ద రిలేషన్‌షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ లైక్ ఎ ఫిష్ అండ్ ద వాటర్.. బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ద ఫిషర్ మ్యాన్..ఇంగ్లిష్‌లో అంత క్లియర్‌గా చెప్పినా సరే.. తెలుగు సినిమాలోని ఈ డైలాగును ఇటలీకి చెందిన దంపతులు పెద్దగా విన్నట్లు లేరు.. విన్నా.. అస్సలు పట్టించుకున్నట్లే లేరు. తెల్లారి లెగిస్తే చాలు.. మిగతా పనులన్నీ వదిలేసి.. గొడవ పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు వాళ్లు.. ఇలాగే ఈ మధ్య ఓ రోజు మళ్లా కస్సుబుస్సుమన్నారు.. మాటామాటా పెరిగింది.. మొగుడు అని కూడా చూడకుండా కొంచెం గట్టిగానే వాయించేసింది.. అంతే.. ఆ ఒక్క మాటతో లేచి.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని.. అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు..
వెళ్లిపోవడం అంటే.. మీరు నేను మారి్నంగ్ వాక్‌కు వెళ్లినట్లు వెళ్లిపోవడం కాదు.. ఏదో ఊరెళ్లినట్లు వెళ్లిపోయాడు.. కోపం తగ్గేదాకా.. చివరికి పోలీసులు ఆపేదాకా.. నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. ఎంత దూరమో తెలుసా? 418 కిలోమీటర్లు!! వినడానికి నమ్మదగ్గ విషయంలా లేకున్నా.. ఇది నిజమేనట. ఇటలీ పోలీసులే చెప్పారు. గిమర్రా పట్టణంలో లాక్‌డౌన్ కర్ఫ్యూను ఉల్లంఘించి.. ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడనే సమాచారం రావడంతో ఓ పోలీసు పెట్రోల్ కార్ అతనిని అడ్డగించింది.. ఆరా తీస్తే.. మొత్తం విషయం చెప్పాడు.. పైగా... ఇతను తప్పిపోయినట్లు భార్య ఇచి్చన ఫిర్యాదు కూడా ఉండటంతో పోలీసులు అతనిని స్టేషన్‌కు తీసుకెళ్లారు..
‘నా భార్యపై కోపంతో అలా నడుస్తూ వెళ్లిపోయాను.. వారం రోజులుగా నడుస్తూనే ఉన్నాను. దారిలో కొందరు దయతో ఇచ్చిన ఆహారం, నీరు తాగి.. ఇన్ని రోజులు ఉన్నా.. నేను బాగానే ఉన్నా.. కాకపోతే.. కొంచెం ఆలసిపోయా అంతే’ అని కోమోకు చెందిన ఈ 48 ఏళ్ల వ్యక్తి చెప్పాడు. మొత్తం విషయం విని.. నోరెళ్లబెట్టిన ఇటలీ పోలీసులు.. మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతాడో అన్న భయంతో ఇతని భార్య వచ్చేంతవరకూ జాగ్రత్తగా చూసుకుని.. ఆమె రాగానే దగ్గరుండి అప్పగించారట.. ఇంతకీ ఈ మొత్తం స్టోరీలో నీతి ఏమిటి? మీరు విజు్ఞలు.. గ్రహించే ఉంటారు.. మేం మళ్లీ చెప్పాలా ఏమిటి?? – సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment