారం. దీనికితోడు ఆయన తాజాగా బీజేపీ ఎంపీ జై పాండాను కలుసుకోవడం, దానికి సంబంధించిన ఫొటో వైరల్ కావడం.. మొదలైనవన్నీ ఆయన బీజేపీలో చేరుతున్నారనడానికి సంకేతాలని పలువురు చెబుతున్నారు. శశి థరూర్ తిరువనంతపురం నుండి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే గత కొన్నేళ్లు ఆయనకు, కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది.పార్టీ నాయకత్వంపై అసంతృప్తికాంగ్రెస్ తన సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదని థరూర్ భావిస్తున్నారు. 2022లో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. కానీ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) చేతిలో ఓడిపోయారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు కావాలని ఆయన కోరుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇవి దక్కనందున ఆయనలో అసంతృప్తి నెలకొంది.కేరళలో నిర్లక్ష్యం శశి థరూర్ కేరళకు చెందిన నేత. ఆయన తిరువనంతపురం నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ కేరళ కాంగ్రెస్‌లో అతనికి ఎలాంటి కీలక పాత్ర లేదు. కేరళలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం అవసరమని థరూర్ పలుమార్లు అన్నారు. రాష్ట్రంలో ఆయనకు ప్రజాదరణ ఉన్నా, పార్టీ నాయకత్వం దానిని పట్టించుకోలేదని సమాచారం.పార్టీ వైఖరికి భిన్నంగా..శశి థరూర్ తరచూ పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. మోదీ-ట్రంప్ సమావేశం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని థరూర్ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా ఉంది.థరూర్‌పై ఇతర పార్టీల కన్నుకేరళలోని అధికార లెఫ్ట్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) థరూర్‌ను పార్టీలోకి స్వాగతిస్తున్నదనే వార్తలు వినిపించాయి. దక్షిణ భారతదేశం(South India)లో తన ఉనికిని పెంచుకోవడానికి బీజేపీ థరూర్ సాయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ వంటి ఇతర పార్టీలు కూడా థరూర్‌తో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.వ్యక్తిగత ఆశయంథరూర్ తాను కేవలం ఎంపీగానే ఉండాలని కోరుకోవడం లేదు. పార్లమెంటులో జరిగే ప్రధాన చర్చల్లో పాల్గొని జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభావవంతమైన పాత్ర పోషించాలని అభిలషిస్తున్నారు. కానీ ఆయనకు కాంగ్రెస్‌లో ఇటువంటి అవకాశం రావడం లేదు. రాహుల్ గాంధీ- థరూర్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం అసంపూర్ణంగానే ముగిసింది. ఇది కూడా చదవండి: Bihar Diwas: బీహార్ @ 113.. ప్రముఖుల శుభాకాంక్షలు -
ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం
యువకుడు తన అనారోగ్యానికి అయ్యే ఖర్చు విషయమై కలత చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆదర్శనగర్‌లోని ఓ హోటల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..నితేష్ అనే 25 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఐతే తన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు తల్లిదండ్రులు భరించగలిగేది కాకపోవడంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ మేరకు ఆదర్శనగర్‌లోని ఓ హోటల్ బుక్ చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే రూమ్ బుక్ చేసుకుని మరీ ఒక ప్లాస్టిక్ సంచితో ముఖాన్ని చుట్టి ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్‌ని అనుసంధానించాడు. దీంతో ఆ వ్యక్తి శరీరంలోకి చేరిని అధికమొత్తంలోని ఆక్సిజన్ ఒక్కసారిగా గుండె స్పందన రేటును పడిపోయేలా చేసి ప్రాణాంతకంగా మారి చనిపోయేలా చేస్తుంది. మృతుడిని నితేష్‌గా గుర్తించారు పోలీసులు. అతను సూసైడ్ నోట్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని పేర్కొన్నాడు. దీని కోసం తాను తన తల్లిదండ్రులకు భారంగా మారకూడదని భావించే ఆ యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: కాంచీపురం: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురి సజీవదహనం!) -
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో పేరు లేకపోవడంపై కొండా సురేఖ అలక
-
నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం
న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన తర్వాత.. ఆ ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేస్తున్న ప్రతీ వ్యాఖ్యలను కొన్ని జాతీయ మీడియా చానెళ్లు రంధ్రాన్వేషణ చేస్తోన్నాయి. గతంలో ఆయన స్టేట్మెంట్లను.. తాజాగా చేస్తున్న ప్రకటనలనూ కేంద్రంపై విమర్శే అనే కోణంలో ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఐఏఏ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏ విషయంలోనూ నేను అసంతృప్తిగా లేను. పూర్తి సంతోషంగా పని చేసుకుంటున్నా. నా వ్యాఖ్యలతో లేనిపోని వివాదాలు సృష్టించడం ఆపండి అంటూ ఆయన మీడియాకు చురకలు అంటించారు. ‘‘మీడియా అడిగితే అంతా నేను వాస్తవాలే మాట్లాడతా. కానీ, నేను అనని మాటల్ని కూడా నాకు ఆపాదించడం ఎందుకు?. దయచేసి ఓ విశ్లేషణ టీంను నియమించుకుని.. నా ప్రసంగాలను విశ్లేషించండి. అందులో నేను ఏదైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తే.. ఏ శిక్షకైనా నేను రెడీ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ప్రీతిపాత్రుడైన బీజేపీ నేతగా గడ్కరీకి ఓ గుర్తింపు ఉంది. అంతెందుకు ఆయన ప్రకటనలను ఆధారంగా చేసుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని మోదీ, బీజేపీని విమర్శిస్తుంటుంది. ఈ తరుణంలో గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించాక సైతం విపక్షాలు ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నాయి. అయితే అప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రసంగాలను కేంద్రానికి వ్యతిరేక కోణంలోనే విశ్లేషిస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. నా పాత వీడియోను చూపించి.. సంచలనం సృష్టించాలన్నది కొన్ని మీడియా హౌజ్‌ల అభిమతంగా కనిపిస్తోంది. ఈమధ్య మహారాష్ట్రలో నేను చేసిన ప్రసంగాన్ని ఓ రిపోర్టర్ తప్పుగా చూపించాడు. సిబ్బంది తప్పిదంతోనే అలా జరిగిందని వాళ్లు నాకు వివరణ ఇచ్చుకున్నారు. తప్పులు సహజమే. కానీ, ఇలాంటి తప్పులు అపార్థాలకు దారి తీస్తాయి అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వక్రీకరించొద్దు ఏనాడూ నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. మీకు దమ్ముంటే.. మీరు ఎవరినైనా విమర్శించాలంటే నేరుగా విమర్శించండి. అంతేగానీ ఈ వ్యవహరంలోకి నన్నులాగడం ఎందుకు?. నా వ్యాఖ్యలను వక్రీకరించడం ఎందుకు? మహారాష్ట్ర ప్రసంగంలో.. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పాను. స్వాతంత్రానికి పూర్వం.. రాజకీయాలు దేశభక్తితో కూడుకుని ఉండేవి. కానీ, తర్వాత అవి దేశ అభివృద్ధి దిశగా సాగుతున్నాయి. రాజకీయాల్లో ఎంత మార్పు వచ్చింది అనే కోణంలోనే నేను మాట్లాడాను. కానీ, రాజకీయాలను వదిలేయాలని ఉందని విమర్శాత్మక కోణంలో వ్యాఖ్యలేమీ నేను చేయలేదు. అక్కడ నేను అనని మాటల్ని నా పేరుతో ఆరు, ఏడేసి కాలమ్స్‌లో రాశారు. అసలు ఏం జరిగిందని గడ్కరీ ఎందుకు అసంతృప్తిగా ఉంటాడు?.. నా పనేదో నేను చూసుకుంటున్నా. సంతోషంగా ఉన్నా. ఎవరి పట్ల నాకు తప్పుడు ఉద్దేశాలు లేవు అంటూ అసంతృప్తి లేదనే విషయాన్ని గడ్కరీ ఇలా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: యాత్రతో అయినా రాత మారేనా? -
గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో పరుషుల ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డేనియల్ మెద్వదెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు పదేపదే మెద్వదేవ్‌ను తమ మాటలతో అవమానపరచడం అతన్ని బాధించింది. ఈ విషయాన్ని మెద్వదేవ్ మ్యాచ్ ముగిసిన అనంతరం కోర్టులో కామెంటేటర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు లో ఐక్యూ. ఒక క్రీడాకారుడితో ఎలా ప్రవర్తించాలన్న కనీస పరిజ్ఞానం లేదు. ఒకప్పుడు నేను తెలిసి తెలియకుండా చేసిన తప్పుకు ఇలా అవమానించడం కరెక్టు కాదు. ఆటగాళ్లకు కాస్త గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. మనషులమన్న సంగతి మరిచి రోబోల్లా ప్రవర్తించారు..'' అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన క్రమంలో డేనియల్ మెద్వదేవ్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు వింత అనుభవం చూపించాడు. మ్యాచ్ సమయంలో గట్టిగట్టిగా అరుస్తూ.. తన చర్యలతో ప్రేక్షకులకు కాస్త విసుగు పుట్టించాడు. అప్పట్లో ఈ ఘటన మెద్వదేవ్‌ను విలన్‌గా మార్చేసింది. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో రెండోరౌండ్ మ్యాచ్‌లో లోకల్ ఆటగాడు నిక్ కిర్గియోస్‌తో తలపడ్డాడు. మ్యాచ్ ఆడుతున్నంతసేపు నిక్ కిర్గియోస్ పదే పదే ప్రేక్షకుల వైపు చూస్తూ మెద్వదేవ్‌ను రెచ్చగొట్టండంటూ ఎంకరేజ్ చేయడం విశేషం. మ్యాచ్ ముగిసేవరకు సైలెంట్‌గా ఉన్న మెద్వదేవ్... ఆ తర్వాత కామెంటరీ ఇంటర్వ్యూలో తన ఆగ్రహాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డేనియల్ మెద్వదేవ్ రెండో రౌండ్లో నిక్ కిర్గియోస్‌పై 7-6, 6-4,4-6,6-2తో ఓడించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ముర్రే రెండో రౌండ్లోనే వైదొలగడంతో.. నాదల్ తర్వాత మెద్వదేవ్ టైటిల్ ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. కాగా మెద్వదేవ్ 2021 యూఎస్ ఓపెన్ విజేత అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. గతేడాది యూఎస్ ఓపెన్ గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునన్న మెద్వదేవ్ కెరీర్లో 13 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. "Show some respect." 😡😡 Daniil Medvedev was NOT happy with the crowd behaviour tonight and he let them know in the on-court interview! 😳 #AusOpen - Live on Channel 9 and 9Now pic.twitter.com/5UKAFOuV9v — Wide World of Sports (@wwos) January 20, 2022 -
సైబర్ ల్యాబ్ ఎస్ఐ ఆత్మహత్య
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ కారకులు కాదు.. కోర్టు కేసులతో పదోన్నతి ఆగిపోయి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను.. నా బ్యాచ్ వాళ్లంతా డీఎస్పీ హోదాలో ఉన్నారు.. కుటుంబ సభ్యులంతా దూరంగా ఉండటం వల్ల మనస్తాపానికి గురై చనిపోతున్నా’ అంటూ కర్నూలు సైబర్ ల్యాబ్ ఎస్ఐ డి.రాఘవరెడ్డి పురుగు మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే.. అనంతపురం జిల్లా కదిరి తాలూకా నల్లసింగయ్యగారిపల్లెకు చెందిన రాఘవరెడ్డి 1991లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. ప్రస్తుతం సైబర్ ల్యాబ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కర్నూలు అశోక్‌నగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. కాగా, 2001లో కర్నూలు రైల్వే ఎస్ఐగా పనిచేసేటప్పుడు ఈయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై కోర్టులో విచారణ సాగుతుండటంతో పదోన్నతి ఆగిపోయింది. మరోవైపు రాఘవరెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అప్పటి నుంచి కుమారులతోపాటు భార్యతో మనస్పర్థలొచ్చాయి. దీంతో వారు రాఘవరెడ్డికి దూరంగా ఉంటున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన పురుగు మందు తాగారు. ఆ బాధ తట్టుకోలేక ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి లిఫ్ట్‌లో కిందికి దిగి పక్కనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. వాచ్మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ పార్థసారథిరెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఇలియాజ్ బాషా తదితరులు రాఘవరెడ్డి ఇంటికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాఘవరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో ఉన్న సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి సంబంధాలు రావడం లేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..
సాక్షి,మల్లాపూర్(హైదరాబాద్): ఆనారోగ్యం, పెళ్లి సంబంధాలు రావడం లేదని మనస్థాపంతో ఓయువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. నాచారం సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...ఓల్డ్ మల్లాపూర్‌కు చెందిన తొర్రి నర్సింహ కూతురు అశ్విని(29) గత కొద్ది రోజుల నుంచి ఆనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి తోడు పెళ్లి సంబంధాలు రావడం లేదని మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరు బాధ్యలు కారని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. యువకుడి ఆత్మహత్య ఉప్పల్: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన వెంకటరామరాజు కుమారుడు కనకమూరి సుబ్బారాజు (30) ప్రైవేట్ ఉద్యోగి. యూఎస్ఏ నుంచి తిరిగివచ్చిన సుబ్బారాజు సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని నెలలుగా ఇంటి దగ్గరే ఉంటూ మద్యానికి బానిసైనాడు. నెల రోజుల క్రితం మరోసారి రోడ్డు ప్రమాదం జరగడంతో మళ్లీ గాయపడ్డాడు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన సుబ్బారాజు ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారుజామున ఎంతకీ తలుపు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మోదీజీ నా చివరి కోరికలు తీర్చండి, ప్లీజ్.. అలా అయితేనే.. -
భార్యపై కోపంతో 418 కి.మీ నడక
ద రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ లైక్ ఎ ఫిష్ అండ్ ద వాటర్.. బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ద ఫిషర్ మ్యాన్..ఇంగ్లిష్‌లో అంత క్లియర్‌గా చెప్పినా సరే.. తెలుగు సినిమాలోని ఈ డైలాగును ఇటలీకి చెందిన దంపతులు పెద్దగా విన్నట్లు లేరు.. విన్నా.. అస్సలు పట్టించుకున్నట్లే లేరు. తెల్లారి లెగిస్తే చాలు.. మిగతా పనులన్నీ వదిలేసి.. గొడవ పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు వాళ్లు.. ఇలాగే ఈ మధ్య ఓ రోజు మళ్లా కస్సుబుస్సుమన్నారు.. మాటామాటా పెరిగింది.. మొగుడు అని కూడా చూడకుండా కొంచెం గట్టిగానే వాయించేసింది.. అంతే.. ఆ ఒక్క మాటతో లేచి.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని.. అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. వెళ్లిపోవడం అంటే.. మీరు నేను మారి్నంగ్ వాక్కు వెళ్లినట్లు వెళ్లిపోవడం కాదు.. ఏదో ఊరెళ్లినట్లు వెళ్లిపోయాడు.. కోపం తగ్గేదాకా.. చివరికి పోలీసులు ఆపేదాకా.. నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. ఎంత దూరమో తెలుసా? 418 కిలోమీటర్లు!! వినడానికి నమ్మదగ్గ విషయంలా లేకున్నా.. ఇది నిజమేనట. ఇటలీ పోలీసులే చెప్పారు. గిమర్రా పట్టణంలో లాక్డౌన్ కర్ఫ్యూను ఉల్లంఘించి.. ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడనే సమాచారం రావడంతో ఓ పోలీసు పెట్రోల్ కార్ అతనిని అడ్డగించింది.. ఆరా తీస్తే.. మొత్తం విషయం చెప్పాడు.. పైగా... ఇతను తప్పిపోయినట్లు భార్య ఇచి్చన ఫిర్యాదు కూడా ఉండటంతో పోలీసులు అతనిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.. ‘నా భార్యపై కోపంతో అలా నడుస్తూ వెళ్లిపోయాను.. వారం రోజులుగా నడుస్తూనే ఉన్నాను. దారిలో కొందరు దయతో ఇచ్చిన ఆహారం, నీరు తాగి.. ఇన్ని రోజులు ఉన్నా.. నేను బాగానే ఉన్నా.. కాకపోతే.. కొంచెం ఆలసిపోయా అంతే’ అని కోమోకు చెందిన ఈ 48 ఏళ్ల వ్యక్తి చెప్పాడు. మొత్తం విషయం విని.. నోరెళ్లబెట్టిన ఇటలీ పోలీసులు.. మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతాడో అన్న భయంతో ఇతని భార్య వచ్చేంతవరకూ జాగ్రత్తగా చూసుకుని.. ఆమె రాగానే దగ్గరుండి అప్పగించారట.. ఇంతకీ ఈ మొత్తం స్టోరీలో నీతి ఏమిటి? మీరు విజు్ఞలు.. గ్రహించే ఉంటారు.. మేం మళ్లీ చెప్పాలా ఏమిటి?? – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆయన కంటే ముందే నేను చనిపోతాను
సాక్షి, హైదరాబాద్: ‘నా భర్త మరణాన్ని జీర్ణించుకునే శక్తి నాకు లేదు.. ఆయన కంటే ముందే నేను చనిపోతా.. అంటూ తల్లికి ఫోన్ చేసి ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం నారాయణపేటకు చెందిన సింధూజ(25), భర్త శివకుమార్‌తో కలసి రహ మత్‌నగర్‌లో అద్దెకుంటోంది. వారికి ఇద్దరు కొడుకులు. ఈ నెల 12న శివకుమార్‌కు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన శివకుమార్ తన భార్యకు చెప్పి ఇక తాను ఎక్కువ రోజులు బతకలేనేమోనని బాధపడ్డాడు. మానసిక ఒత్తిడికి గురైన సింధూజ తన తల్లి రత్నాదేవికి ఫోన్‌చేసి ఏ క్షణంలోనైనా తన భర్త గుండెపోటుతో చనిపోవచ్చని ఆయన కంటే ముందే తానే చనిపోతానంటూ చెప్పి ఏడ్చింది. సముదాయించిన ఆమె ఆ తెల్లవారే కుమార్తె వద్దకు రావాలని అనుకున్నా రాలేక పోయింది. ఈలోపునే సింధూజ సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రత్నాదేవి సోమవారం ఉదయం వచ్చే సరికి ఆమె విగతజీవిగా కనిపించింది. తమ అల్లుడి ఆరోగ్యం విషయంలో మనస్తాపానికి గురైన తన కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
కన్నీరు పెట్టిన డీఎంహెచ్‌వో
కర్నూలు:కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ వై.నరసింహులు కన్నీరు పెట్టుకున్నారు.కార్యాలయ ఉద్యోగులు తమ సమస్యలపై ఆందోళన తీవ్రతరం చేయడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.తాను ఉద్యోగం చేయలేనని విలపిస్తూ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వివరాలివీ..డీఐవోగా పనిచేసిన డాక్టర్ వెంకటరమణ, పలువురు ఉద్యోగులు శనివారం ఉదయం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారిని తన చాంబర్లోకి డీఎంహెచ్‌వో పిలిపించుకుని మాట్లాడుతుండగా..పలు డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగులు మూకుమ్మడిగా నిలదీయడంతో డీఎంహెచ్‌వో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.దీంతో ఉద్యోగులు ఆయనపై విరుచుకుపడుతూ..ఎస్సీ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.తాను బీసీని కాబట్టే మూకుమ్మడిగా నిలదీస్తున్నారంటూ డీఎంహెచ్‌వో సైతం ఆగ్రహించారు.తాను వైఎస్సార్ కంటి వెలుగు, సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కలెక్టరేట్లో బిజీగా ఉన్నానని, ఈ సమయంలో తనను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఒక దశలో తీవ్రస్థాయిలో విలపిస్తూ తాను రాజీనామా చేస్తానని, ఈ ఉద్యోగం అక్కర్లేదని వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు ఉద్యోగులు ఆయన్ను సముదాయించి సీట్లో కూర్చోబెట్టారు. కాగా, కార్యాలయ ఏవోగా లద్దగిరి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొరేషిరాజును నియమిస్తున్నామని, ఇకపై ఉద్యోగుల సమస్యలు ఆయనే పరిష్కరిస్తారని డీఎంహెచ్‌వో చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
‘టెక్కు’ తగ్గిస్తే మంచిదేమో?
సాక్షి, హైదరాబాద్ : పోలీసు శాఖలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై సీనియర్ ఐపీఎస్‌లలో అసంతృప్తి కనిపిస్తోంది. టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో క్షేత్రస్థాయిలో ‘మ్యాన్యువల్ వర్క్’పై నిర్లక్ష్యం కనిపిస్తోందని.. ప్రొఫెషనలిజం తగ్గిపోతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారుల్లో ఆధారాల సేకరణ, న్యాయపరంగా కేసులను ముందుకు తీసుకెళ్లడం వంటి సామర్థ్యాలు కనిపించడం లేదన్న భావన వినవస్తోంది. ఇదే సమయంలో వారం రోజులుగా వాట్సాప్, ఇతర సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ సందేశం.. ఇప్పుడు పోలీసు శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొంతకాలంగా పోలీసు శాఖలో టెక్నాలజీ వినియోగం పెరగడం, ఇప్పుడదే టెక్నాలజీ కారణంగా కొత్త ఇబ్బందులు తలెత్తుతుం డటం సీనియర్ ఐపీఎస్‌లలో చర్చకు దారితీసింది. అసలు పోలీసింగ్ ఏంటి, ప్రస్తుతం చేస్తున్నదేమిటి అంటూ పోలీసువర్గాల్లో అంతర్గతంగా వాడివేడి చర్చ సాగుతోంది. అసలు ‘పోలీసింగ్’ చేస్తున్నామా? ‘‘పోలీసు శాఖకు ఆధునీకరణ అవసరమే. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సాంప్రదాయ సిద్ధాంతంతో ముందుకెళ్లాలి. కానీ ఇప్పుడంతా టెక్నాలజీపైనే ఆధారపడి.. పోలీసు శాఖ సాంప్రదాయ లుక్‌ను కోల్పోయింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దూరమవడం వల్ల ఇబ్బందిపడే పరిస్థితి వస్తోంది..’’ అని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో ఓ సీనియర్ ఐజీ పోస్టు పెట్టారు. ఓ కమిషనర్ పెట్టిన క్యాంపుల సమాచారాన్ని ఉటంకిస్తూ.. ‘‘మనం పోలీసింగ్ చేస్తున్నామా? లేక ఇంకేమన్నా స్వచ్చంద సంస్థల కార్యక్రమాలు చేస్తున్నామా?..’’ అని ప్రశ్నించారు. ప్రతీక్షణం టెక్నాలజీ మీదే ఆధారపడి పనిచేయడం భవిష్యత్ పోలీసింగ్‌కు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను ఢిల్లీలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐపీఎస్ సమర్థించారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే.. పోలీసు వృత్తి భవిష్యత్‌లో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఇద్దరు అధికారుల పోస్టులను చూసి.. ఆ గ్రూపులోని మొత్తం 96 మంది ఐపీఎస్ అధికారులు నిర్ఘాంతపోయారు. దీనిపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ మొదలైంది. అసలెందుకీ అసంతృప్తి? టెక్నాలజీ ఎంత పెరిగినా పోలీసు వ్యూహాలు ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటాయని ఢిల్లీలో ఉన్న సీనియర్ ఐపీఎస్ పేర్కొన్నారు. టెక్నాలజీ అనేది ఒక ఆధారం మాత్రమేనని.. కానీ దానిపైనే పూర్తిగా ఆధారపడి ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఏడెనిమిదేళ్ల క్రితం వరకు గ్రామాల్లో, నగరాల్లో పోలీసు శాఖకు బలమైన ఆధారంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేసేదని... గ్రామాల్లో మైత్రి సంఘాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో శాంతి కమిటీలు పోలీసు శాఖకు వెన్నుదన్నుగా నిలిచాయని పేర్కొన్నారు. కానీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యవస్థలు కనుమరుగై పోతున్నాయన్నారు. గతంలో ఏదైనా ఘటన జరిగితే గ్రామాల్లోని మైత్రి కమిటీ సభ్యులు పోలీసులు వచ్చే వరకు మానిటరింగ్ చేసేవారని.. ఇప్పుడు సరైన మానిటరింగ్, నిఘా ఉండటం లేదని స్పష్టం చేశారు. సిబ్బందిపై పట్టు పోతోంది.. ‘‘1990 నుంచి 2010 వరకు కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్‌ల బదిలీ వరకు అంతా పోలీసు శాఖ చేతుల్లోనే ఉండేది. ఓ కానిస్టేబుల్ బదిలీ కోసం గతంలో ఎమ్మెల్యే వచ్చి ఎస్పీనో, డీఐజీనో కలసి విన్నవించుకునేవారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సిఫార్సు చేస్తేగానీ పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇది కూడా పోలీసుశాఖలో అసంతృప్తికి కారణం..’’ అని మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎస్పీ స్థాయి అధికారులు తమ పరిధిలోని కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేయలేని దుస్థితి ఏర్పడిందని.. ఇది పోలీసు ప్రొఫెషనలిజానికి ఇబ్బందిగా ఉందని స్పష్టం చేశారు. తప్పు చేసిన అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తీసుకోలేని విధంగా రాజకీయ ఒత్తిళ్లున్నాయని పలువురు సీనియర్ ఐపీఎస్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన శిక్షణ కూడా లేదు.. కమిషనరేట్ల నుంచి గ్రామీణ ప్రాంత పోలీసుస్టేషన్ల వరకు బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలని ఐపీఎస్‌లు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఎస్సైలలో చాలా మందికి కనీసం ఎఫ్ఐఆర్ నమోదు ఎలా చేయాలో కూడా తెలియడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఠాణాల్లోని రైటర్లపై ఆధారపడి ఎఫ్ఐఆర్లు, కేసు డైరీలు, రిమాండ్ రిపోర్టులు, చార్జిషీట్లు ఫైల్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎస్పీలు కూడా మొర పెట్టుకుంటున్నారు. ఒక ఠాణా పరిధిలో క్రైమ్ హాట్‌స్పాట్ ఏంటి, ఏ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, దానికి కారణమేంటి, ఎలా తగ్గించాలి, నేరస్తులను ఎలా నియంత్రించాలి.. వంటి అంశాలపై లెగ్‌వర్క్ ఎక్కడా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆధారాల సేకరణ, న్యాయపరంగా కేసును ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనా పట్టు ఉండటం లేదని అంటున్నారు. -
రసాభాసగా విజయవాడ మున్సిపల్ సమావేశం
-
రసాభసగా ప్రొద్దుటూరు మున్సిసిపల్ సమావేశం
-
భూమిపూజ రసాభాస
► ఉద్రిక్తతల నడుమ కల్యాణమండపానికి శంకుస్థాపన ► టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాలు బాహాబాహీ ► 21మంది అరెస్టు, విడుదల ► ఎమ్మెల్యే అరాచక పాలన నశించాలంటూ ర్యాలీ, రాస్తారోకో ► గ్రామాల్లో చిచ్చుపెట్టొద్దని మిలట్రీనాయుడు కన్నీరు కల్యాణమండప నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చోడవరం పంచాయతీ శివారు అన్నవరంలో రసాభాసగా మారింది. ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ వివాదం శుక్రవారం తారాస్థాయికి చేరుకుంది. అధిక శాతం మంది గ్రామస్తులు మండపం నిర్మాణం వద్దని ప్రాథేయపడినా అధికారపార్టీ ఎమ్మెల్యే రాజుతోపాటు నాయకులు కనికరించలేదు. తమను చంపి కట్టుకోండంటూ మొత్తుకున్నా..మీరు ఎలా పోతే మాకేంటి మాకు నచ్చిందే చేస్తాం అన్నట్టు వ్యవహరించారు. బందోబస్తు నడుమ శంకుస్థాపన చేపట్టారు. అడ్డుకోబోయిన 21 మంది వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు, మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచీపై విడుదల చేశారు. చోడవరం టౌన్: పోలీసు బందోబస్తుతో అధికారపార్టీ సర్పంచ్ దొమ్మేసి అప్పలనర్సతో పాటు నాయకులు, అధికారులు శుక్రవారం ఉద యం 6 గంటలకే అన్నవరం గ్రామానికి చేరుకున్నారు. కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకొని అడ్డగిం చారు. తోపులాట చోటుచేసుకుంది. ఒకానొక దశలో అధికారపార్టీ వర్గం దాడికి సిద్ధమైంది. పోలీసులు ఇరు వర్గాలను చెదర గొట్టారు. అదే సమయానికి వైఎస్సార్సీపీ నాయకులు గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు అండగా నిలి చారు. మండపం నిర్మాణానికి కేటాయించిన స్థలా నికి చెరోవైపు ఇరువర్గాలు చేరుకున్నాయి. మండపం నిర్మించాలంటూ టీడీపీ వర్గం, తమను చంపిన నిర్మించుకోండి అంటూ గ్రామస్తులు పోటా పోటీగా నినాదాలు చేశారు. నిర్మాణం చేపడితే ఆత్మహత్య చేసుకుంటామంటూ కొందరు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కలసిమెలిసి ప్రశాంతంగా ఉన్న గ్రామస్తులను విడదీయొద్దని మరి కొందరు వేడుకున్నారు. గ్రామస్తులకు ఇష్టం లేకుండా నిర్మాణాలు చేపట్టాలని ఏచట్టంలో ఉందో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. శంకుస్థాపన పనులను ఎవరూ అడ్డుకోరాదంటూ సీఐ శ్రీనివాసరావు గ్రామస్తులను హెచ్చిరించారు. సోమవారం వరకు పనులు ఆపాలని వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు సీఐని కోరగా.. ఈ రోజు కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతారని సోమవారం నుంచి పనులు మొదలు పెడతారని సీఐ పేర్కొన్నారు. శంకుస్థాపనను అడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ నాయకులతో పాటు గ్రామస్తులు, మహిళలు 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము వాహనాల్లో రామంటూ వారంతా అన్నవరం గ్రామం నుంచి పోలీసు స్టేషన్ వరకూ ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యే అరాచక పాలన నశించాలని, ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొత్తూరు జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఏడోసారి శంకుస్థాపన.. గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు తీసుకెళ్లిన వెంటనే సర్పంచ్ డి.అప్పలనర్స పోలీసుల పహారాలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఇలా శంకుస్థాపన చేయడం ఇది ఏడోసారి. ఐదేళ్లుగా రూ.5లక్షలు కేటాయించానని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూ ఎమ్మెల్యే రాజు ఆరుసార్లు శంకుస్థాపనలు చేపట్టారు. ఎన్నటికీ నిర్మాణం చేపట్టక పోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని కోరి రూ.18 లక్షలు మంజూరు చేయించడంతో ఉలిక్కిపడిన ఎమ్మెల్యే హైడ్రామా నడుమ దగ్గరుండి ఏడోసారి శంకుస్థాపన చేయించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు.. శంకుస్థాపన చేస్తున్నారని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే మిలట్రీ నాయుడు అన్నవరం చేరుకున్నారు. అక్కడి భయంకర వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజు గొడవలు రేపుతున్నారని పేర్కొన్నారు. తగాదాలు సృష్టించి ఎన్నో అనర్థాలకు కారకుడు అవుతున్నాడని అన్నారు. అక్కడ ఉన్న సీఐ, ఎస్ఐలను పిలిచి ఎవరి మీద చేయిచేసుకోవద్దని కోరారు. ఐదేళ్లగా నిర్మాణం చేపట్టని ఎమ్మెల్యే కావాలని ఇప్పుడు రాద్ధాంతం సృష్టిస్తున్నాడని అన్నారు. – జి.ఎర్రునాయుడు ఎమ్మెల్యే వల్లే గొడవలు.. వారం రోజులుగా గొడవలకు ఎమ్మెల్యేయే కారణమని పాల సంఘం అధ్యక్షుడు పుల్లేటి సూరిబాబు అన్నారు. ఐదేళ్లుగా కల్యాణమండపం నిర్మాణానికి ఎమ్మెల్యే చుట్టూ తిరిగానని అప్పడు ప్రతీసారీ శంకుస్థాపనలు తప్ప పనులు చేపట్టలేదన్నారు. గ్రామస్తులు రూ.3లక్షలు ఇస్తే విశాఖ డెయిరీ నుంచి రప్పిస్తానని అనడంతో ఒకదశలో మూడు లక్షలు పట్టుకొని ఎమ్మెల్యే వద్దకు వెల్లానన్నారు. దానిని కనకమహాలక్ష్మి బ్యాంకులో డిపాజిట్ చేయమన్నారు. ఎంతకూ పనులు చేపట్టకపోవడంతో ఆ నిధులు తీసుకొచ్చి పాలసంఘం అకౌంటులో వేశాను. వైఎస్సార్సీపీ నాయకులను కలిసి సమస్య వివరించాను.వారు వెంటనే స్పందించి ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి రూ.18 లక్షలు మంజూరు చేయించారు. దీనిని తట్టుకోలేని ఎమ్మెల్యే గ్రామంలోని కొందరిని రెచ్చగొట్టి వారికే కాంట్రాక్టు ఇచ్చి గొడవలు రేపారు. పుల్లేటి సూరిబాబు ప్రస్తుతం రూ.5లక్షలే ఉన్నాయి.. కల్యాణ మండపం నిర్మాణానికి ప్రస్తుతం ఎస్డీఎఫ్ నిధులు రూ.5 లక్షలే ఉన్నాయని డీఈ జి.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. పోలీసు బందోబస్తు, గొడవలు నడుమ ఎందుకు శంకుస్థాప చేయాల్సి వచ్చిందని విలేకరులు ప్రశ్నించగా.. ఈ స్థలాన్ని పంచాయతీ తమకు అప్పగించిందన్నారు. ఉన్న నిధులతో పనులు ప్రారంభిస్తామని, మూడు నెలల తరువాత మరో రూ.15లక్షలు విడుదలవుతాయని తెలిపారు. – జి.ఎస్.ఎస్.ప్రసాద్ -
భర్త మరణంతో మనోవేదనకు గురై భార్య మృతి
నల్లబెల్లి : భర్త మరణంతో మనోవేదనకు గురైన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందిన సంఘటన మండలంలోని శనిగరం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మాట్ల సూరయ్య(60), రాజమ్మ(50) దంపతులు గుడిసెలో నివాసముండేవారు. ఇద్దరు కూలీకి వెళ్తూ జీవించేవారు. సూరయ్య ఈ నెల 9న నిద్రిస్తుండగానే అకస్మాత్తుగా మృతిచెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య రాజమ్మ తీవ్రమనోవేదనతో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. కడుబీద కుటుంబానికి చెందిన మృతురాలి అంత్యక్రియలను గ్రామస్తులు చందాలు వేసుకొని పూర్తి చేశారు. -
ఆల్కహాల్ తాగొద్దన్నారనీ..
- ఎనగుర్తిలో ఘటన - హత్య చేశారంటూ మృతుడి సోదరుడి ఆరోపణ దుబ్బాక: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఎనగుర్తికి చెందిన చెప్యాల బాలయ్య(23) అదే గ్రామానికి చెందిన ఇస్తారి లక్ష్మీనారాయణ ఇంటికి రెండేళ్ల క్రితం ఇల్లరికం వెళ్లాడు. బాలయ్య కూలీనాలీ చేస్తూ ఏడాదిన్నర వరకు కుటుంబాన్ని పోషించాడు. ఇటీవల బాలయ్య తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి బాలయ్య తాగి ఇంటికొచ్చాడు. ఎందుకు తాగావని కుటుంబ సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన బాలయ్య ఇంట్లో ఉన్న విషపు గుళికలు మింగాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలయ్యను హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. బాలయ్యకు భార్య కవిత, కూతురు ప్రణీత ఉన్నారు. బాలయ్యది ఆత్మహత్య కాదని విషం పెట్టి హత్య చేశారని బాలయ్య అన్న చెప్యాల కనకయ్య ఆరోపించారు. ఈ మేరకు భూంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరం
-
అప్సెట్ అయిన అనుష్క
నా పని నేను చేసుకుపోతా.. జయాపజయాలు గురించి పట్టించుకోను.. లాంటి మాటలు అనడానికి వినడానికి బాగానే ఉంటాయి. నిజానికి విజయానికి పొంగిపోని అపజయానికి కుంగిపోని వారుండరు. అందాల భామ అనుష్క ఇటీవల ఇలాంటి వ్యాఖ్యల్నే చేశారు. ఆమె తాజా చిత్రం లింగా విమర్శలకు బాగానే అప్సెట్ అయ్యారన్నది సినీ వర్గాల సమాచారం. ఒక్క విషయం మాత్రం నిజం. లింగా చిత్రంలో తన పాత్ర ప్రాముఖ్యత గురించి పట్టించుకోలేదు. రజనీకాంత్ సరసన నటించే అవకాశం రావడమే అదృష్టంగా భావించానని అనుష్క ముందుగానే స్పష్టం చేశారు. అయితే లింగా చిత్రంపై విమర్శలు మాత్రం ఆమెను అప్సెట్కు గురిచేశాయట. చిత్రంలో ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత లేదు. ఆమె పాత్రకు తగ్గ దుస్తులు ధరించలేదు. మరో విషయం ఆమె చాలా బొద్దుగా కనిపించారు లాంటి విమర్శలను అనుష్క ఎదుర్కొన్నారు. చిత్ర హీరో రజనీకాంత్ దర్శకుడు కేఎస్ రవికుమార్, సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, మరో హీరోయిన్ సోనాక్షి సిన్హాల కంటేకూడా అనుష్కనే విమర్శకు గురికావడం గమనార్హం. తమిళంలో కంటే కూడా తెలుగులో ఈ తరహా విమర్శలు ఆమెను ఎక్కువగా వెంటాడాయి. రుద్రమదేవి చిత్రం ఫస్ట్‌లుక్ వచ్చిన పేరు కూడా లింగా చిత్రంలో నటించినందుకు రాలేదనే విమర్శలు వచ్చాయి. ఇది అనుష్కను ఆలోచనలో పడేశాయట. లింగా చిత్ర సమయంలో ఒక పక్క అజిత్ సరసన నటిస్తున్న ఎన్నై అరిందాల్, మరోపక్క తెలుగులో బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండడంతో కనీస, శారీరక కసరత్తులు కూడా చేయలేని పరిస్థితి అట. దీంతో కాస్త బరువెక్కిన మాట నిజమేనని గ్రహించిన ఈ యోగా టీచర్ ఇప్పుడు బరువు తగ్గించే ప్రయత్నంలో తీవ్రంగా ఉన్నారట. త్వరలో వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న ఎన్నై అరిందాల్ చిత్రంతో పాటు అరుంధతి, బాహుబలి చిత్రాలలో తన సత్తా చాటుకుంటానంటున్న అనుష్క త్వరలో భాగ్యమతి అనే తెలుగు చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. -
బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
0/100.. జన్మభూమి
తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో కనీస మార్కులు సంపాదించలేకపోగా, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. రెండు విడతలుగా సాగినప్పటికీ కేవలం దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే పరిమితం కావడంతో ప్రజల మన్ననలు పొందలేకపోయింది. ప్రధానంగా పింఛన్ల కత్తిరింపు, రేషన్ కార్డుల తొలగింపు వంటి చర్యలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. కమిటీల పేరిట తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు ఆ పార్టీకి చెరగని మచ్చగా మిగిలాయి. గుంటూరు: ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో, ప్రజల భాగస్వామ్యంతో అని చెబూతూ ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం అంతటా రసాభాసగానే ముగిసింది. వేదికలను తెలుగుదేశం నాయకులు ఆక్రమించడంతో ప్రభుత్వం కార్యక్రమం కాస్తా పార్టీ సమావేశాలుగా మారాయనే విమర్శలు జన్మభూమి జరిగిన అన్ని చోట్లా వినిపించాయి. ►అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు, హుదూద్ తుపాను సంభవిం చడంతో తిరిగి నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు రెండు విడతలుగా జిల్లాలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 433 వార్డులు, 1011 గ్రామ పంచాయతీల్లో జన్మభూమి సభలు జరిగినా ఎక్కడా ప్రయోజన కలిగిందనే మాటే వినిపించలేదు. ► ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లేకపోవడం వల్ల వివిధ పనులపై అక్కడకు వచ్చిన ప్రజలు నిరాశకు గురయ్యారు. ► జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం కేవలం పింఛన్లు పంపిణీ,దరఖాస్తుల స్వీకరణకే పరిమితం కావడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. ఫించన్ల పంపిణీకే పరిమితం... జిల్లాలో కమిటీల పేరుతో దాదాపు 53,095 పింఛన్లు తొలగించారు. 34,324 వృద్ధాప్య, 15,349 వితంతు, 860 అభయాస్తం, 1540 వికలాంగులు, 102 కల్లు గీత పింఛన్లు తొలగించారు. ఆధార్ అనుసంధానంతో లక్షకు పైగా రేషన్ కార్డులను తొలగించారు. అన్నిరకాల పింఛన్ల కింద రూ.19.85 కోట్లను పంపిణీ చేశారు. వైద్య శిబిరాలకు స్పందన అంతంత మాత్రమే... ►జన్మభూమి సభల్లో వైద్య శిబిరాలను నిర్వహించి 1,41,831 మందికి మందులు పంపిణీ చేశారు. వైద్య పరీక్షల కోసం 1,42,441 మంది రిజిస్టర్ చేయించుకొన్నారు. ► 8,380 మంది కంటి అద్దాలు, 3,819 మందికి కంటి ఆపరేషన్లు కోసం సిఫార్సు చేశారు. 1521 మందిని ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద వైద్యసేవలకు సిఫారసు చేశారు. ► 2,237 మంది గర్భిణులు, 2,472 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వైద్య సేవలు అవసరమని నిర్ధారించారు. ► ప్రభుత్వం ఆదేశించినా పశువైద్య శిబిరాల్లో నట్టల నివారణ మందులు పంపిణీ చేయలేదు. 1261 శిబిరాలు నిర్వహించి 97,943 పశువులకు వైద్య చికిత్సలు అందించారు. పొలం పిలువా లేదు..బడి రమ్మనా లేదు .. పొలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. పొలాల్లోకి వెళ్లి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చింది అంతంత మాత్రమే. 14,682 మంది రైతులకు భూసార పరీక్షలకు సంబంధించిన కార్డులు అందజేశారు. 5,801 రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేశారు. 34,643 మంది సభ్యులను గుర్తించారు. పొలం బడికి సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ►బడి పిలుస్తోంది... ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు 4,354 మంది పిల్లలను నమోదు చేశారు. బడిబయట ఉన్న పిల్లలను 3084 మందిని గుర్తించారు. 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న 66,631 మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించారు. ►పేదరికంపై గెలుపు.. ఈ కార్యక్రమంలో దాదాపు 67,515 గ్రూపులకు వివిధ పనులకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 15,647 మంది యువకులకు శిక్షణ ఏర్పాటు చేశారు. స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,10, 248 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద 2,298 హార్వెస్టింగ్ స్ట్రక్చర్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 76,737 మొక్కలు నాటారు. 1756 ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. 520 మంది మత్స్యకారులు బోట్లు, వలల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 5018 మంది నీటి కుంటల్లో వదిలేందుకు చేపపిల్లలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు: 1,17,289 పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు : 59,246 మొత్తం దరఖాస్తులు : 1,76,535 రెండో కన్ను పోతే పింఛన్ ఇస్తామంటున్నారు నాకు ఒక కన్ను లేదు. గతంలో పింఛన్ వచ్చేది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పింఛన్ తీసేశారు. ఇప్పుడేమో రెండు కళ్లు పోయినవారికే పింఛను ఇస్తామంటున్నారు. పింఛన్ కోసం రెండో కన్ను పోగొట్టుకోవాలా? ఈ జన్మభూమి వల్ల ఒరిగిందేమీ లేదు. - వికలాంగుడు, మన్నవ హనుమంతరావు, పెనుమాక -
జన్మభూమి రసాభాస
‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం చివరి రోజు రసాభాసగా మారడం.... సభలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు రెచ్చిపోయి వ్యవహరించడం....హాజరైన ప్రజలు భయబ్రాంతులకు గురైన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, ప్రొటోకాల్ వివాదం చినికి చినికి గాలివానలా మారడం...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సభను బహిష్కరించడం... ఇవన్నీ సత్తెనపల్లి 25వ వార్డు సభలో మంగళవారం చోటుచేసుకున్న సంఘటనలు.. సత్తెనపల్లి:పట్టణంలోని 25వ వార్డు ‘జన్మభూమి-మా ఊరు’ సభ స్థానిక కౌన్సిలర్ చల్లంచర్ల సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల సత్యబాబును తొలుత సాంబశివరావు వేదికపైకి ఆహ్వానించారు. వారితోపాటు వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, 24వ వార్డు టీడీపీ కౌన్సిలర్ చౌటా శ్రీనివాసరావులు వేదికపై ఆశీనులయ్యారు. వారు వేదికపై కూర్చోవటాన్ని కౌన్సిలర్ సాంబశివరావు ఆక్షేపించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సమావేశంగా మార్చారు. వార్డుకు సంబంధం లేని వ్యక్తులను వేదికపై నుంచి పంపాలని నిర్వహణ కమిటీ కన్వీనర్ అయిన కమిషనర్ సత్యబాబును సాంబశివరావు కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ఇది అంతా కలసి పాల్గొనవలసిన ప్రభుత్వ కార్యక్రమమని, సామరస్యంగా వెళదామన్నారు. తిరిగి కౌన్సిలర్ సాంబశివరావు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నుంచి గెలిచినప్పటికీ ఆయన్ను సమావేశానికి చైర్మన్‌గా స్వాగతిస్తున్నామని, ప్రొటోకాల్‌కు భిన్నంగా చేయదలచుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వారిని కూడా వేదికపైకి పిలుస్తామన్నారు. దీనికి కమిషనర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ వారిని కూడా ఆహ్వానిస్తానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను వేదికపైకి ఆహ్వానిస్తుండగా, కేవలం కౌన్సిలర్లను మాత్రమే పిలవాలని మాజీ కౌన్సిలర్ గుజ్జర్లపూడి నాగేశ్వరరావు ,13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సరికొండ వెంకటేశ్వరరాజు పెద్దగా కేకలు వేశారు. దీనిపై కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని సాంబశివరావు అన్నారు. ఆ సమయంలో నచ్చకపోతే వెళ్లిపోవచ్చని మున్సిపల్ చైర్మన్ అనడంతో కౌన్సిలర్ సాంబశివరావు వెళుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంలో టీడీపీకి చెందిన వ్యక్తి అసభ్యంగా మాట్లాడడంతో ఒక్కసారిగా వివాదం రేగింది. ఒకానొక దశలో టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు గొడవపడేందుకు సిద్ధం కాగా, పోలీసులు సమన్వయపరిచి పంపారు. సభలో మాట్లాడే అవకాశం కోసం వైస్ చైర్మన్ నాగేశ్వరరావు బతిమిలాడినా అధికారులు అవకాశం ఇవ్వలేదు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రామస్వామి మాట్లాడుతూ సమస్యలను సామ రస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప, అధికారులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. అనంతరం టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి, గర్భిణులకు సీమంతం చేశారు. బాలామృతం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ జె.ప్రభాకర్‌రెడ్డి, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ మంగు శ్రీనివాసరావు, వైద్య అధికారి డాక్టర్ రమాదేవి, ఏరియా వైద్యశాల సూపర్వైజర్ చంద్రశేఖర్, మలేరియా అధికారి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు.. జన్మభూమి సభకు సీఐ, ఎస్సై, సుమారు 15 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. గొడవ సందర్భంలో ఇరు పార్టీల నేతలకు సీఐ యు.శోభన్‌బాబు సర్ది చెప్పారు. -
జన్మభూమి రసాభాస
మాచర్లలో అధికారులను నిలదీసిన లబ్ధిదారులు మాచర్ల టౌన్ పట్టణంలోని 3వ వార్డు నెహ్రూనగర్‌లో మంగళవారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం రసాభాసగా మారింది. ఉదయం 11 గంటల సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి, వార్డు కౌన్సిలర్ షేక్ కరీముల్లాల సమక్షంలో కమిషనర్ మురళీకృష్ణ జన్మభూమి కార్యక్రమం చేపట్టారు. సభ ప్రారంభించిన వెంటనే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వే దికపైకి వచ్చి ‘మా పింఛన్లను తొలగిస్తారా మేమేం పాపం చేశాం’ అంటూ అధికారులను నిలదీశారు. ఏ కారణంతో పింఛన్ తొలగించారో సమాధానం చెప్పేవరకు సభ జరగనీయబోమంటూ అధికారులతో వాదనకు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ స్పందిస్తూ తొలగింపులపై మళ్లీ విచారణ జరుపుతామని ఓపిక పట్టాలని కోరారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ షేక్ క రీముల్లా మాట్లాడుతూ అర్హత ఉన్న వారిని తీసివేయడం వల్లే సమస్యలు వస్తున్నాయని, ఒక్కొక్కరిని పిలిచి సమస్య తెలుసుకోవా లంటూ అధికారులకు సూచించారు. ఈ లోగానే వృద్ధులు, మహిళలు వేదికపైకివచ్చి నిరసన తెలపడంతో సభ గందరగోళంగా మారింది. పట్టణ ఎస్ఐ సింగయ్య, సిబ్బందితో రంగప్రవేశం చేసి వారిని కిందకు పంపారు. అనంతరం కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ పింఛన్ కోల్పోయిన వారి దరఖాస్తులను స్వీకరించి రెండు రోజుల్లో విచారించి అర్హత కలిగిన వారందరికీ పింఛన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటమాని చెప్పారు. చివరకు బిల్ కలెక్టర్ రామారావు పింఛన్‌దారుల దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు రామమునిరెడ్డి, మురళీ, కారుమంచి బుల్లయ్య, ప్రవీణ్‌కుమార్, గులాం రసూల్, నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బోయ రఘురామిరెడ్డి, పోల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గోపవరపు మల్లిఖార్జునరావు, ఉడతా సత్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైద్య శిబిరం... పట్టణంలోని మూడు, నాలుగు, ఐదు, ఆరు వార్డుల్లో బుధవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు సుధాకర్‌రెడ్డి, దంత వైద్యులు కురిమేటి జయప్రకాష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అడిగొప్పులలో... అడిగొప్పుల(దుర్గి): మండలంలోని అడిగొప్పుల గ్రామంలో మంగళవారం జరిగి న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రత్యేక అధికారి విజయకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన జన్మభూమి సభలో పింఛన్ దారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గ్రామంలో వున్న 748 పింఛన్లకు 226 పింఛన్లు తొలగించడం పట్ల లబ్ధిదారులు ఒక్కసారిగా అధికారులపై మండిపడ్డారు. {V>Ð]l$…లో వీధిలైట్లు, మురుగు కాల్వల పూడిక తీత వంటి పనులు నిర్వహించకుండా నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ సర్పంచ్ వలపా చిన్న రాములును గ్రామస్తులు నిలదీశారు. అర్హత కలిగిన వారి పెన్షన్లు తొలగించి టీడీపీకి చెందిన వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించటం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను నిలదీస్తున్న సమయంలో పలువురు టీడీపీ నాయకులు అధికారులకు వత్తాసు పలకడంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఎస్ఐ సుబ్బారావు స్పందించి ఇరువైపులా సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం మిగిలిన లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. - వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. -
గోదావరిలో పడవ బోల్తా.
-
గోదావరిలో పడవ బోల్తా
-
గోదావరిలో పడవ బోల్తా, ఇద్దరి మృతి
హైదరాబాద్: విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో తల్లీకూతుళ్లు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో పడవ బోల్తాపడింది. బలమైన ఈదురు గాలులకు పడవ తిరగబడింది. ఇందులో విహార యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గల్లంతవుగా, ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. రాష్ట్రంలో పలు చోట్ల బలమైన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. -
గోదావరిలో బోటు బోల్తా.. ప్రయాణికులు సురక్షితం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గోదావరి నదిలో టూరిస్టులను తీసుకెళ్తున్న బోటు బలమైన ఈదురు గాలులకు తిరగబడింది. కాగా ప్రయాణికులందరూ సురక్షింగా బయటపడ్డారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదీ ద్వీపంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. టూరిస్టులందరినీ వెంటనే రక్షించి వేరే బోటులోకి చేర్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టూరిస్టులందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.