సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని త్వరలోనే కేబినెట్ ముందు ఉంచుతామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
బెంగళూరులో జరిగిన నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ స్కీమ్ గురించి వెల్లడించారు. ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎంఎస్‌ఎంఈలకు ఏకంగా రూ. 100 కోట్ల వరకు రుణాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఈ పథకానికి కేంద్ర మంత్రి మండలి అనుమతి దక్కితే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ.. బ్యాంకుల ద్వారా లోన్ అందిస్తుంది. కేంద్రం అందించే ఈ లోనుకు ఎలాంటి హామీ అవసరం లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఎంఎస్‌ఎంఈలు బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్‌ను పొందవచ్చు. కానీ వారికి టర్మ్ లోన్‌లు, ప్లాంట్.. మెషినరీ కోసం లోన్ లభించడం లేదని ఈ సందర్భంగా సీతారామన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టనున్న కొత్త పథకం ద్వారా.. ప్లాంట్స్, యంత్రాలకు కూడా లోన్స్ అందించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: రతన్ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీ
ఎంఎస్‌ఎంఈ రంగంలో కర్ణాటక చేస్తున్న కృషిని సీరాటమన్ ప్రశంసిస్తూ.. రాష్ట్రంలో 35 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని, అవి 1.65 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందని, ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment