
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి
తెలంగాణలో అమానవీయ ఘటనలపై మీ స్పందన ఏమిటంటూ ‘ఎక్స్’లో ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్ చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించా లని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయా న్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా అని ప్ర శ్నించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. ‘ఒక రి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్ర యులుగా మార్చటం అమానవీయం, అన్యాయం అని గతంలో మీరే అన్నారు. ఇప్పుడు తెలంగాణలో పేదల ఇళ్లను అదే రీతిలో కూల్చే స్తూ వారిని నిరాశ్రయులు చేస్తు న్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? ‘ అని ప్రశ్నించారు.
పేదల జీవితాలను ఆగం చేస్తోన్న కాంగ్రెస్
మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన సంఘటనను ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చి వేసిన 75 ఇళ్లలో 25 నివాసాలు వికలాంగులకు చెందినవేనని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటమనేది చట్టపరంగా సరైన విధానం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం నుంచే ఇళ్లు కట్టుకొని నివాసం ఉన్న పేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయడం ఎంతటి అమానవీయమో ఖర్గే చెప్పాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను కాంగ్రెస్ ప్రభు త్వం ఆగం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment