అప్‌సెట్ అయిన అనుష్క | Beautiful heroine Anushka Shetty Upset... | Sakshi
Sakshi News home page

అప్‌సెట్ అయిన అనుష్క

Dec 27 2014 1:54 AM | Updated on Oct 2 2018 3:16 PM

అప్‌సెట్ అయిన అనుష్క - Sakshi

అప్‌సెట్ అయిన అనుష్క

నా పని నేను చేసుకుపోతా.. జయాపజయాలు గురించి పట్టించుకోను.. లాంటి మాటలు అనడానికి వినడానికి బాగానే ఉంటాయి.

నా పని నేను చేసుకుపోతా.. జయాపజయాలు గురించి పట్టించుకోను.. లాంటి మాటలు అనడానికి వినడానికి బాగానే ఉంటాయి. నిజానికి విజయానికి పొంగిపోని అపజయానికి కుంగిపోని వారుండరు. అందాల భామ అనుష్క ఇటీవల ఇలాంటి వ్యాఖ్యల్నే చేశారు. ఆమె తాజా చిత్రం లింగా విమర్శలకు బాగానే అప్‌సెట్ అయ్యారన్నది సినీ వర్గాల సమాచారం. ఒక్క విషయం మాత్రం నిజం. లింగా చిత్రంలో తన పాత్ర ప్రాముఖ్యత గురించి పట్టించుకోలేదు.

రజనీకాంత్ సరసన నటించే అవకాశం రావడమే అదృష్టంగా భావించానని అనుష్క ముందుగానే స్పష్టం చేశారు. అయితే లింగా చిత్రంపై విమర్శలు మాత్రం ఆమెను అప్‌సెట్‌కు గురిచేశాయట. చిత్రంలో ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత లేదు. ఆమె పాత్రకు తగ్గ దుస్తులు ధరించలేదు. మరో విషయం ఆమె చాలా బొద్దుగా కనిపించారు లాంటి విమర్శలను అనుష్క ఎదుర్కొన్నారు. చిత్ర హీరో రజనీకాంత్ దర్శకుడు కేఎస్ రవికుమార్, సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, మరో హీరోయిన్ సోనాక్షి సిన్హాల కంటేకూడా అనుష్కనే విమర్శకు గురికావడం గమనార్హం.

తమిళంలో కంటే కూడా తెలుగులో ఈ తరహా విమర్శలు ఆమెను ఎక్కువగా వెంటాడాయి. రుద్రమదేవి చిత్రం ఫస్ట్‌లుక్ వచ్చిన పేరు కూడా లింగా చిత్రంలో నటించినందుకు రాలేదనే విమర్శలు వచ్చాయి. ఇది అనుష్కను ఆలోచనలో పడేశాయట. లింగా చిత్ర సమయంలో ఒక పక్క అజిత్ సరసన నటిస్తున్న ఎన్నై అరిందాల్, మరోపక్క తెలుగులో బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండడంతో కనీస, శారీరక కసరత్తులు కూడా చేయలేని పరిస్థితి అట.

దీంతో కాస్త బరువెక్కిన మాట నిజమేనని గ్రహించిన ఈ యోగా టీచర్ ఇప్పుడు బరువు తగ్గించే ప్రయత్నంలో తీవ్రంగా ఉన్నారట. త్వరలో వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న ఎన్నై అరిందాల్ చిత్రంతో పాటు అరుంధతి, బాహుబలి చిత్రాలలో తన సత్తా చాటుకుంటానంటున్న అనుష్క త్వరలో భాగ్యమతి అనే తెలుగు చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement