సాక్షి, తిరుపతి: అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని మరోసారి టీటీడీ పునరుద్ఘాటించింది. హనుమాన్ జన్మస్థలంపై టీటీడీ శనివారం మీడియా సమావేశంలో హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని పండితులు తేల్చి చెప్పారు. విమర్శకులపై టీటీడీ పండితులు మండిపడ్డారు. తమకు లభించిన ఆధారాలు, శాసనాల ప్రకారమే ప్రకటన చేశామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
సంస్కృతం, పురాణాలు తెలియనివాళ్లకు మాట్లాడేహక్కు లేదన్నారు. ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే తమతో చర్చకు రావొచ్చని ఈవో తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో అంజనాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. అబద్ధాలను చెప్పాల్సిన అవసరం టీటీడీకి లేదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment