సాక్షి, తిరుపతి: హనుమంతుడి జన్మస్థలంపై సందిగ్థత నెలకొన్న సంగతి తెలిసిందే. దీని మీద గురువారం టీటీడీ-హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మధ్య చర్చలు జరిగినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మురళీధర శర్మ మాట్లాడుతూ.. ‘‘తిరుమలలోని జాపాలి తీర్థమే హనుమ జన్మస్థలం.ఇతిహాసాలు, చారిత్రక, శాసన ప్రమాణాల ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించాం. దీనిపై గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. సన్యాసిగా ఉండి.. మాట్లాడకూడని పదాలతో లేఖ రాశారు’’ అని తెలిపారు.
‘‘టీటీడీ ఇచ్చిన ఆధారాలలో ఏ ఒక్కటి తప్పని నిరూపించలేకపోయారు. గోవిందానంద సరస్వతి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం మాట్లాడారు.కుప్ప విశ్వనాథశర్మ మధ్యవర్తిగా శాస్త్ర చర్చ జరిగింది... గోవిందానంద స్వామి వితండవాదం చేస్తున్నారు’’ అన్నారు మురళీధర శర్మ.
Comments
Please login to add a commentAdd a comment