
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కౌగిలింతలు, కన్నుగీటడంతో వార్తల్లో నిలిచిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి కన్ను కొడుతూ కెమెరా కంటపడ్డారు. రాజస్తాన్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో పార్టీ రాష్ట్ర చీఫ్ సచిన్ పైలట్‌కు కన్ను గీటుతున్న దృశ్యం వీడియోలో రికార్డైంది.
రాహుల్ కన్ను కొట్టిన మరుక్షణమే సచిన్ పైలట్ వేదిక మీదున్న మాజీ సీఎం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌ను కౌగిలించుకోవడం గమనార్హం. రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఐక్యతకు సంకేతంగా వేదికపై కౌగిలింతల సీన్ రక్తికట్టించారని చెబుతున్నారు.
రాహుల్ ప్రసంగం ముగిసిన తర్వాత సైతం ఇరువురు నేతలను సన్నిహితంగా తీసుకువచ్చి ఇద్దరు నేతలు ఐక్యంగా ఉన్నారనే సంకేతాలు పంపేందుకు ప్రయత్నించారు. సభా వేదికపై రాహుల్‌కు ఇరువైపులా సచిన్ పైలట్, గెహ్లాట్‌లు ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment