'రతన్ టాటా' మనల్ని విడిచిపెట్టి నేటికి నెల రోజులు అవుతోంది. సమాజంలోని ప్రతి రంగంలోనూ ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ పరిశ్రమకు ఆయన సహకారం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటుందని.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఎంతోమంది అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, వర్ధమాన వ్యాపారవేత్తలు, కష్టపడి పనిచేసే నిపుణులు కూడా రతన్ టాటా మృతికి సంతాపం తెలిపారు. ఆయన లేరనే మాట భారతదేశాన్ని మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలను బాధించింది. ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచిన రతన్ టాటా.. నాయకత్వంలో టాటా గ్రూప్ కొత్త శిఖరాలకు చేరుకుందని మోదీ పేర్కొన్నారు.
రతన్ టాటా అంటే.. మొదట గుర్తొచ్చేది కరుణ మాత్రమే కాదు. ఇతరుల కలలను నిజం చేసుకోవడానికి.. ఆయన ఇచ్చే మద్దతు కూడా అని తెలుస్తోంది. భారతదేశ స్టార్టప్ వ్యవస్థకు మార్గదర్శకత్వం వహించిన ఆయన, యువ పారిశ్రామికవేత్తల ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు. దేశ భవిష్యత్తును రూపొందించడానికి వారిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించారు.
రతన్ టాటా స్ఫూర్తితో ఎంతోమంది భావి నాయకులు పుట్టుకొస్తారు. ఇది దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా ఉండటానికి సహకరిస్తుంది. ఆయన గొప్పతనం బోర్డ్‌రూమ్‌కు లేదా తోటి మానవులకు సహాయం చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి జీవరాశిమీద ఆయన కరుణ పొంగిపొర్లింది.
జంతు సంక్షేమంపై దృష్టి సారించే ప్రతి ప్రయత్నానికి రతన్ టాటా మద్దతు ఇచ్చారు. ఎప్పుడూ కుక్కలతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉండేవారు. కోట్లాది మంది భారతీయులకు.. రతన్ టాటా దేశభక్తి సంక్షోభ సమయంలో స్పష్టంగా కనిపించిందని మోదీ వెల్లడించారు.
వ్యక్తిగతంగా చెప్పాలంటే.. గుజరాత్‌లో కొన్నేళ్లు ఆయనతో కలిసి సన్నిహితంగా కలిసి పనిచేశాను. అక్కడ అతను చాలా ఇష్టంతో అనేక ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టారు. కొన్ని వారాల క్రితం, నేను స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి C-295 విమానాలను తయారు చేసే ఒక ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించాము. ఇది ప్రారంభం కావడానికి రతన్ టాటా కృషి చాలా ఉందని మోదీ పేర్కొన్నారు.
Its been a month since we bid farewell to Shri Ratan Tata Ji. His contribution to Indian industry will forever continue to inspire. Here’s an OpEd I wrote which pays tribute to his extraordinary life and work. https://t.co/lt7RwVZEqe
— Narendra Modi (@narendramodi) November 9, 2024
నేను ఎప్పటికీ రతన్ టాటాను మర్చిపోను. పాలనకు సంబంధించిన విషయాలపైన, అయన ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు.. ఎన్నికల విజయాల తర్వాత తెలియజేసిన అభినందనలు.. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయని పీఎం మోదీ వెల్లడించారు.
ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలు
స్వచ్చ్ భారత్ మిషన్‌కు రతన్ టాటా ఇచ్చిన మద్దతు నా హృదయానికి దగ్గరగా ఉంది. భారతదేశ పురోగతికి పరిశుభ్రత చాలా ముఖ్యమని ఆయన భావించారు. అక్టోబరు ప్రారంభంలో స్వచ్ఛ భారత్ మిషన్ పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చేసిన వీడియో సందేశం నాకు ఇప్పటికీ గుర్తుందని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment