ఉత్తర అమెరికా తెలంగాణ జాగృతి శాఖ ప్రారంభం | the branch of north america telangana Awareness started | Sakshi
Sakshi News home page

ఉత్తర అమెరికా తెలంగాణ జాగృతి శాఖ ప్రారంభం

Published Sun, Apr 5 2015 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

the branch of north america telangana Awareness started

హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా శాఖను ఆ విభాగం అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ఆదివారం డెట్రాయిట్ నగరంలో ప్రారంభించారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసిన ఆమె అనంతరం తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాకారం చేసేందుకు, బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు ప్రవాసులు ముందుకు రావాలని కవిత పిలుపునిచ్చారరు.

 

డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ, తానా, నాటా, ఆటా, నాట్స్, తెలంగాణ ఎన్నారై అసోసియేషన్, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఎంపీ కవితను ఘనంగా సన్మానించారు. కాగా, ఉత్తర అమెరికా తెలంగాణ జాగృతి కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఎంపీ కవిత ప్రకటించారు. బండారు శ్రీధర్, సుమంత్ గరకరాజుల, కిరణ్ గుంటిక, మురళి బొమ్మనవేని, బిందులత, వెంకట్ మంతెన తదితరులు కార్యవర్గంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement