baseless allegations
-
టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు తగదు
తిరుమల: హనుమంతుని జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని నిర్ధారించడాన్ని తప్పుబడుతూ కర్ణాటకలోని కిష్కింధలోని హనుమద్ జన్మభూమి తీర్థట్రస్టు (ఆర్) చేసిన ఆరోపణలు నిరాధారమైనవని టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆక్షేపించారు. హనుమంతుని జన్మస్థలం ముమ్మాటికీ కర్ణాటకలోని తుంగభద్ర తీరంలో ఉన్న కిష్కింద పర్వతమేనని హనుమద్ జన్మభూమి తీర్థట్రస్టు ఇటీవల టీటీడీకి లేఖ రాసింది. ఈ మేరకు శనివారం హనుమద్ జన్మభూమి ట్రస్టు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ లేఖకు టీటీడీ ప్రత్యుత్తరాన్ని పంపినట్టు పేర్కొన్నారు. టీటీడీ ఏర్పాటు చేసిన పండిత పరిషత్తు నాలుగు నెలలపాటు పరిశోధించిన పౌరాణిక, శాసన, భౌగోళిక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలమని నిరూపించి నిర్దిష్ట నివేదిక సమర్పించిందన్నారు. హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తమ నివేదికను ఈ లేఖతో పాటు పంపుతున్నామని, తమ ఆధారాలు అసత్యాలు ఎలా అవుతాయో నిరూపిస్తూ ఈనెల 20లోపు నివేదికను సమర్పించాలని కోరారు. అదే సమయంలో టీటీడీపై చేసిన దూషణలకు బేషరతుగా క్షమాపణలు రాతపూర్వకంగా తెలపాలని కోరారు. చదవండి: హన్మంతుని జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ ఆంజనేయుడు మనవాడే -
సీజేఐపైనే అనుచిత వ్యాఖ్యలా?
న్యూఢిల్లీ: ఓ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించినందుకు ప్రధాన న్యాయమూర్తిని కించపరిచేలా పరోక్షంగా వ్యాఖ్యానించిన లాయర్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో సదరు లాయర్ చేసిన వ్యాఖ్యలు, పంపిన సందేశాలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని మండిపడింది. అలాంటి ఆరోపణలు న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. తామిచ్చే తీర్పులను ఏ వేదికపై చర్చించినా అభ్యంతరం లేదని, కానీ న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. ‘కుప్పలుతెప్పలుగా వచ్చిపడే పిటిషన్లలో వేటిని అత్యవసరంగా విచారించాలో సీజేఐ నిర్ణయిస్తారు. ఏదైనా పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించినంత మాత్రాన సీజేఐని లక్ష్యంగా చేసుకుని సదరు లాయర్ సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేస్తారా?’ అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఓ జడ్జి వ్యాఖ్యలను లాయర్ ఉటంకించడాన్ని కూడా బెంచ్ తప్పుపట్టింది. కోర్టులో ఊరట లభించకపోతే జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని బెంచ్ పేర్కొంది. -
‘కవితపై ఆరోపణలు చేస్తే సహించం’
మల్లాపూర్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవి తపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలంగాణ జాగృతి అడహక్ జిల్లా కో-కన్వీనర్ గనవేని మల్లేశ్ హెచ్చరించారు. మండల కేం ద్రంలోని భరతమాత కూడలి వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో టీడీ పీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన రేవంత్‌రెడ్డి ఆంధ్రపాలకుల తొత్తుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మండల కన్వీనర్ ఏనుగు రవీందర్‌రెడ్డి, విద్యార్థి విభాగం మండల కన్వీనర్ ఎగ్యారపు రాకేశ్, కో-కన్వీనర్ రాజోజి సాయిరాం, మారుగొండ మహిపాల్, పెంట రమేశ్, నలువల రమేశ్, మహేశ్ పాల్గొన్నారు. -
రాజకీయ దుష్టక్రీడలో జెపి ఓ పావు: కొణతాల
హైదరాబాద్: రాజకీయ దుష్టక్రీడలో లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ ఓ పావుగా మారారని అనిపిస్తోందని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహరాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరాధార ఆరోపణల విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో జేపీ పోటీపడుతున్నారన్నారు. జగన్ బయటకు రావడంతో కొన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారిస్తే జగన్ త్వరగా నిర్దోషిగా బయటకు వస్తారని కొణతాల చెప్పారు. -
రాజకీయ దుష్టక్రీడలో జెపి ఓ పావు: కొణతాల