
ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్‌కు చాలా క్రేజ్ ఉంది. ఏదైనా పోస్ట్ వైరల్‌గా మారాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయాల్సిందే. అయితే ఎన్ని పోస్ట్‌లు పెట్టినా రీచ్ ఎక్కువగా రావడం లేదనుకునేవారికి ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సేరి కొన్ని చిట్కాలు చెబుతూ వీడియో పోస్ట్ చేశారు. అదికాస్త వైరల్‌గా మారింది.
ఆయన వీడియోలో మాట్లాడుతూ..‘సాధారణంగా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో లేదా ఫొటో వైరల్‌గా మారాలని కోరుకుంటాం. మన కంటెంట్ ఎక్కువ మందికి చేరాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఏదైనా కంటెంట్‌ను పోస్ట్ చేసి అలా వదిలేయకుండా నిత్యం కామెంట్లను పరిశీలిస్తుండాలి. మన ఫాలోవర్లు, ఇతరులు మన కంటెంట్ తీరుపై చాలా విలువైన కామెంట్లు చేస్తారు. వారీ ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం చేసుకుని దానికి తగిన కంటెంట్‌ను ఇవ్వడానికి ప్రయత్నించాలి. పోస్ట్ అప్‌లోడ్ చేసిన తర్వాత కనీసం రెండు వారాలపాటు కామెంట్లను ట్రాక్ చేయాలి. వాటికి తగిన రిప్లై ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment