తిరుమల: హనుమంతుని జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని నిర్ధారించడాన్ని తప్పుబడుతూ కర్ణాటకలోని కిష్కింధలోని హనుమద్ జన్మభూమి తీర్థట్రస్టు (ఆర్) చేసిన ఆరోపణలు నిరాధారమైనవని టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆక్షేపించారు. హనుమంతుని జన్మస్థలం ముమ్మాటికీ కర్ణాటకలోని తుంగభద్ర తీరంలో ఉన్న కిష్కింద పర్వతమేనని హనుమద్ జన్మభూమి తీర్థట్రస్టు ఇటీవల టీటీడీకి లేఖ రాసింది. ఈ మేరకు శనివారం హనుమద్ జన్మభూమి ట్రస్టు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ లేఖకు టీటీడీ ప్రత్యుత్తరాన్ని పంపినట్టు పేర్కొన్నారు.
టీటీడీ ఏర్పాటు చేసిన పండిత పరిషత్తు నాలుగు నెలలపాటు పరిశోధించిన పౌరాణిక, శాసన, భౌగోళిక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలమని నిరూపించి నిర్దిష్ట నివేదిక సమర్పించిందన్నారు. హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తమ నివేదికను ఈ లేఖతో పాటు పంపుతున్నామని, తమ ఆధారాలు అసత్యాలు ఎలా అవుతాయో నిరూపిస్తూ ఈనెల 20లోపు నివేదికను సమర్పించాలని కోరారు. అదే సమయంలో టీటీడీపై చేసిన దూషణలకు బేషరతుగా క్షమాపణలు రాతపూర్వకంగా తెలపాలని కోరారు.
చదవండి: హన్మంతుని జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ
ఆంజనేయుడు మనవాడే
Comments
Please login to add a commentAdd a comment