సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి కన్ను గీటుతూ కెమెరాల కంటపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్ను కొట్టడం ద్వారా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ మరోసారి కన్నుగీటుతూ కెమెరాలకు చిక్కారు. రఫేల్ ఒప్పందంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
రఫేల్‌పై చర్చలో ఏఐఏడీఎంకే ఎంపీ, డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతుండగా ఆయనను అభినందించిన రాహుల్ అనూహ్యంగా వేరొకరిని చూస్తూ కన్నుగీటారు. కాగా అంతకుముందు ఇదే అంశంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్నుగీటడం వంటి చర్యలపై క్షమాపణలు చెప్పారా అని రాహుల్‌ను నిలదీశారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల అనంతరం రాహుల్ మరోసారి కన్నుకొడుతూ కెమెరాల కంటపడ్డారు. రాహుల్ కన్నుగీటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment