birthplace
-
హనుమ జన్మస్థలంపై వివాదం అనవసరం
తిరుమల: తిరుమలలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి జన్మస్థలమని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉందని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, వివాదం అనవసరమని చెప్పారు. టీటీడీ శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ‘హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి’ అంశంపై శుక్రవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్ ప్రారంభమైంది. భారతీ మహాస్వామి వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడుతూ కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా చెప్పుకుంటున్నామన్నారు. బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందన్నారు. దీంతో పాటు అనేక పురాణాల్లో అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని పేర్కొన్నట్లు వివరించారు. కిష్కిందకు శాస్త్ర, పురాణ ప్రమాణాలు లేవని, సంస్కృతం, పురాణం, శాస్త్రాలు తెలియని వారికి ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అర్హత ఉండదన్నారు. నమ్మకం కుదిరాకే ప్రకటించాం: ఈవో జవహర్‌రెడ్డి టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ, తాను ఈవోగా బాధ్యతలు తీసుకున్న రెండు నెలలకే అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమనే విషయం గురించి పలువురు మెయిల్స్ ద్వారా సూచనలు చేశారని చెప్పారు. పలువురు ప్రముఖ పండితులతో మాట్లాడితే ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వారు వివరించినట్టు తెలిపారు. వీటిపై నమ్మకం కుదిరాకే 2020 డిసెంబర్లో పండిత పరిషత్ ఏర్పాటు చేసినట్లు ఈవో వెల్లడించారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానించినట్లు తెలిపారు. ఒకరిద్దరు అభ్యంతరాలు తెలపడానికి వస్తే చర్చ పెట్టామని, వారు మాట్లాడిన భాష, వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉండడంతో వారితో ఇక మాట్లాడలేదన్నారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆక్స్ఫర్డ్ పుస్తకంలోనూ ఆధారాలు: మాడభూషి శ్రీధర్ మహీంద్రా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల డీన్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, రామాయణం జరిగిందనడానికి ధనుష్కోటిలోని రామసేతు వంతెనలాంటి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని టీటీడీ తీసుకున్న పురాణ ఆధారాలు చాలా బాగున్నాయన్నారు. 2007లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ముద్రించిన ‘హనుమాన్ కేం’ పుస్తకంలోనూ అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని రాశారన్నారు. టీటీడీ కంటే కొన్ని దశాబ్దాల ముందే చాలామంది ఈ విషయం రాశారని తెలిపారు. ప్రపంచానికి తెలియాలనే వెబినార్: మురళీధరశర్మ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి, టీటీడీ పండిత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య వి.మురళీధరశర్మ మాట్లాడుతూ, అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిర్ధారించడానికి పండిత పరిషత్ పరిశోధన ప్రపంచానికి తెలియాలనే వెబినార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలు సేకరించి సమగ్ర పుస్తకం ముద్రిస్తామన్నారు. జీవా డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగరామానుజాచార్యులు, పుణె దక్కన్ కాలేజీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య వెంపటి కుటుంబరావు శాస్త్రి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె.మునిరత్నం, ఆచార్య శంకరనారాయణ, ఆర్కియాలజీ, మ్యూజియం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ విజయకుమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఎ.ప్రసన్నకుమార్, విశ్రాంత సంస్కృతోపన్యాసకులు తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు తగదు
తిరుమల: హనుమంతుని జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని నిర్ధారించడాన్ని తప్పుబడుతూ కర్ణాటకలోని కిష్కింధలోని హనుమద్ జన్మభూమి తీర్థట్రస్టు (ఆర్) చేసిన ఆరోపణలు నిరాధారమైనవని టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆక్షేపించారు. హనుమంతుని జన్మస్థలం ముమ్మాటికీ కర్ణాటకలోని తుంగభద్ర తీరంలో ఉన్న కిష్కింద పర్వతమేనని హనుమద్ జన్మభూమి తీర్థట్రస్టు ఇటీవల టీటీడీకి లేఖ రాసింది. ఈ మేరకు శనివారం హనుమద్ జన్మభూమి ట్రస్టు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ లేఖకు టీటీడీ ప్రత్యుత్తరాన్ని పంపినట్టు పేర్కొన్నారు. టీటీడీ ఏర్పాటు చేసిన పండిత పరిషత్తు నాలుగు నెలలపాటు పరిశోధించిన పౌరాణిక, శాసన, భౌగోళిక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలమని నిరూపించి నిర్దిష్ట నివేదిక సమర్పించిందన్నారు. హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తమ నివేదికను ఈ లేఖతో పాటు పంపుతున్నామని, తమ ఆధారాలు అసత్యాలు ఎలా అవుతాయో నిరూపిస్తూ ఈనెల 20లోపు నివేదికను సమర్పించాలని కోరారు. అదే సమయంలో టీటీడీపై చేసిన దూషణలకు బేషరతుగా క్షమాపణలు రాతపూర్వకంగా తెలపాలని కోరారు. చదవండి: హన్మంతుని జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ ఆంజనేయుడు మనవాడే -
పలు పుస్తకాల్లో అయోధ్య గురించి ప్రస్తావించారు
న్యూఢిల్లీ: రామ జన్మస్థలం గురించి పలు ఇంగ్లిష్ పుస్తకాల్లో ఉన్న విషయాలను రామ్‌లల్లా విరాజ్మాన్ హిందూ సంస్థ తరఫు వాదనలు వినిపిస్తున్న లాయర్ వైద్యనాథన్ సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. ఇంగ్లిష్ వ్యాపారి విలియం ఫించ్ 1608–1611కాలంలో భారత్‌ను సందర్శించినపుడు ‘ఎర్లీ ట్రావెల్స్ టు ఇండియా’ పుస్తకం రాశాడని, ఆ పుస్తకంలో రామజన్మస్థలం ప్రస్తావించాడని కోర్టుకు తెలిపారు. అయోధ్యలోని ఓ కోటలో రాముడు జన్మించాడని హిందువులు విశ్వసిస్తున్నట్లు విలియమ్ తన పుస్తకంలో పేర్కొన్నాడని చెప్పారు. దీంతో పాటు బ్రిటీష్ సర్వేయర్ మాంటిగోమేరీ మార్టిన్, జోసెఫ్ టైఫెంథ్లర్ అనే జుసెట్ మిషనరీలు తమ ట్రావెలర్స్‌లో రామజన్మస్థలాన్ని ప్రస్తావించారని కోర్టుకు నివేదించారు. అయితే ఈ ప్రదేశం మొట్టమొదటిసారిగా బాబ్రీ మసీదు అని ఎప్పుడు పిలవబడిందో చెప్పాలని ధర్మాసనం వైద్యనాథన్‌ను ప్రశ్నించింది. 19వ శతాబ్దంలో అలా పిలవబడి ఉండొచ్చని ఆయన తెలిపారు. 19వ శతాబ్దానికి ముందు అలా పిలవబడిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీని గురించి బాబర్నామాలో (బాబర్ గురించి రాసిన పుస్తకం) ఏం రాయలేదా అని అడిగగా.. లేదని వైద్యనాథన్ సమాధానమిచ్చారు. -
పిజ్జా పుట్టిన ప్రాంతంలో పొల్యూషన్ రగడ..!
నేను యాంటీ పిజ్జా మేయర్‌ని అంటున్నాడు... ఇటలీ శాన్ విటలియానో లో సివిక్ లీడర్ గా మారిన ఓ డాక్టర్. ప్రజారోగ్యమే తనకు ముఖ్యమని, అందుకు తనవంతు ప్రయత్నాన్ని ప్రారంభించానని చెప్తున్నాడు. నీపోలిటన్ హింటర్ ల్యాండ్ లోని ఓ చిన్న పట్టణానికి మేయర్ అయిన ఆయన.. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. అందుకు టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్ కలిగించే కట్టెల పొయ్యిల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు కూడ జారీ చేశాడు. అయితే పిజ్జా పుట్టిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో కట్టెల పొయ్యిల నిషేధం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కట్టెల పొయ్యిలను వాడే కుటుంబాలు, పిజ్జాలు తయారు చేసే బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారస్తులు ఇప్పుడు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ వెంటనే రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు కూడ వెల్లువెత్తాయి. అయితే చైనా రాజధాని నగరమైన బీజింగ్ లో ఇప్పటికే కాలుష్య పొగమంచుపై రెడ్ అలర్ట్ ప్రకటించారని, ముందు జాగ్రత్త చర్యగానే తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ చెప్తున్నారు. వాయుకాలుష్యంపై అత్యవసర చర్యలు చేపట్టడంలో భాగంగా... చట్ట పరిమితులు దాటి కాలుష్యాన్నిసృష్టించడాన్ని ఫాల్కోన్ వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గించడంలో భాగంగా ఇప్పటికే ఒక్కోరూ ఒక్కో పద్ధతిని అమల్లోకి తెస్తూనే ఉన్నారు. రోమ్ 'ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్స్' ను ప్రవేశ పెట్టగా... మిలాన్ వారంలో మూడు రోజులపాటు వాహనాల వాడకాన్నేనిషేధించింది. తమవంతు బాధ్యతగా మిలాన్ తో పాటు చాలా నగరాలు న్యూ ఇయర్ వేడుకల్లో టపాసుల వినియోగాన్ని కూడ నిషేధించాయి. అయితే వాయు కాలుష్యంలో యూరప్ లోనే ఇటలీ.. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇటలీలో సంవత్సరానికి సుమారు 30 వేలమంది దాకా కాలుష్యంతో మరణిస్తున్నట్లు 2015 ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో పెరిగే కాలుష్యాన్నినిషేధించేందుకు పురపాలక సంఘాలు కాలుష్య మూలాల నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. జాతీయ వాతావరణ శాఖామంత్రి పర్యావరణంపై పురపాలక సంఘాల ప్రతినిధులతో రోమ్ లో అత్యవసర సమావేశం కూడ నిర్వహించారు. ఇళ్ళలో, కార్యాలయాల్లో థర్మోస్టాట్ల వాడకాన్నినిషేధించారు. నగరాల్లో స్పీడ్ లిమిట్ ను అమల్లోకి తెచ్చారు. పాత కార్ల వాడకానికి స్వస్తి పలికి, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని ఆదేశించారు. పొగ గొట్టాల వాడకంపై కూడ పరిమితులు విధించారు. అయితే చట్టాలు, నిషేధాలతో పొల్యూషన్ ను నియంత్రించడాన్ని అమలు చేస్తున్న లక్షల ప్రాంతాల్లో ఇటలీ ఒకటి. పొల్యూషన్ సమూలంగా నిర్మూలించాలంటే ఇటువంటి బాధ్యతను సక్రమంగా అమలు చేయడం ఫాల్కోన్ వంటి ప్రతి మేయర్ పైనా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక పిజ్జా విక్రయదారులు, వ్యాపారస్తులు ఫిబ్రవరి 29 నాటికి ఓవెన్లకు తగిన పొల్యూషన్ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మార్చి 1 నుంచి ఇనస్పెక్లర్లు తనిఖీలు ప్రారంభిస్తారని, ఫిల్టర్లు లేని రెస్టారెంట్లు, పిజ్జా తయారీదారుల లైసెన్సులు రద్దు చేస్తారని హెచ్చరించారు. కాగా ప్రాణాంతకమైన పొల్యూషన్ నియంత్రణపై అవగాహన అనంతరం పిజ్జా విక్రయదారులు కూడ మేయర్ కు సహకరించేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. అయితే ఇటువంటి పెద్ద సమస్యను మిణుగురు పురుగువంటి తమ చిన్న పట్టణంలో అమలు చేస్తే సరిపోదని, మిగిలిన నగరాల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. -
జన్మస్థలానికి సేవచేయడం అదృష్టం
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వింజమూరు : పుట్టిన ఊరికి సేవ చేయడం వారి అదృష్టమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడి అన్నారు. కేజీఆర్వీఎస్ ట్రస్ట్ ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ శిబిరంలో 2000 మందికి కంటి, దంత, జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్లు, కీళ్లు, ఎముకల నిపుణులు, గైనకాలజిస్ట్ వైద్య పరీక్షలు చేశారు. ఎంపీ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం అనేది పరిసరాల పరిశుభ్రత, తాగునీటిపై ఆధారపడి ఉంటుందన్నారు. పురాతన సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో ప్రజలకు కనీసం మరుగుదొడ్లు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్‌లో భాగంగా 2.13 లక్షల కోట్ల మందికి మరుగుదొడ్లు నిర్మిస్తున్నారన్నారు. 2019 నాటికి నాగరిక పరిశుభ్రత దేశంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లెప్రాంతాల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు ద్వారా వైద్యసేవలు అందించడం అభినందనీయమన్నారు. కొండా కుటుంబ సభ్యులు నగరాల్లో వ్యాపారాలు చేసుకుంటూ తాము సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని నిరుపేదలకు వైద్యం, విద్య, సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఆదర్శనీయమన్నారు. వైద్యశిబిరాల్లో గుర్తించిన శస్త్ర చికిత్సలను కూడా ఉచితంగా చేయించడం సంతోషకరమన్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం ముదావహమన్నారు. ట్రస్ట్ సేవలు అభినందనీయం : మాజీ ఎమ్మెల్యే మేకపాటి వింజమూరులో కేజీఆర్వీఎస్ ట్రస్ట్ సేవలు అందించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. తన చేతుల మీద ప్రారంభించిన ట్రస్ట్ ఈ రోజు నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఉచిత వైద్యం, విద్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం సంతోషకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో పేదలకు ఖర్చు చేయాలన్నారు. ధనవంతులు, నాగరికత బాగా తెలిసిన వారు వింజమూరులో ఉన్నందున మరిన్ని ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు సాయం చేయాలన్నా రు. ఎవరైతే బతికున్నప్పుడు ప్రజలకు సేవలందిస్తారో చనిపోయిన తర్వాత కూడా వారి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. తాము కూడా విద్య, వైద్య సేవలు చేయడానికి సహకరిస్తామన్నారు. మేకపాటి సోదరులకు ఘనస్వాగతం : కేజీఆర్వీఎస్ ట్రస్ట్ ఉచిత మెగావైద్యశిబిరాన్ని ప్రాంభించేందుకు వచ్చిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక శ్రీవివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులను మేకపాటి సోద రులను ఆత్మీయంగా పలకరించారు. మేకపాటి సోదరులను కేజీఆర్వీఎస్ ట్రస్ట్ ప్రతినిధులు సన్మానించారు. అన్నిరకాల వైద్యశిబిరాల్లోని వైద్యబృందాన్ని మేకపాటి సోదరులు పలకరించారు. వైద్యులు కూడా మేకపాటి సోదరులకు వైద్యపరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గణపం కృష్ణకిరణ్‌రెడ్డి, తహశీల్దార్ టి.శ్రీరాములు, వింజమూరు, కలిగిరి సర్పంచ్‌లు గణపం బాలకృష్ణారెడ్డి, పావులూరి మాల్యాద్రిరెడ్డి, విశాంత్ర డీఎంహెచ్ఓ కె.మాశిలామణి, కేజీఆర్వీఎస్ ట్రస్ట్ చైర్మన్ కె.రామాచంద్రరావు, కార్యదర్శి కొండా చినవెంకటేశ్వర్లు, ట్రెజరర్ కొండా వెంకటేశ్వర్లు, ట్రస్ట్ వ్యవసాపకుడు కొండా వెంకటప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించండి
పాతగుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో అక్టోబర్ 2వ తేదీ నుంచి జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది,పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలపై ప్రజలలో సంపూర్ణ అవగాహన కలిపించాలని ఆయన సూచించారు. జన్మభూమి- మాఊరు కార్యక్రమంపై అక్టోబర్ 2వ తేదీన గ్రామాలలో ర్యాలీ, 4వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. అలాగే ఎంపీడీవో, తహశీల్దార్ నేతృత్వంలో మండలానికి రెండు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం ఒక గ్రామం, మధ్యాహ్నం ఒక గ్రామంలో ఈ బృందాలు పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలన్నారు. తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని వచ్చే నెల 2 తేదీ నుంచి 31 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో నిర్వహించాలన్నారు. కళా జాతాల ద్వారా ప్రతి ఇంటిని సందర్శించి పారిశుద్ధ్య కార్యక్రమం వారి గృహాల్లో అమలయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలలో తేదీల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జన్మభూమిలో కనీసం రెండు రోజులు జిల్లాలోని ఒకటి, రెండు గ్రామాలను ముఖ్యమంత్రి సందర్శించే అవకాశం ఉందని చెప్పారు. శంకుస్థాపన చేయవలసిన కార్యక్రమాలను గుర్తించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణాలలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన చేబ్రోలు, చిలక లూరిపేట, నరసరావుపేట, పెదనందిపాడు, సత్తెనపల్లి, వినుకొండ మండలాల అభివృద్ధి అధికారులను కలెక్టర్ అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర మండలాల అధికారులు లక్ష్యాలను ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రచార పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏజేసీ కె. నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు, డ్వామా పీడీ ఢిల్లీరావు, డీఆర్డీఏ పీడీ పి.ప్రశాంతి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ జి. వేణు, జిలా పంచాయతీ అధికారి గ్లోరి యా తదితరులు పాల్గొన్నారు.