
రాజకీయ దుష్టక్రీడలో జెపి ఓ పావు: కొణతాల
రాజకీయ దుష్టక్రీడలో లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ ఓ పావుగా మారారని అనిపిస్తోందని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహరాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు.
హైదరాబాద్: రాజకీయ దుష్టక్రీడలో లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ ఓ పావుగా మారారని అనిపిస్తోందని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహరాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరాధార ఆరోపణల విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో జేపీ పోటీపడుతున్నారన్నారు.
జగన్ బయటకు రావడంతో కొన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారిస్తే జగన్ త్వరగా నిర్దోషిగా బయటకు వస్తారని కొణతాల చెప్పారు.