ఫ్రాన్స్ కంపెనీతో రిలయన్స్ భారీ డీల్
ముంబై: ఫ్రాన్స్‌తో రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన భారీ ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజం డస్సాల్ట్ ఏవియేషన్‌తో దేశీ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం ' డస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్' పేరుతో భాగస్వామ్య సంస్థ (జాయింట్ వెంచర్) ను ఏర్పాటు చేయనున్నాయి. రూ. 30,000 కోట్ల విలువైన ఆఫ్‌సెట్ కాంట్రాక్ట్ లను ఈ జేవీ చేపట్టనున్నట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రా వెల్లడించింది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కొత్త పథకం ఐడీడీఎం ప్రాజెక్టు (స్వదేశీపరిజ్ఞానంతోనే రూపకల్పన అభివృద్ధి మరియు ఉత్పత్తి)ను డసాల్ట్, రిలయన్స్ మధ్య ప్రతిపాదిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రమోట్ చేయనుంది.
భారతదేశంలో తమ జాయింట్ వెంచర్ ఏర్పాటు పై డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్, రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ ధీరూభాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యూహాత్మక పారిశ్రామిక భాగస్వామ్యాల అభివృద్దిలో కట్టుబడి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం మేక్ ఇండియా పాలసీకి తమ జాయింట్ వెంచర్ మరింత దోహదం చేస్తుందని డసాల్డ్ సీఈవో వ్యాఖ్యానించారు. ఎరిక్ ట్రాపియర్ లాంటి అధ్బుతమైన ప్రపంచ నాయకుడితో భాగస్వామ్యం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. ఇది భారత ఏరోస్పేస్ రంగం లో ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్ అని తెలిపారు. అలాగే అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ కూడా ఈ జేవీ ద్వారా లబ్ది పొందనున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. దీంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేరు, రిలయన్స్ డిఫెన్స్ ఈనాటి మార్కెట్లో భారీ డిమాండ్ నెలకొంది. మరోవైపు ప్రయివేట్ డిఫెన్స్ ఇండస్ట్రీలో దేశంలో ఇదే అతిపెద్ద ఆఫ్ సెట్ ఒప్పందమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా రూ.58 వేల కోట్లతో 36 యుద్ధ విమానాల కొనుగోలుకుగత నెలలో ఒప్పందం కురింది. ఈ ఒప్పందంపై భారతదేశ రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి జీన్ యవెస్ లెడ్రియన్ ఢిల్లీలో సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.