Ratan Tata follows 3 Politicians, 2 Actors on Twitter; check details - Sakshi
Sakshi News home page

ట్విటర్‌లో రతన్‌ టాటా ఫాలో అయ్యే యాక్టర్స్‌ ఎవరో తెలుసా?

Published Sat, Apr 1 2023 1:02 PM | Last Updated on Sat, Apr 1 2023 1:23 PM

Iconic RatanTata follows only 3 politicians 2 actors check details - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, దార్శనికుడు రతన్‌ టాటా ఆదర్శ జీవితానికి నిరాడంబ‌ర‌త‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం. అవ్వడానికే ఐకానిక్‌ పర్సనాలిటీ, బిలియనీరే కానీ, సింప్లిసిటీకి పెట్టింది పేరు. విలాసాలకు, ఆడంబరాలకు దూరంగా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు.

సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని ఆయనకు ఫాలోయర్ల సంఖ్య మిలియన్లలోనే. ట్విటర్‌లో 12.4 మిలియన్ల ఫాలోయర్లుండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో, 8.5 మిలియన్ల మంది ఫ్యాన్స్‌ ఉండటం విశేషం. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో టాటా ట్రస్ట్‌ను(1919లో స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్)ఫాలో అవుతున్నారు. 

(ఇదీ చదవండినీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లాంచ్‌: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్‌ )

రతన్ టాటా  ఫాలో  అవుతున్న  ఆ ముగ్గురు రాజకీయ నాయకుల్లో ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇంకొకరు ఆప్‌ నేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాగా, మూడవ వారు, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా ఉన్నారు. దీంతోపాటు  పీఎంవో ట్విటర్‌ హ్యండిల్‌, బ్రిటన్  పీఎంవో, అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ, కార్నెల్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, బ్లూమ్‌బెర్గ్‌లను కూడా ఫాలో అవుతారు. ముఖ్యంగా బాలీవుడ్‌ నటులు ప్రియాంక చోప్రా, బోమన్ ఇరానీని రతన్‌టాటా ఫోలో అవుతుండటం విశేషం. వివేక్ ఒబెరాయ్ 'పీఎం నరేంద్ర మోదీ' బయోపిక్‌లో బొమన్ ఇరానీ రతన్ టాటా పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. 

ఇంకా మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రా, సమీర్, ఆటో డిజైనర్ ఇయాన్ కల్లమ్, ప్రణయ్ రాయ్,సింగపూర్  పీఎం లీ సియన్ లూంగ్, ల్యాండ్ రోవర్ (అమెరికా) జాగ్వార్,  టాటా నానో, ఆటోకార్ ఇండియా, MIT మీడియా ల్యాబ్, BBC బ్రేకింగ్ న్యూస్, ఫైనాన్షియల్ టైమ్స్, ది ఎకనామిస్ట్, ది హిందూ, ఎన్ రామ్, వాల్ స్ట్రీట్ జర్నల్‌ ఆయన మనసు దోచిన ఖాతాలన్నమాట. (నోకియా సరికొత్త చరిత్ర: చందమామపై 4జీ నెట్‌వర్క్‌ త్వరలో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement