winking
-
మళ్లీ కన్నుగీటిన రాహుల్
-
మళ్లీ కన్నుకొట్టిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి కన్ను గీటుతూ కెమెరాల కంటపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్ను కొట్టడం ద్వారా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ మరోసారి కన్నుగీటుతూ కెమెరాలకు చిక్కారు. రఫేల్ ఒప్పందంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రఫేల్‌పై చర్చలో ఏఐఏడీఎంకే ఎంపీ, డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతుండగా ఆయనను అభినందించిన రాహుల్ అనూహ్యంగా వేరొకరిని చూస్తూ కన్నుగీటారు. కాగా అంతకుముందు ఇదే అంశంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్నుగీటడం వంటి చర్యలపై క్షమాపణలు చెప్పారా అని రాహుల్‌ను నిలదీశారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల అనంతరం రాహుల్ మరోసారి కన్నుకొడుతూ కెమెరాల కంటపడ్డారు. రాహుల్ కన్నుగీటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మళ్లీ కన్నుగీటిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కౌగిలింతలు, కన్నుగీటడంతో వార్తల్లో నిలిచిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి కన్ను కొడుతూ కెమెరా కంటపడ్డారు. రాజస్తాన్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో పార్టీ రాష్ట్ర చీఫ్ సచిన్ పైలట్‌కు కన్ను గీటుతున్న దృశ్యం వీడియోలో రికార్డైంది. రాహుల్ కన్ను కొట్టిన మరుక్షణమే సచిన్ పైలట్ వేదిక మీదున్న మాజీ సీఎం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌ను కౌగిలించుకోవడం గమనార్హం. రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఐక్యతకు సంకేతంగా వేదికపై కౌగిలింతల సీన్ రక్తికట్టించారని చెబుతున్నారు. రాహుల్ ప్రసంగం ముగిసిన తర్వాత సైతం ఇరువురు నేతలను సన్నిహితంగా తీసుకువచ్చి ఇద్దరు నేతలు ఐక్యంగా ఉన్నారనే సంకేతాలు పంపేందుకు ప్రయత్నించారు. సభా వేదికపై రాహుల్‌కు ఇరువైపులా సచిన్ పైలట్, గెహ్లాట్‌లు ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. -
పార్లమెంటులో ధనుష్కోటి
ఈ మధ్య పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మాన ఘట్టం చాలా కారణాలకు మనదేశంలో చరిత్ర. ఈ రాజకీయ విశ్లేషకులు ఎంతసేపూ పక్కదారుల్లో పోతారు కానీ అసలు విషయాన్ని వదిలేస్తారు. మొదట విషయాలు మొదట చెప్పుకుందాం. రాహుల్ గాంధీ పార్లమెంటులో కన్ను కొట్టారు. నా మట్టుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆ పని చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో అంత తేజస్సును నేను చూడలేదు. బహుశా ఆయన కన్నుకొట్టినప్పుడు వారి ప్రత్యేకమైన సౌందర్యం బయట పడుతుందేమో విశ్లేషకులు పరిశీలించాలి. మహానుభావులు ఏ వివేకానందో, మహాత్ముని వంటివారో దేశానికి సందేశం ఇస్తున్నప్పుడు వారి ముఖాలు తేజస్సుతో వెలిగిపోవడం మనం చూస్తాం. కానీ రాహుల్ గాంధీగారిలో కుర్రతనం ఇంకా పోలేదనడానికి ఇది నిదర్శనం. తీరా అనుకున్న నాటకం ఇప్పటికి రసకందాయంలో పడింది అనడం ఈ కన్ను కొట్టాడానికి నిదర్శనమా? త్యాగరాజస్వామి ఒక కీర్తనలో ‘కోటినదులు ధనుష్కోటిలో నుండగ ఏటికి తిరిగెదవే మనసా’అని ప్రశ్నించారు. ఈ దేశంలో గంగ, యమున, కావేరి, గోదావరి – ఇలా వేర్వేరు నదులలో స్నానం అక్కరలేదు. కోటి నదుల సంగమం – ధనుష్కోటి– అన్నారు. రాహుల్ గాంధీ.. ఆ మధ్య ప్రధాని మోదీ ప్రపంచంలో అందరు నాయకుల్ని కావలించుకోవడం మీద విమర్శ చేశారు. మోదీగారి పని అనుచితంగా ఉన్నదంటూనే– తానూ అలాంటి పని చేయాలనే కోరిక వారి మనస్సులో ఉన్నదేమో. మరి పార్లమెంటులో ప్రధాని ధనుష్కోటి లాంటివారు. ఒక్కసారి వారిని కావలించుకుంటే అందరినీ కావలించుకున్నంత ఫలితం. దీనిని మర్యాద భంగంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు భావించరాదని నా ఉద్దేశం. నిజానికి ఇలాగే పార్లమెంటులో చాలామంది నాయకులకు మోదీగారి విషయంలో రకరకాల తీరని కోరికలుండవచ్చు. వాటిని బయటపెట్టడం ఎలాగో తెలీక మదనపడుతూ ఉండవచ్చు. ఉదాహరణకి శరద్ యాదవ్‌కి మోదీ గెడ్డం గోకాలనిపించవచ్చు. లాలూకి మోదీ కడుపులో పొడిచి పలుకరించాలని కోరిక ఉండవచ్చు. ఢిగ్గీ రాజాకి మోదీ బుగ్గలు పుణకాలని, గురుమీత్ సింగ్ అహుజాకి వీపుమీద తట్టాలని, శివప్రసాద్‌కి వారి జుత్తు సవరించాలని ఇలా వీరికి మార్గదర్శకమైన ఘనత రాహుల్ గాంధీది. ఈ చర్యని పురస్కరించుకుని మిగతా నాయకులకి కూడా అవకాశాన్ని కల్పించాలని నాకనిపిస్తుంది. పార్లమెంటు సమావేశానికి ముందు మోదీని హాలు మధ్యలో నిలిపి ఆయా నాయకుల కోరికలు సాధికారికంగా జరిపిం చాలని స్పీకర్‌గారికి నా వినతి. మొన్న రాహుల్ గాంధీ తన ఔదార్యం చూపారు. ‘‘మీరు నన్ను పప్పు అని పిలవండి. కోపం తెచ్చుకోండి. తిట్టండి. కొట్టండి. మీమీద నాకు కోపం లేదు. రాదు’’ అంటూనే సరాసరి మోదీ సీటు దగ్గరికి చరచరా నడిచి వచ్చారు. పార్లమెంటులో ఎవరికీ ఈ చర్యకి కారణమేమిటో అర్థం కాలేదు. నా మట్టుకు ఈ మధ్యకాలంలో అంత మనస్ఫూర్తిగా కావలించుకున్న సందర్భాన్ని చూడలేదు. అయితే ఇందులో ఏ పాత్రికేయుడూ గుర్తించని ఒక సంఘటన ఉంది. తీరా ఎవరూ ఊహించని రీతిలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని వాటేసుకున్నాక, మోదీ కూడా చూస్తున్న మనందరిలాగే ఒక్క క్షణం బిత్తరపోయినా వెంటనే తేరుకుని, వెళ్లిపోతున్న రాహుల్ గాంధీని వెనక్కి పిలిచారు. రాహుల్ వెళ్లగానే మోదీ తన భుజం తట్టారు. ఆ చిన్న వ్యవధిలో మోదీ చెప్పిన మాటలు ఏమై ఉంటాయి? ఇదీ విశ్లేషకులు పట్టుకోవలసిన అంశం. నా అనుభవాన్ని పురస్కరించుకుని నాలుగయిదు ఊహాగానాలు చేస్తున్నాను. ‘‘వెకిలి వేషాలు వద్దు పప్పూ.. దేశం చూస్తోంది.’’ ‘‘శభాష్! రాజకీయాల్లో మీ అమ్మనీ, నాన్ననీ, మామ్మనీ మరిపించావయ్యా’’ ‘‘ఈ చర్చ మాటల సభ. డ్రామా స్టేజీ కాదు బాబు’’ ‘‘పార్లమెంటుని పది జనపత్ స్థాయికి ఈడ్వకు బాబు, నేను కాంగ్రెస్ చెక్కభజనకారుడిని కాదు’’ ఇలాంటి మాటేదో అని ఉంటారని నా ఉద్దేశం. పార్లమెంటుని పక్కింటి పున్నయ్యతోనో, వెనకింటి వెంకయ్యతోనో ’రచ్చబండ పిచ్చాపాటీ’ చేయబోయిన కన్నుకొట్టే ’చంటివాడికి’ అంత తక్కువ వ్యవధిలో అనుకోకుండా భుజం తట్టి పాఠం చెప్పడం అనూహ్యమైన విషయం. అపభ్రంశానికి సమయస్ఫూర్తి సరైన ఠంకం. నాటకానికి వాస్తవం ఎప్పుడూ చుక్కెదురు. - గొల్లపూడి మారుతీరావు -
కౌగిలింత.. కన్నుకొట్టడం... ఏంటది?
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన పని.. చర్చనీయాంశంగా మారింది. ప్రసంగం ముగిశాక ప్రధాని మోదీ వద్దకు వెళ్లిమరీ కౌగిలించుకుని, షేక్ హ్యాండ్ ఇవ్వటం.. ఆపై తన కుర్చీలో కూర్చుని కన్నుకొట్టడం.. సోషల్ మీడియా మొత్తం అదే చర్చ నడిచింది. సభా వేదికగా జరిగిన ఈ ఊహించని పరిణామంతో ప్రధానితోసహా సభలో ఉన్నవాళ్లంతా విస్మయం వ్యక్తం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా రాహుల్ చేసిన పనిని తప్పుబట్టారు. ఇక ఈ వ్యవహారంపై యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కూడా తనయుడు రాహుల్‌ను ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఓటింగ్ ముగిశాక బయటకు వచ్చే క్రమంలో రాహుల్‌ను పిలిపించుకుని ఆమె ఓ ఐదు నిమిషాలు మాట్లాడారని, అలా చేయటానికి గల కారణాలను గట్టిగానే నిలదీశారంట. ఈ మేరకు రాహుల్ కూడా వివరణ ఇచ్చుకున్నట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ శనివారం ఓ కథనం ప్రచురించింది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ కథనాన్ని తోసిపుచ్చుతూ.. అధ్యక్షుడు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది స్క్రిప్ట్కాదని ‘జ్యోతిరాదిత్య సింధియా’ చెబుతుండగా.. రణ్‌దీప్ సూర్జెవాలా స్పందిస్తూ... ‘రాహుల్ గాంధీ చేసిన పనికి బీజేపీ ఎందుకంతలా ఊగిపోతుందని’ ప్రశ్నించారు. ‘అదో మ్యాజికల్ హగ్. ద్వేషాలను దూరం చేసేందుకు రాహుల్ అలా చేశారు. అది అప్పటికప్పుడు అలా వచ్చేసింది. దీనిపై రాజకీయం చేయటం సరికాదు’ అని రణ్‌దీప్ తెలిపారు. ఇక రాహుల్ చేసిన పనితో చిప్కో ఉద్యమం గుర్తొచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేయటం తెలిసిందే. బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్.. రాహుల్ డ్రామా బాగుందని.. బాలీవుడ్లో చేరితే ఇంకా బావుంటుందని సలహా ఇస్తున్నారు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో.. అదేం గ్యాలెరీ షో కాదని, ప్రధానితో పరాచికాలు చేయటం నైతికత అనిపించుకోదని వ్యాఖ్యానించారు. నటనకు నటనే సమాధానం అని వామపక్ష పార్టీకి చెందిన ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. -
ప్రియా ప్రకాష్‌తో పోటీపడిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆయనపై నిప్పులు కురిపించారు. ఆవేశంలో కొన్నిసార్లు తడబడ్డారు కూడా. అప్పుడు మోదీ చిద్విలాసంగా నవ్వుతూ కనిపించారు. తడబాటును సర్దుకుంటూ చివరికంటా ఉద్రేకపూరితంగా మాట్లాడిన రాహుల్ చివరలో తనకు ఎవరి పట్ల విద్వేషం లేదని, అందరిని ప్రేమిస్తానని చెప్పి సరాసరి మోదీ వద్దకు వెళ్లారు. ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తన సీటులోకి వచ్చి కూర్చున్నారు. ఎలా ఉంది నా ప్రసంగం ? అన్నట్లు పక్కన ఎవరినో చూస్తూ కన్నుగీటారు. ఈ సన్నివేశం సభలో వేడిని తగ్గించి నవ్వులను పూయించగా ట్విట్టేరియన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. వారిలో ఒకరు.. కొద్దిరోజుల క్రితం అందరిని అలరించిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటుతో రాహుల్ కన్నుగీటును కలిపి పోస్ట్ చేయడం విశేషంగా ఆకర్షిస్తోంది. లోక్‌సభలో రాహుల్ గాంధీ కన్నుగీటిన వార్త విని ప్రియా ప్రకాష్ వారియర్ హర్షం వ్యక్తం చేశారు. తనకెంతో పేరు తెచ్చిన విన్యాసాన్ని రాహుల్ ప్రదర్శించడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు. జాదు కీ జప్పీ కాపీ కొట్టారా? ఆప్యాయంగా కౌగిలింకుంటే విద్వేషాలు తగ్గుతాయని, శాంతమూర్తులుగా మారతారని మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని భావనను రాహుల్ గాంధీ కాపీ కొట్టారని కొంత మంది వ్యాఖ్యానించారు. మోదీని ఎలుగుబంటి కౌగిలి ఇచ్చిన రాహుల్ గాంధీ ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచారు. కాగా, మోదీ అనుమతి లేకుండా బలవంతంగా వాటేసుకున్న రాహుల్‌పై కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు. ఇందుకే రాహుల్‌ను ‘పప్పు’ అంటున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘పప్పు’ హ్యాష్‌టాగ్ కూడా ట్విటర్ ట్రెండింగ్ కావడం కొసమెరుపు. -
మరోసారి ఫిదా చేసిన ప్రియ
‘ప్రియాప్రకాష్ వారియర్’... ఇప్పుడు ఈ పేరుకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇంతవరకూ ప్రియావారియర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ స్టార్ హీరోలకు ధీటుగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది. ఇదంతా ఒకే ఒక్క ‘కన్నుగీటు’ మహిమ. ఈ మధ్యే ప్రియ పోస్టు చేసిన ఒక ఫోటో చూస్తే ఎంత ముద్దుగా ఉంది అనిపించకమానదు. ఒక చిన్న పప్పి(చిన్న కుక్కపిల్ల)కి ఉండేలాంటి చెవులు, ముక్కును తన ఫోటోకు జతచేసి ఉన్న ఫోటోనొకదాన్ని ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ ఫోటోకు ‘ఎవరైనా నాకు ఆహారం పెట్టడానికి నిరాకరిస్తే’.. అనే క్యాప్షన్‌ను పెట్టింది. పాపం పప్పికి ఆహారం పెట్టకపోతే అది ఎంత అమాయకంగా చూస్తుందో ప్రియ కూడా అలాంటి హావభావాలనే ప్రదర్శించింది. ఈ ఫోటో చూసిన వారికి ఎవరికైనా సరే అబ్బా ఎంత ముద్దుగా.. ఉందో అన్పిస్తుంది. కొన్ని రోజుల కిందటే ప్రియ తన సహనటులు రోషన్ అబ్దుల్ రహూఫ్, వైశాక్ పవనన్, సియాద్ షాజహాన్‌లతో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరయ్యింది. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ నటిస్తున్న మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ జూన్ 14న విడుదలకానుంది. ఒమర్ లులు ఈ చిత్ర దర్శకుడు. -
మరోసారి కన్నుగీటిన ప్రియా వారియర్
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రేటీ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. కుర్రకారు ఇంకా ఆ మైకం నుంచి తేరుకోకమునుపే మరోసారి కన్నుగీటి యూట్యూబ్‌లో రద్దీని పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకు ముందు ప్రియ కన్నుగీటింది ఒక సినిమా కోసమైతే ప్రస్తుతం మాత్రం కన్నుగీటింది ఒక ప్రకటన కోసం. ఒక ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ తమ కంపెనీ ఉత్పత్తుల కోసం ప్రియా ప్రకాశ్ వారియర్‌తో ఒక ప్రకటనను రూపొందించింది. మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో విడుదలవుతున్న ఈ ప్రకటనలో ప్రియ మరోసారి కన్నుగీటి కుర్రకారు మతి పోగొట్టింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రియ నటించిన ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ఆమె కన్నుగీటుకి కుర్రకారు ఫిదా అయిన విషయం తెలిసిందే. గత వీడియోతో పోల్చితే ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో తక్కువ వ్యూస్‌నే పొందింది. ‘ఒరు ఆదర్ లవ్’ సినిమా జూన్‌లో విడుదల కానుంది. -
‘అమ్రపాలి’ని కాపీ కొట్టిన ప్రియా వారియర్?
ఒక్క కనుసైగతో కుర్రకారు మతి పొగొట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్. సినిమా విడుదలవ్వక ముందే తన హావభావాలతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రియా వారియర్ కన్నుగీటే ఈ సన్నివేశం ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ‘మణిక్య మలరాయ పూవి’ పాటకు సంబంధించినది. ఈ వీడియోలో ప్రియ కన్నుగీటే హవభావలతో స్టార్ హీరోలను సైతం ఆకట్టుకుంది. అయితే ఈ కన్నుగీటే దృశ్యాన్ని మూడు సంవత్సరాల క్రితం ప్రియ కంటే ముందే ఒక భోజపూరి నటి చేసింది. ఆ నటి భోజ్‌పూరికి చెందిన అమ్రాపాలి దూబే. ఆ సన్నివేశం అమ్రపాలి దూబే, దినేశ్ లాల్ యాదవ్ నిరావ్ నటించిన ‘రాజు భాయ్’ సినిమాలోని ‘మాతా ఫెయిల్ హో జైల్’ పాటలో ఉంది. 2015లో విడుదలయిన ‘ఈ రాజు భాయి’ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఒరు ఆదర్ లవ్‌లో ప్రియ కన్నుగీటే దృశ్యానికి, అమ్రపాలి చేసిన కన్నుగీటినదానికి చాలా పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దీంతో అమ్రపాలిని ప్రియా ప్రకాశ్ వారియర్ కాపీ కొట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఒమర్ లూలు దర్శకత్వం వహిస్తున్న ఒరు ఆదర్ లవ్ రోమాంటిక్ డ్రామా. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు సియార్ షాజహాన్, రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షరీఫ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆమె కన్నుగీటితే.. అంతా ఇలా విలవిలలాడాల్సిందే!
ఎవరినీ విడిచిపెట్టలేదు. ఆమె కన్నుగీటితే.. ఎవరూ మాత్రం సిగ్గుపడకుండా ఉంటారు. ఎవరు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వకుండా ఉంటారు. ఎవరు మాత్రం ఆమె కనుసైగల సెగలు తగలకుండా రాతిబొమ్మలుగా ఉండిపోగలరు. అందుకే మన నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు రాహుల్ గాంధీ వరకు.. అటు సినీ రంగంలో రజనీ మొదలు రానా వరకు అందరినీ ప్రియాప్రకాశ్ వారియర్ కనుసైగల వాలుచూపుల పరిధిలోకి తీసుకొచ్చారు. ఆమె కన్నుగీటితే.. వారు ఎలా స్పందిస్తారో చూపిస్తూ.. స్పూఫ్ వీడియోలు వదిలారు. ఇప్పుడు ఈ వీడియోలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రియా కన్నుగీటితే.. బ్రహ్మచారి రాహుల్‌గాంధీ ముసిముసి నవ్వులు రువ్వుతూ.. లోలోపల సిగ్గుపడుతున్నట్టు ఉన్న స్పూఫ్ నెటిజన్లను తెగ అలరిస్తోంది. ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో అరంగేట్రం చేస్తున్న ప్రియా ప్రకాశ్.. 40 సెకన్ల నిడివి ఉన్న కనుసైగల వీడియోతో ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. గన్నులాంటి కన్నులతో ఆమె కన్నుగీటినా.. తాజా టీజర్లో తూటాలాంటి ఫ్లయింగ్ కిస్‌తో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా.. యువత అమాంతం ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఇప్పటికే మిలియన్‌కుపైగా ఫాలోవర్లు యాడ్ అయ్యారు. పలువురిపై వచ్చిన స్ఫూప్ వీడియోలు ఇవే.. Kya yahi pyaar hai? pic.twitter.com/FL5r13eekI — East India Comedy (@EastIndiaComedy) February 11, 2018 .@realDonaldTrump babu Ye aap kis line me aa gaye bhai? 😂 pic.twitter.com/mlj2TFUQPi — Err.. (@Gujju_Er) February 11, 2018 who tf did this 😭😂 pic.twitter.com/87SlMPWhre — ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤㅤ ㅤ ㅤ ㅤ (@firkiii) February 11, 2018 Mahi ❤❤❤❤ #PriyaPrakashVarrier pic.twitter.com/KTrnCkkQ47 — Shash (@pokershash) February 11, 2018 -
విద్యార్థిని వేధించిన యువకుడు అరెస్టు
బెంగళూరు: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ఇక్కడి ఉప్పరపేట పోలీసులు అరెస్ట్ చేశారు. శివమెగ్గకు చెందిన విశ్వనాథ్ (22)ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. శుక్రవారం అర్థరాత్రి విశ్వనాథ్ స్నేహితులతో కలిసి ఎస్సీ రోడ్డులోని హోటల్‌కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ భోజనం చేస్తున్న 20 ఏళ్ల యువతితో సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కామాంధుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారణ చేస్తున్నామని శనివారం ఉప్పరపేట పోలీసులు తెలిపారు.