హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గోదావరి నదిలో టూరిస్టులను తీసుకెళ్తున్న బోటు బలమైన ఈదురు గాలులకు తిరగబడింది. కాగా ప్రయాణికులందరూ సురక్షింగా బయటపడ్డారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదీ ద్వీపంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
టూరిస్టులందరినీ వెంటనే రక్షించి వేరే బోటులోకి చేర్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టూరిస్టులందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
గోదావరిలో బోటు బోల్తా.. ప్రయాణికులు సురక్షితం
Published Sat, May 24 2014 8:40 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement
Advertisement