
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై పెనుదుమారం రేగుతున్న క్రమంలో ఈ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. భారత్- ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందం అంతర్జాతీయ స్ధాయిలో రచ్చకెక్కడంతో జేపీసీ విచారణ జరిపిస్తేనే ఒప్పందంలోని అంశాలు వెలుగుచూస్తాయని చెప్పారు.
రాఫెల్ ఒప్పందంలో భారత ప్రభుత్వ సూచనతోనే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండ్ స్పష్టం చేయడంతో ఈ ఒప్పందం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
హోలాండ్ ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస చీఫ్ రాహుల్ గాంధీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని దొంగ, అవినీతిపరుడని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment