‘కవితపై ఆరోపణలు చేస్తే సహించం’ | trs people fire on tdp leaders | Sakshi
Sakshi News home page

‘కవితపై ఆరోపణలు చేస్తే సహించం’

Published Fri, Nov 14 2014 4:17 AM | Last Updated on Thu, Aug 9 2018 9:13 PM

‘కవితపై ఆరోపణలు చేస్తే సహించం’ - Sakshi

‘కవితపై ఆరోపణలు చేస్తే సహించం’

మల్లాపూర్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవి తపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలంగాణ జాగృతి అడహక్ జిల్లా కో-కన్వీనర్ గనవేని మల్లేశ్ హెచ్చరించారు. మండల కేం ద్రంలోని భరతమాత కూడలి వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో టీడీ పీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు.

తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన రేవంత్‌రెడ్డి ఆంధ్రపాలకుల తొత్తుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మండల కన్వీనర్ ఏనుగు రవీందర్‌రెడ్డి, విద్యార్థి విభాగం మండల కన్వీనర్ ఎగ్యారపు రాకేశ్, కో-కన్వీనర్ రాజోజి సాయిరాం, మారుగొండ మహిపాల్, పెంట రమేశ్, నలువల రమేశ్, మహేశ్ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement