సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రేటీ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. కుర్రకారు ఇంకా ఆ మైకం నుంచి తేరుకోకమునుపే మరోసారి కన్నుగీటి యూట్యూబ్‌లో రద్దీని పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకు ముందు ప్రియ కన్నుగీటింది ఒక సినిమా కోసమైతే ప్రస్తుతం మాత్రం కన్నుగీటింది ఒక ప్రకటన కోసం. ఒక ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ తమ కంపెనీ ఉత్పత్తుల కోసం ప్రియా ప్రకాశ్ వారియర్‌తో ఒక ప్రకటనను రూపొందించింది.
మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో విడుదలవుతున్న ఈ ప్రకటనలో ప్రియ మరోసారి కన్నుగీటి కుర్రకారు మతి పోగొట్టింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రియ నటించిన ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ఆమె కన్నుగీటుకి కుర్రకారు ఫిదా అయిన విషయం తెలిసిందే. గత వీడియోతో పోల్చితే ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో తక్కువ వ్యూస్‌నే పొందింది. ‘ఒరు ఆదర్ లవ్’ సినిమా జూన్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment