
సాక్షి, న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పార్లమెంట్ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు చేస్తున్న ఎంఎస్ఎంఈల బకాయిలు చెల్లించాలని, ఇందులో ఆలస్యం కారణంగా ఎంఎస్‌ఎంఈలు జీఎస్టీ కట్టలేకపోతున్నాయంటూ వివరించారు. రాష్ట్రానికి జీఎస్టీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలని ఆయన కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర‍్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఎంఎస్ఎంఈల బకాయిలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమాధానమిచ్చారు. ఇక జూలై 19(సోమవారం) నుంచి 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment