
భోజపూరి నటి అమ్రపాలి, ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫైల్ ఫోటో)
ఒక్క కనుసైగతో కుర్రకారు మతి పొగొట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్. సినిమా విడుదలవ్వక ముందే తన హావభావాలతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రియా వారియర్ కన్నుగీటే ఈ సన్నివేశం ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ‘మణిక్య మలరాయ పూవి’ పాటకు సంబంధించినది. ఈ వీడియోలో ప్రియ కన్నుగీటే హవభావలతో స్టార్ హీరోలను సైతం ఆకట్టుకుంది.
అయితే ఈ కన్నుగీటే దృశ్యాన్ని మూడు సంవత్సరాల క్రితం ప్రియ కంటే ముందే ఒక భోజపూరి నటి చేసింది. ఆ నటి భోజ్‌పూరికి చెందిన అమ్రాపాలి దూబే. ఆ సన్నివేశం అమ్రపాలి దూబే, దినేశ్ లాల్ యాదవ్ నిరావ్ నటించిన ‘రాజు భాయ్’ సినిమాలోని ‘మాతా ఫెయిల్ హో జైల్’ పాటలో ఉంది. 2015లో విడుదలయిన ‘ఈ రాజు భాయి’ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.
ఇప్పుడు ఒరు ఆదర్ లవ్‌లో ప్రియ కన్నుగీటే దృశ్యానికి, అమ్రపాలి చేసిన కన్నుగీటినదానికి చాలా పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దీంతో అమ్రపాలిని ప్రియా ప్రకాశ్ వారియర్ కాపీ కొట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఒమర్ లూలు దర్శకత్వం వహిస్తున్న ఒరు ఆదర్ లవ్ రోమాంటిక్ డ్రామా. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు సియార్ షాజహాన్, రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షరీఫ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment