Telangana awareness
-
గాంధేయ మార్గంలో.. సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా..
-
గాంధేయ మార్గంలో.. సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా..
సాక్షి, హైదరాబాద్: ‘గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి –నూతన ఆవిష్కరణ’లే ప్రధాన ఎజెండాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి నోవాటెల్‌లో అంతర్జాతీయ యువజన సదస్సు ప్రారంభమైంది. 135 దేశాలకు చెందిన 550 మంది ప్రతి నిధులతోపాటు 16 దేశాల నుండి డెబ్బై మందికిపైగా నిపుణులు హాజరయ్యారు. తొలిరోజు సం ప్రదాయ దుస్తుల్లో హాజరైన దేశ, విదేశీ ప్రతినిధులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. వారికి తెలంగాణ వంటకాలు వడ్డించారు. ఐక్యరాజ్యసమితి లక్ష్యసాధనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు పేదరిక నిర్మూలన, ఆహార సమృద్ధి, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, జెండర్ ఈక్వాలిటీ వంటి పదిహేడు అంశాలపై లోతైన చర్చలు, విశ్లేషణలు సాగనున్నాయి. అన్నా హజారే తొలివక్తగా... పద్మభూషణ్ అన్నాహజారే శనివారం ఉదయం సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ తాపా ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. సదస్సులో ప్రముఖ జర్నలిస్టు శేఖర్‌గుప్తా, ఎంపీలు గౌరవ్ గొగోయ్, అసదుద్దీన్ ఒవైసీ, కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొననున్నారు. ఆయా సెషన్లలో వివిధ అంశాలపై మాసిడోనియా మాజీమంత్రి గ్లీగోర్, యూకే ఎంపీ సీమా మల్హోత్రా, న్యూజిలాండ్ ఎంపీ కన్వల్జిత్సింగ్ బక్షీ, శ్రీలంక డిప్యూటీ మినిస్టర్ బుధీక పతిరాన పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం వివిధ అంశాలపై అర్పిత్ చతుర్వేది, పుల్లెల గోపీచంద్, కమల్‌సింగ్, షబ్నం సిద్ధిఖీ, అండ్రూ ఫ్లెమింగ్, సీమా మల్హోత్రా తదితరులు ప్రసంగిస్తారు. భవిష్యత్ అవసరాల కోసమే: ఎంపీ కవిత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే దిశగా మూడు రోజుల అంతర్జాతీయ యువజన సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల తెలిపారు. -
చిత్రాలు అరుదు.. రక్షణ కరువు!
- పిల్లలమర్రి ఆలయంలో కాకతీయుల కాలం నాటి అద్భుత కళ - అవగాహన లేక పాడుచేస్తున్న దేవాలయ సిబ్బంది సాక్షి, హైదరాబాద్: సాగర మథనం.. అమృతం కోసం దేవతలు, రాక్షసులు వాసుకిని తాడుగా చేసుకుని పర్వతంతో చిలు కుతున్నారు.. ఇంతలో గరళం వచ్చింది.. భయంకరమై న ఆ విషం వాసనకు కొందరు రాక్షసులు కిందపడిపోయారు.. ఇలా విషపు ఘాటుకు రాక్షసులు పట్టుతప్పిన తీరు పెద్దగా ప్రచారంలో లేదు.. కానీ... ఏడొందల ఏళ్ల కిందట చిత్రించిన ఓ దృశ్యం దీన్ని ప్రత్యే కంగా తెలుపుతోంది. ఇదొక్కటే కాదు.. రామరావణ యుద్ధంలో కూడా కొన్ని అరుదైన ప్రత్యేకతలు ఆ చిత్రాల సొంతం! ఆ చిత్రాలెక్కడున్నాయో తెలుసా.. సూర్యాపేటకు సమీపంలో ఉన్న పిల్లలమర్రి నామేశ్వరాలయం ఈ అద్భుత, పురాతన కుడ్య చిత్రాలకు వేదికగా ఉంది. ఇలా దేవాలయాల్లో కుడ్య చిత్రాలు అరుదు. పురాతన ఆల యాల్లో ఎక్కడోగాని ఇవి కనిపించవు. నాటి సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక పరిస్థితులకు ఇవి ప్రతిబింబంగా ఉంటాయి. నాటి పరిస్థితులను అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి. తెలంగాణలో ఇలా కుడ్య చిత్రాలున్న దేవాలయాలు రెండు చోట్ల మాత్రమే ఉన్నాయని పురావస్తు శాఖ పేర్కొంటోంది. అంత అరుదైన ఈ చిత్రాలు ఇప్పుడు దేవాదాయ శాఖ నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే మూడొంతుల చిత్రాలు ధ్వంస మయ్యాయి. పురావస్తుశాఖృదేవాదాయ శాఖ మధ్య సమన్వయం లేకపోవటంతో ఈ చిత్రాలు అదృశ్యమయ్యే దుస్థితికి చేరుకున్నాయి. కాకతీయుల కాలంలో... పిల్లలమర్రిలో కాకతీయులు త్రికూటాలయాన్ని నిర్మించారు. ఈ శివాలయం కొద్దికాలానికే మహ్మదీయ రాజుల దండ యాత్రలో కొంత ధ్వంసం కాగా.. 14వ శతాబ్ద కాలంలో పున ర్నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ సమ యంలో ఆలయం ముఖ మంటపం రాతి దూలాలపై ఇతిహాసగా«థలను చిత్రాల రూపంలో సంక్షిప్తం చేశారు. ఈ కుడ్య చిత్రాలను సహజ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. 10 నుంచి 12 అడుగుల పొడవున్న ఈ దూలాలపై అంతే పొడవుతో వీటిని చిత్రించారు. కాలక్రమంలో ఇవి పూర్తిగా మసకబారిపోవటంతో పదేళ్ల క్రితం పురావస్తు శాఖ కెమికల్ ట్రీట్మెంట్ నిర్వహించి మళ్లీ వెలుగులోకి తెచ్చింది. కానీ పరిరక్షణను మాత్రం గాలికొది లేశారు. ఆలయాన్ని నిర్వహించే దేవాదాయశాఖ సిబ్బందికి వీటిపై అవగాహన కూడా లేకపోవటంతో అవి ధ్వంసమ య్యాయి. ఆలయ గోడలకు ఇష్టారీతిలో లైట్లు, స్విచ్ బోర్డులు, వైర్లు ఏర్పాటు చేశారు. అందుకు ఎడాపెడా మేకు లు, కొయ్యలు ఏర్పాటు చేశారు. వైర్లు రాసుకుపోవటంతో చిత్రాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటికైనా పరిరక్షించాలి.. పిల్లలమర్రి ఆలయంలో ఇటీవల ఈ చిత్రాలపై అధ్యయనానికి వచ్చిన ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంత అధ్యాపకు రాలు మైనేని కృష్ణకుమారి.. వాటిని చూసి అబ్బురపడ్డారు. అవి చాలా అరుదని గుర్తించి తాజాగా తాను రాసిన పుస్తకంలో వివరాలు నిక్షిప్తం చేశారు. భావి తరాలకు అందే వీలు లేకుండా ఈ చిత్రాలను నాశనం చేస్తున్నారని ఆమె ‘సాక్షి’ వద్ద వాపోయారు. ఆ చిత్రాలను వెంటనే పరిరక్షించాలని కోరారు. తెలంగాణ జాగృతికి చెందిన శ్రీరామోజు హర గోపాల్ కూడా ఇటీవల వాటిని పరిశీలించి చిత్రాలను ఫొటోల రూపంలో పదిలపరిచే పని ప్రారంభించారు. -
అంబరాన్నంటిన సంబురాలు
నిర్మల్‌రూరల్ : ఇంటి ముందు ఆకట్టుకున్న ఆడపడుచుల రంగవల్లులు..డాబాపైన ఎగిరిన చిన్నారుల వినూత్న పతంగులు.. వాళ్లతో కలిసి కేరింతలు కొట్టిన పెద్దలు.. నోములు ఇచ్చిపుచ్చుకున్న సుహాసినులు.. గోమాతకు చేసిన పూజలు.. ఇలా భోగి, సంక్రాంతి, కనుమలు.. ముచ్చటగా గడిచిపోయిన మూడురోజులు. పల్లె నుంచి పట్టణం దాకా అంతటా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. పట్టణంలోని బంగల్పేట్ చౌరస్తాలో శనివారం సాయంత్రం భోగి మంటలు వేసి, సంక్రాంతి సంబురాలు ప్రారంభించారు. ‘స్వామియే శరణమయ్యప్పా..’ అంటూ అయ్యప్పస్వామి శరణుఘోషతో పట్టణంలోని మల్లన్నగుట్టపై గల హరిహరక్షేత్రం మార్మోగింది. అభినవ శబరిమలగా పేరొందిన ఆలయంలో సంక్రాంతి సందర్భంగా మకరజ్యోతి దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్(మామడ) : మండలంలోని పొన్కల్ గ్రామంలో శనివారం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మమత, రశ్మిత, అక్షయలు వేసిన ముగ్గులు బహుమతులను గెలుచుకున్నారు. సారంగాపూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో శని, ఆదివారాలు సంక్రాంతి పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి సందర్భంగా మండలంలోని బోరిగాం గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. లక్ష్మణచాంద : మండలంలోని వివిధ గ్రామాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే వాకిళ్లలో రంగు రంగుల ముగ్గులను అందరంగా తయారు చేసారు. యువకులు ,పిల్లలు అనే తేడా లేకుండా అందరు కలిసి హుషారుగా గాలిపటాలను ఎగురవేశారు. -
ఉత్తర అమెరికా తెలంగాణ జాగృతి శాఖ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా శాఖను ఆ విభాగం అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ఆదివారం డెట్రాయిట్ నగరంలో ప్రారంభించారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసిన ఆమె అనంతరం తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాకారం చేసేందుకు, బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు ప్రవాసులు ముందుకు రావాలని కవిత పిలుపునిచ్చారరు. డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ, తానా, నాటా, ఆటా, నాట్స్, తెలంగాణ ఎన్నారై అసోసియేషన్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఎంపీ కవితను ఘనంగా సన్మానించారు. కాగా, ఉత్తర అమెరికా తెలంగాణ జాగృతి కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఎంపీ కవిత ప్రకటించారు. బండారు శ్రీధర్, సుమంత్ గరకరాజుల, కిరణ్ గుంటిక, మురళి బొమ్మనవేని, బిందులత, వెంకట్ మంతెన తదితరులు కార్యవర్గంలో ఉన్నారు. -
‘కవితపై ఆరోపణలు చేస్తే సహించం’
మల్లాపూర్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవి తపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలంగాణ జాగృతి అడహక్ జిల్లా కో-కన్వీనర్ గనవేని మల్లేశ్ హెచ్చరించారు. మండల కేం ద్రంలోని భరతమాత కూడలి వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో టీడీ పీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన రేవంత్‌రెడ్డి ఆంధ్రపాలకుల తొత్తుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మండల కన్వీనర్ ఏనుగు రవీందర్‌రెడ్డి, విద్యార్థి విభాగం మండల కన్వీనర్ ఎగ్యారపు రాకేశ్, కో-కన్వీనర్ రాజోజి సాయిరాం, మారుగొండ మహిపాల్, పెంట రమేశ్, నలువల రమేశ్, మహేశ్ పాల్గొన్నారు.