
తిరుమల: కర్ణాటకలోని పంపా క్షేత్రంలోని కిష్కింధలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుని జన్మస్థలంగా తమ వాదన నిరూపితమవుతుందని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన తిరుమలలోని గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడారు.
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ పండితులతో హనుమంతుని జన్మస్థలం నిర్ధారణపై చర్చించనున్నామని తెలిపారు. ఇప్పటికే టీటీడీ హనుమంతుని జన్మస్థలం శేషాచలం వెంకటాద్రిలోని అంజనాద్రి పర్వతమేనని నిర్ధారించిన విషయం విదితమే. కాగా, వాదన ముగిసిన అనంతరం టీటీడీ పాలకమండలి సభ్యులను, టీటీడీ ఉన్నతాధికారులను పంపా క్షేత్రంలోని హనుమంతుని జన్మస్థానమైన అంజనాద్రి పర్వతం వద్దకు తీసుకెళతామని స్వామీజీ చెప్పారు.
చదవండి:
అమ్మానాన్నా లేకున్నా నేనున్నా...
కరోనా 'చింత' లేని గిరిజనగూడెం
Comments
Please login to add a commentAdd a comment