‘ప్రియాప్రకాష్ వారియర్’... ఇప్పుడు ఈ పేరుకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇంతవరకూ ప్రియావారియర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ స్టార్ హీరోలకు ధీటుగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది. ఇదంతా ఒకే ఒక్క ‘కన్నుగీటు’ మహిమ. ఈ మధ్యే ప్రియ పోస్టు చేసిన ఒక ఫోటో చూస్తే ఎంత ముద్దుగా ఉంది అనిపించకమానదు.
ఒక చిన్న పప్పి(చిన్న కుక్కపిల్ల)కి ఉండేలాంటి చెవులు, ముక్కును తన ఫోటోకు జతచేసి ఉన్న ఫోటోనొకదాన్ని ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ ఫోటోకు ‘ఎవరైనా నాకు ఆహారం పెట్టడానికి నిరాకరిస్తే’.. అనే క్యాప్షన్‌ను పెట్టింది. పాపం పప్పికి ఆహారం పెట్టకపోతే అది ఎంత అమాయకంగా చూస్తుందో ప్రియ కూడా అలాంటి హావభావాలనే ప్రదర్శించింది. ఈ ఫోటో చూసిన వారికి ఎవరికైనా సరే అబ్బా ఎంత ముద్దుగా.. ఉందో అన్పిస్తుంది. కొన్ని రోజుల కిందటే ప్రియ తన సహనటులు రోషన్ అబ్దుల్ రహూఫ్, వైశాక్ పవనన్, సియాద్ షాజహాన్‌లతో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరయ్యింది. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ నటిస్తున్న మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ జూన్ 14న విడుదలకానుంది. ఒమర్ లులు ఈ చిత్ర దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment